S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

07/17/2017 - 01:05

ప్రశాంత సాగర-పసిఫిక్ ఓషన్- పరిసరాలలో అశాంతి జ్వాలలను రగిలించిన చైనా ఇప్పుడు హిందూ మహాసముద్రంలో కల్లోల తరంగాలను సృష్టించడానికి యత్నిస్తోంది! తమ దేశానికి దక్షిణంగా, వియత్నాం, మలేసియా, థాయ్‌లాండ్ తదితర ఆగ్నేయ ఆసియా దేశాలకు తూర్పుగా విస్తరించి ఉన్న సముద్రాన్ని చైనా ఇదివరకే ఘర్షణల నిలయంగా మార్చి ఉంది.

07/15/2017 - 00:37

నదీజలాల స్వచ్ఛతను, పర్యావరణ పరిశుభ్రతను పరిరక్షించడానికి అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో విపరీతమైన విలంబనం జరుగుతుండడం ధ్రువపడిన వాస్తవం! అలసత్వం వహిస్తున్న ప్రభుత్వ నిర్వాహకులను న్యాయస్థానాలు పదే పదే అదలిస్తున్నాయి. ‘న్యాయ ప్ర మేయం’ లేకుండా ఏ కార్యక్రమమూ ఆరంభం కాని ‘మందకొడి తనం’ మన ప్రభుత్వాలను ఆవహించి ఉందనడానికి నిరంతరం కొత్త నిదర్శనాలు లభిస్తుండడం నడచిపోతున్న చరిత్ర.

07/14/2017 - 00:43

ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల- నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్-ను నియంత్రించడాని కి వీలుగా ప్రత్యేకమైన చట్టం ఇంతవరకు రూపొందకపోవడం సర్వోన్నత న్యాయస్థానం బుధవారం సంధించిన ప్రశ్నకు నేపథ్యం. ‘ప్రత్యేకమైన చ ట్టాన్ని రూపొందించాలని భావిస్తున్నారా? లేదా?’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.ఖేహర్, న్యాయమూర్తి వై.వి.చంద్రచూడ్ ప్రశ్నించారు! ఈ చట్టాన్ని రూపొందించాలా? వద్దా?

07/13/2017 - 01:45

గోసంతతి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియమావళిని తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు అమలు జరుపరాదని స ర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించడం విచిత్రమైన పరిణామం! ఈ తాత్కాలికమైన నిలిపివేత రా జ్యాంగం నిర్దేశిస్తున్న గో పరిరక్షణ, పాడిపశువుల పరిరక్షణ స్ఫూర్తికి విరుద్ధం! గతంలో సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం గత మే నెలలో ఈ నూతన నియమావళిని రూపొందించింది!

07/12/2017 - 01:04

మరోసారి విస్మయ చకితులం కావడం మినహా మన దేశ ప్రజలు చేయగలిగింది ఏమీ లేదు! అమరనాథ యాత్రికులకు భద్రత కల్పించవలసిన నిఘా వ్యవస్థ కూడా ఏమీ చేయలేనప్పుడు సామాన్య ప్రజలు మాత్రం ఏమి చేయగలరు? అమరనాథుని సందర్శించి తిరిగి వస్తుండిన తీర్థ యాత్రికులలో ఆరుగురు బీభత్స మృత్యువు పాలుకావడం, మరో పదునాలుగు మంది గాయపడడం నిఘా రాహిత్యానికి మరో నిదర్శనం.

07/11/2017 - 00:03

అంతర్జాతీయ ‘కృత్రిమ’ మైత్రిని ద్వైపాక్షిక వె రుధ్యాలు దిగమింగుతున్నాయన్న వాస్తవానికి జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన ప్రముఖ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశం మరోసారి అద్దం పట్టింది! చైనా ‘దళాలు’ భూటాన్‌లోకి, సిక్కింలోకి చొరబడి ఉండడం శుక్ర, శనివారాల్లో జరిగిన ప్ర ముఖ దేశాల-గ్రూప్ ట్వెంటీ-జి20-శిఖర సభకు సమాంతర పరిణామం!

07/10/2017 - 00:50

కేరళ ప్రాంతంలోని కొన్ని అడవులలోకి కొన్ని దశాబ్దుల క్రితం విచిత్రమైన మొక్కలు కొన్ని విదేశాల నుంచి వచ్చిపడినాయట! ఈ విషపు మొ క్కలు తాము మాత్రం విస్తరించి ఇతర వృక్ష జాలాన్ని సర్వసమగ్రంగా నిర్మూలిస్తున్నాయని ప్రచారమైంది. ఇలాంటి ‘కలుపు’ మొక్కలను, వృక్షాలను నిర్మూలించాలన్నది పర్యావరణ శాస్తజ్ఞ్రులు తేల్చిన ‘నిగ్గు’!.

07/08/2017 - 00:50

మన సమష్టి జీవన వ్యవస్థ ‘కల్తీ’ అయిపోతుండటం వౌలికమైన ప్రమాదం. బుద్ధి పూర్వకంగా కొందరు, అమాయకంగా దాదాపు అందరూ కల్తీని ప్రోత్సహిస్తున్నారు. తాము తింటున్న భోజనంలో, తాము ఉపయోగిస్తున్న వస్తువులలో కల్తీ జరుగుతోందన్న ధ్యాస లేకపోవడం ప్రధాన కారణం. అందువల్ల తాము స్వచ్ఛమైన పదార్థాలను ఆరగిస్తున్నామన్న విశ్వాసం జనజీవనాన్ని ప్రధానంగా ఆవహించి ఉంది. కల్తీ వస్తువేది?

07/07/2017 - 00:34

మద్యపాన నియంత్రణ గురించి సర్వోన్నత న్యాయస్థానం వారు చేస్తున్న వ్యాఖ్యలు, అభివ్యక్తీకరణలు ఈ సామాజిక దురాచారాన్ని ప్రోత్సహించడానికి నడుములను బిగించి ఉన్న ప్రభుత్వ నిర్వాహకులకు కొండంత బలాన్ని సమకూర్చుతున్నాయి. మద్యపాన దుష్ప్రభావాన్ని తగ్గించడానికి వీలైన ఆదేశాలను గత డిసెంబర్‌లో సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల నిర్వాహకులకు జారీ చేసింది.

07/06/2017 - 00:24

మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్‌లో అడుగుపెట్టడం అతి పురాతన చరిత్రకు వినూతన శ్రీకారం. భారత ఇజ్రాయిల్ సహజ స్నేహపథంలో విప్లవ శుభారంభం! ‘ఆప్ కా స్వాగత్ హై మేరే దోస్త్’-మిత్రుడా మీకు స్వాగతం- అని భారతీయ భాషలో నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హైందవ జాతీయ పద్ధతిలో చేతులు జోడించి నమస్కరించడం ద్వైపాక్షిక మైత్రీలతకు మరో మారాకు..

Pages