S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

08/23/2018 - 23:45

మన వాణిజ్య వ్యవహారాల చట్టాలను సవరించాలన్నది అమెరికా వ్యక్తం చేసిన సరికొత్త కోరిక. తమ దేశం నుంచి మన దేశానికి తరలివస్తున్న వస్తువులపై మన ప్రభుత్వం విధిస్తున్న పన్నులను- సుంకాలను- గణనీయంగా తగ్గించి వేయాలట, పూర్తిగా ఎత్తి వేసినట్టయితే మరీ మంచిదట!

08/23/2018 - 00:02

మూసీ నదిని పరిరక్షించడానికి వీలుగా తక్షణ చర్యలను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైదరాబాదు హైకోర్టు మంగళవారం ఆదేశించవలసిన అనివార్యం ఏర్పడడం- పెరిగిన నీటి కాలుష్య దుస్థితికి మరో నిదర్శనం. ‘మూసీ నదిని సుందర శోభలతో తీర్చిదిద్దడం తరువాతి సంగతి..

08/21/2018 - 23:37

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ పౌర ప్రభుత్వం అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు ఉత్తరం వ్రాయడం వల్ల అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌కు గౌరవం పెరిగింది. పాకిస్తాన్‌లో వాస్తవానికి రెండు ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. మొదటిది ‘సైనిక దళాల ఆధిపత్యం’. ఇది రాజ్యాంగంతో కాని చట్టాలతో కాని నిమిత్తం లేని మతోన్మాద జిహాదీ నియంతృత్వం. ఈ నియంతృత్వ ‘స్వభావం’ భారత వ్యతిరేకత.

08/20/2018 - 23:11

రూపాయి విలువ ఆగస్టు పదునాలుగవ తేదీన అభూత పూర్వస్థాయికి పతనమైంది. అమెరికా ‘డాలర్’ విలువ డెబ్బయి రూపాయలకు చేరడం ఈ ‘పతనం’. రూపాయి విలువ పడిపోవడం వల్ల ఆందోళన చెందనవసరం లేదన్నది దశాబ్దుల తరబడి ప్రభుత్వం చెబుతున్న మాట. అందువల్ల బ్రిటన్ విముక్త భారతదేశంలో రూపాయి విలువ దిగజారిపోతూనే ఉంది.

08/18/2018 - 00:09

‘ఒకడు నిశాతటిని చీల్చి
దిశ చూపిన దినకరుడు
ఒకడు మతోన్మాద మతిని
మసి చేసిన నిటలాక్షుడు
ఒకడు దనుజరీతి కూల్చి
ధర్మం నిలిపిన రాముడు
ఒక్కొక్కడు సరిహద్దుకు
ప్రాణం పోసిన అమరుడు’

08/17/2018 - 00:13

ఆయన జీవన గరిమను ఆవిష్కరించగల అక్షరాలు లేవు, ఆయన భౌతిక నిష్క్రమణ వల్ల క్రుంగుతున్న హృదయాల ఆవేదనను వ్యక్తం చేయగల భావాలు లేవు. జాతీయతా పథంలో తొంబయి మూడేళ్లు సాగిన ఆయన ప్రస్థానం దేశ ప్రజలకు నిరంతర స్ఫూర్తి, ఆయన భరతమాతకు కీర్తి.. నైతిక నిబద్ధమైన, సైద్ధాంతిక కటిబద్ధమైన ఆయన జీవితం మాతృదేశ చరణ సన్నిధిలో కళకళలాడిన పరిమళ ‘కమలం’.. ఆ కమలం వాడనిది, ఆ పరిమళం వీడనిది! ఆ కమల ధ్వజుడు అటల్ బిహారీ వాజ్‌పేయి..

08/16/2018 - 00:23

మాతృభూమి కేవలం మట్టిముద్ద కాదన్నది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి గుర్తుచేసిన సనాతన వాస్తవం. బ్రిటన్ వారి బీభత్స పాలన నుండి భరతజాతి విముక్తమైన తరువాత ప్రతి ఏట స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

08/15/2018 - 00:00

మన దేశం బ్రిటన్ భౌతిక దురాక్రమణ నుండి విముక్తమైన తరువాత ఏడు దశాబ్దులు గడిచాయి, మరో ఏడాది కూడ గడిచింది. శతాబ్దుల పాటు భరతజాతి విదేశీయ బీభత్సకాండకు, దమనకాండకు గురికావడం ఈ భౌతిక విముక్తికి సుదీర్ఘ నేపథ్యం. కలియుగం ఆరంభమైన తరువాత ఐదువేల నూట పంతొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి, ప్రస్తుతం నడుస్తున్న ‘విలంబ’ నామ సంవత్సరం ఐదువేల నూట ఇరవయ్యవది.

08/14/2018 - 00:23

దేశంలో దాదాపు ఇరవై నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నది సరికొత్త సమాచారం. ఈ ‘ఖాళీల’లో పదిలక్షల పదివేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లోని అధ్యాపకులకు సంబంధించినవి. ఉన్నత పాఠశాలల్లో లక్షకు పైగా అధ్యాపక పదవులు ఖాళీగా ఉన్నాయట. మిగిలిన ఖాళీలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు సంబంధించినవి.

08/10/2018 - 23:02

పాఠశాలల సమీపంలోని రహదారుల మీద పరుగులు తీసే వాహనాలు ‘కూతలు’ వేయరాదన్నది ఆదర్శం! ఈ ఆదర్శం ఇన్ని దశాబ్దులుగా ఆచరణకు రాలేదన్నది ఇప్పుడు బయటపడిన వాస్తవం. తెలంగాణ ప్రాంతంలోను ప్రధానంగా రాజధాని భాగ్యనగరంలోను బడులలోని బుడుతలు ఇన్నాళ్లుగా ఈ వాహన యంత్రాల ‘కారు’కూతలను వింటూనే ఉన్నారన్నది హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానం వారి దృష్టిని ఆకర్షించిన వైపరీత్యం.

Pages