S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

12/15/2019 - 00:14

బ్రిటన్ పార్లమెంటు ‘ప్రతినిధుల సభ’- హవుస్ ఆఫ్ కామన్స్- ఎన్నికలలో ప్రధాని బోరిస్ జాన్‌సన్ నాయకత్వంలోని ‘కన్సర్వేటివ్ పార్టీ’ సాధించిన ఘన విజయం బ్రిటన్ ప్రజల ‘జాతీయ నిష్ఠ’కు మరో ధ్రువీకరణ. గురువారం ‘మత ప్రదానం’-పోలింగ్- జరిగిన ఈ ఎన్నికలలో ఐరోపా ఆర్థిక సమైక్యవాదులు ఘోర పరాజయం పాలుకావడం చారిత్రక పరిణామం. ఈ చారిత్రక పరిణామం ‘విపరిణామం’కాగలదా? ‘శుభ పరిణామం’ కాగలదా?

12/13/2019 - 03:35

మానవీయ స్వభావాన్ని ‘మత వివక్ష’గా చిత్రీకరించడానికి జరుగుతున్న ప్రయత్నం ‘పౌరసత్వ సవరణ ప్రతిపాదన’-సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ బిల్- సీఏబీ-ను వ్యతిరేకిస్తున్నవారు చెబుతున్న వికృత భాష్యం! ఈ వ్యితిరేకులు దేశంలో ఉన్నారు, విదేశాలలో ఉన్నారు. ఈ ‘బిల్లు’ను వ్యతిరేకిస్తున్న అంతర్గత విరోధులు ప్రభుత్వాన్ని, దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో అప్రతిష్ఠపాలు చేస్తున్నారు.

12/12/2019 - 04:26

గుజరాత్‌లో వ్యవసాయదారులపై ‘పెప్సి’ వాణిజ్య సంస్థ ‘జులుం’ చేస్తుండడం ఒక ఉదాహరణ..! చరిత్ర పునరావృత్తం అవుతోంది.. విదేశీయ సంస్థలు స్వదేశీయ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం, నిర్దేశించడం ఈ పునరావృత్తి! ‘పెప్సి’- అనే ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’వారు గుజరాత్‌లో ఆలుగడ్డ- బంగాళాదుంప, ఉర్లగడ్డ-ల వ్యవసాయాన్ని నియంత్రిస్తుండడం పునరావృత్త చరిత్రలో నడుస్తున్న ఘట్టం!

12/11/2019 - 05:10

నగరాలు నిలువున పెరుగుతుండడం మన జాతీయ జీవన ప్రగతి రథప్రస్థానాన్ని నిలదీస్తున్న వైపరీత్యం! అంగారక గ్రహానికి అంతరిక్ష నౌకను పంపగల దేశంలో అంగార జ్వాలలు అంతస్థుల భవనాలను ఆహుతి కొంటుండడానికి కారణం ఈ ‘నిలువు’ వైపరీత్యం! పాత గోడలు వర్షాకాలంలో కూలిపోవచ్చు, కాని కొత్త కట్టడాలు ఎండల కాలంలో సైతం కూలిపోతున్నాయి.

12/10/2019 - 23:46

‘న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపాన్ని సంతరించుకోరాదు.. అదే జరిగితే న్యాయం తన సహజ గుణాన్ని కోల్పోతుంది.. సత్వర న్యాయం అంటూ ఎక్కడా ఉండదు.. కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న సమయం, అందులో జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాని పరిస్థితి, వైఖరిని మనం పునఃపరిశీలించాల్సి ఉంది..

12/10/2019 - 23:34

శరణార్థుల శిబిరంలో
పురుడు పోసుకున్న శిశువు,
ఆకాశపు నీడలందు
ఆటలాడు చిన్ని శిశువు,
తరతరాల చారిత్రక
సహనానికి సింధువు...
సంధించడు, చిందించడు
ఒక నిరసన బిందువు!

12/10/2019 - 23:22

పాకిస్తాన్ సైనిక దళాల ప్రధాన అధికారి క్వామర్ జావీద్ బజవా పట్ల అక్కడి సైనిక దళాలలో వ్యతిరేకత పెరుగుతుండడం పెద్దగా ప్రచారం కాని పరిణామం. పదవీ కాలవ్యవధి ముగిసిన తరువాత మరో మూ డేళ్లు పదవిలో కొనసాగాలన్న బజవా వ్యూహానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ‘బెడిసికొట్టుడు’కు కారణం సైనిక దళాలలో బజవాకు తగ్గిపోయిన పలుకుబడి.

12/05/2019 - 00:44

మన అండమాన్, నికోబార్ దీవుల సమీపంలోని సముద్ర జలాలలో గూఢచర్య కలాపాలను నిర్వహిస్తుండిన చైనా నౌకను మన నౌకాదళం వారు తరిమివేయడం చైనా దురాక్రమణ వ్యూహానికి ఎదురుదెబ్బ! చైనా ప్రభుత్వం కవ్వింపు చర్యలను మానలేదనడానికి ఇది మరో నిదర్శనం. మనదేశాన్ని యుద్ధంలో ఓడించడం వీలుకాదన్నది చైనా గ్రహించిన వాస్తవం. అందువల్లనే క్రీస్తుశకం 1962లో వలె పెద్దఎత్తున మరో దురాక్రమణ సాగించడానికి చైనా పూనుకొనడం లేదు.

12/04/2019 - 00:04

నిర్మాణోం కే పావన్ యుగ్ మే హమ్ చరిత్ర నిర్మాణ కరే- నిర్మాణాలు జరుగుతున్న సమయంలో మనం సౌశీల్యాన్ని నిర్మిద్దాము-అన్నది ఒక హిందీ కవి చెప్పిన మాట! రహదారుల నిర్మాణం నిరంతరం కొనసాగుతున్న సమయంలో ఇలా ప్రజల సౌశీల్యం కూడ పెంపొందడం సమాంతర పరిణామం కావాలన్నది మానవీయ స్ఫూర్తి. సౌశీల్యం లేని వాహన చోదకుల వల్ల నిరంతరం రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి.

12/03/2019 - 00:42

పౌరసత్వపు చట్టానికి ప్రతిపాదిస్తున్న ‘సవరణ’ ఈశాన్య ప్రాంతంలోని ఆరు రాష్ట్రాలకు వర్తింపచేయరాదన్న ప్రభుత్వ నిర్ణయం విచిత్రమైన పరిణామం. అప్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి తరిమివేతకు గురి అయిన ఇస్లామేతర మతాల వారికి మన దేశపు పౌరసత్వం కల్పించడానికి ఈ ‘సవరణ’ వీలు కల్పిస్తోంది. ఇలా పౌరసత్వం పొందిన ‘శరణార్థులు’ దేశంలో ఎక్కడైనా నివసించవచ్చు.

Pages