S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

08/10/2017 - 00:13

అయోధ్య రామజన్మభూమి మందిర ప్రాంగణానికి కొంత దూరంగా మసీదును నిర్మించుకొనడానికి తమకు అభ్యంతరం లేదని షియా కేంద్రీయ వక్‌ఫ్ మండలి వారు స్పష్టం చేయడం సయోధ్య స్వ భావానికి నిదర్శనం. త్రేతాయుగం నాటి రఘురాముడిని ‘మర్యాదా పురుషోత్తముడు...’ అని అభివర్ణించడం ద్వారా షియా ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ‘కేంద్రీయ మండలి’ జాతీయతా నిష్ఠను ప్రకటించడం అభినందనీయం.

08/08/2017 - 23:58

ఆహార భద్రత చట్టం అమలుకాకపోవడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం సోమవారం వ్యక్తం చేసిన ఆగ్రహం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరో న్యాయాభిశంసన! 2013 సెప్టెంబర్ పదవ తేదీన ‘అమలులోకి వచ్చిన’ ఈ చట్టం వాస్తవంగా ‘అమలు జరగడం లేదన్న’ది సర్వోన్నత న్యాయమూర్తులు మదన్ బి లోకుర్, ఎన్‌వి రమణ చేసిన నిర్ధారణ.

08/07/2017 - 23:24

వాణిజ్య ప్రపంచీకరణతో సమాంతరంగా బీ భత్స ప్రపంచీకరణ కొనసాగుతుండడం అం తర్జాతీయ సమాజాన్ని ఆవహించి ఉన్న భయంకర ప్రమాదం. గుజరాత్ సమీపంలో ఇటీవల పట్టుబడిన ‘ఎమ్‌వి హెన్రీ’ లేదా ‘ప్రిన్స్-2’ అన్న బీభత్స నౌక ఇందుకు కారణం! ఈజిప్టు నుంచి పాకిస్తాన్ వరకు గల సువిశాల ప్రాంతం ‘మాదకం’ ముఠాల స్వేచ్ఛా విహార భూమిగా మారిపోయింది!

08/07/2017 - 00:44

హైదరాబాదులోని ఘరానా వైద్యశాలల నిర్వాహకులు పనికిరాని మందులను, కాలదోషం పట్టిన మందులను, వాడేసిన మందుల అవశేషాలను, పరికరాలను ఇతర రకాలైన చెత్తను కుప్పలు తెప్పలుగా బహిరంగ స్థలాలలో రాశులు పోసి వెడుతున్నారు! వ్యాధిగ్రస్తులను వివిధ ప్రక్రియల చికిత్సల పేరుతో, పరీక్షల పేరుతో దోచి పారేస్తున్న ఘరానా ప్రభుత్వేతర వాణిజ్య వైద్యశాలలవారు ఈ ‘చెత్త’ను పారవేయడంలో అగ్రస్థానంలో ఉన్నారట!

08/05/2017 - 02:16

హురియత్ ముఠాలకు చెందిన పేరుమోసిన విద్రోహులను మన ప్రభుత్వం ఇప్పటికీ ని ర్బంధించలేకపోవడం మన భద్రతా విధానంలో నిహితమై ఉన్న వైరుధ్యాలకు నిదర్శనం. గత నెల 24వ తేదీన ఏడుగురు ‘హురియత్’ ముష్కరులను జా తీయ నేర పరిశోధక సంస్థ- నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ- ఎన్‌ఐఏ- అధికారులు అరెస్టు చేసినప్పటి నుంచి కశ్మీర్‌లోయ ప్రాంతంలో హింసాకాండ మరింతగా ప్రజ్వరిల్లుతోంది.

08/04/2017 - 00:45

పులులు సంచరించడానికి అవసరమైన అటవీ వైశా ల్యం క్రమంగా తగ్గిపోతోంది, ఏనుగులు తిరుగాడే ప్రాంతాలు ఎప్పుడో ధ్వంసమయ్యాయి. అందువల్ల దిక్కుతోచని ఏనుగులు పల్లెలలోని, పల్లెల చుట్టూ ఉన్న పొలాలలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. సగటున ప్రతి వారం దేశంలో ఎక్కడో అక్కడ ఊపిరాడని ఏనుగులు ఉసిరేగుతుండడం దశాబ్దుల కథ. పులులు ఇలా చొరబడుతున్న ఘటనలు తక్కువ. ఎందుకంటే వ్యాపార హంతకులు అడవులలోనే పులులను చంపేస్తున్నారు.

08/03/2017 - 00:12

ప్రపంచ వాణిజ్య సంస్థ’- వఠల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- డబ్ల్యుటిఓ- నిర్వాహకులు మిక్కిలి సంతోషిస్తూ ఉండవచ్చు! తాము నిర్దేశించిన రీతిలో మన ప్రభుత్వం ఆర్థిక ‘సంస్కరణ’లు అమలు జరుపుతూ ఉండడం ఇందుకు కారణం కావచ్చు. వర్ధమాన దేశాలలోని సామాన్య జనానికి ప్రభుత్వాలు ఇస్తున్న అన్ని రకాల రాయితీ-సబ్సిడీ-లను రద్దు చేయించడం ఈ నిర్వాహకుల ఆకాంక్ష! ‘వడ్డీ’ శా తాన్ని తగ్గించడం మరో ఆకాంక్ష!!

08/02/2017 - 02:42

ఉత్తరఖండ్‌లోకి కూడ చైనా చొరబడడం విస్తరిస్తున్న దురాక్రమణ వ్యూహానికి మరో నిదర్శనం. మనదేశమంతటా విస్తరించిపోయిన చైనా వాణిజ్య దురాక్రమణకు వ్యతిరేకంగా స్వదేశీయ సంస్థలు ఉద్యమాన్ని ప్రారంభించిన సమయంలోనే ఈ మరో చొరబాటు బయటపడడం విస్మయకరమైన సమాంతర పరిణామం. చైనీయ వస్తువులను బహిష్కరించాలని కోరుతూ ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం’ వం టి జాతీయతా సంస్థలు ప్రస్తుతం ‘జనజాగరణ’ చేస్తున్నాయి.

08/01/2017 - 00:16

సముద్ర మార్గం గుండా దేశంలోకి అక్రమంగా తరలివస్తుండిన పదహైదు వందల కిలోగ్రాముల భయంకర మాదక ద్రవ్యం గుజరాత్ తీరంలో ఆదివారం పట్టుబడడం మనదేశానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న వాణిజ్య బీభత్సకాండలో భాగం. ఈ ‘మాదకం’ విలువ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు! దేశమంతటా తిష్ఠ వేసి ఉన్న మాదకద్రవ్య విక్రేతలైన విదేశీయ ముఠాల వారు మన దేశంలో కూడ వేలాది ముఠాలను రూపొందించడం నడుస్తున్న విష వ్యూహం!

07/31/2017 - 01:59

ప్రధానమంత్రి పదవికి నవాజ్ షరీఫ్ రాజీనామా చేయడం పాకిస్తాన్‌లో నడిచిపోతున్న ప్రజాస్వామ్య నాటకంలో భాగం. ఈ నాటకానికి సూత్రధారి పాకిస్తాన్ సైన్యం. నవాజ్ షరీఫ్ అవినీతిపరుడన్నది ఈ నాటకంలోని ప్రస్తుత ఘట్టం! కానీ నవాజ్ షరీఫ్‌ను సైనిక దళాల వారు వదిలించుకోవాలని భావిస్తుండడం ‘అవినీతి’ కంటే ప్రధానమైన అంశం!

Pages