S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

06/10/2017 - 00:25

బ్రిటన్ ప్రధాన మంత్రి థెరీసా మాయ్ మాటను నిలబెట్టుకోలేకపోవడం గురువారం నాడు పా ర్లమెంట్ ‘సామాన్యుల సభ’కు జరిగిన ఎన్నికలలో సంభవించిన ప్రధాన పరిణామం. ప్రస్తుతం తమ కన్సర్వేటివ్ పార్టీకి ‘సామాన్యుల ప్రతినిధుల సభ’- హౌస్ ఆఫ్ కామన్స్-లో ఉన్న సభ్యులలో ఆరుమంది తగ్గిపోయినట్లయితే తాము పరాజయం పాలుకావడం ఖాయమని థెరీసా మాయ్ ప్రచారం సందర్భంగా ప్రకటించింది.

06/08/2017 - 23:50

తెలుగు రాష్ట్రాలలో దొంగతనాలకు గురైన అనేక దేవీ దేవతామూర్తుల విగ్రహాల ఆచూకీ తెలియడం లేదట! ఉభయ రాష్ట్రాల్లోనూ విగ్రహాల దొం గతనాలు నిరంతరం కొనసాగుతున్నప్పటికీ అనేక దొంగతనాల గురించి ఫిర్యాదులు అందడం లేదని పోలీసులే చెబుతున్నారట! విగ్రహాలను దొంగిలించి విదేశాలకు తరలిస్తున్న ముఠాలలో మన దేశంలోకి చొరబడి అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు ఎక్కువమంది.

06/08/2017 - 00:30

నైతిక నిష్ఠ నశించిపోతుండడం వౌలిక సమస్య. ఇలా నశించిన కారణంగా మన సంస్కృతి అక్రమ వాణిజ్యంతో కల్తీ అయిపోయింది! ఈ స్వ భావ సాంకర్య ప్రభావం విస్తరిస్తున్న కొద్దీ మన జాతీయ జీవనం మరింతగా విషపూరితం అవుతోంది! నెయ్యి కల్తీ అయింది, నూనె కల్తీ అయింది, పప్పులు, పోపులు, మసాలాలు, పాలు, కూరగాయలు సమస్త ఆహారం కల్తీ అయిపోయింది.

06/06/2017 - 23:57

తోడేళ్లు దూకడం మానలేదు. ఈ ఉగ్రవాద జి హాదీ మృగాలను మన దేశంలోకి ఉసిగొల్పడం పాకిస్తాన్ ప్రభుత్వం మానడం లేదు. జమ్మూ కశ్మీర్‌లోని బందీపురా శివారులోని సంబల్ వద్ద కేంద్ర రిజర్వు పోలీసు దళం- సిఆర్‌పిఎఫ్- స్థావరంపై ఉగ్రవాదులు ఆదివారం దాడి చేయడం ఈ ‘తోడేళ్ల’ స్వభావానికి సరికొత్త ఉదాహరణ. మన భద్రతా దళాల వారు అప్రమత్తంగా ఉండడం వల్ల భయంకరమైన మరో బీభత్స ప్రమాదం తప్పిపోయింది.

06/06/2017 - 00:10

సంపూర్ణ స్వదేశీయ పరిజ్ఞాన రూపమైన ‘క్రయోజనిక్ ఇంజన్’ విజయం సాధించింది. భూ మి చుట్టూ మరో ఉపగ్రహం తిరగడం మొదలు కావడం భారతీయ అంతరిక్ష పరిశోధన చరిత్రను మ రింత సముజ్వలం చేసిన శాస్ర్తియ పరిణామం! చం ద్రునికి మరో ‘సహచరుడు’ లభించడం కలియుగం 5119వ సంవత్సరం, హేమలంబ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, సోమవారం నాడు సంభవించిన శుభంకర పరిణా మం!

06/05/2017 - 00:26

అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని అమెరికా తిరస్కరించడం ‘ప్ర పంచీకరణ’ కోటలు బీటలు వారుతున్నాయనడానికి మరో నిదర్శనం! ‘ప్రపంచీకరణ’ను వ్యవస్థీకరించడానికి అనేక ఏళ్లపాటు ‘ప్రాబల్య దౌత్య’ దౌర్జన్యాన్ని నడిపిన అమెరికా ఇప్పుడు ‘ప్రపంచీకరణ’ విఘటనను కోరుకుంటోంది! ఇందుకు ప్రధాన కారణం చైనా ‘ఆర్థిక విస్తరణ’!

06/03/2017 - 00:06

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాలో జరిపిన పర్యటనకు ద్వైపాక్షిక ప్రాధాన్యం కంటే బహుళ పక్షీయ ప్రాధాన్యం ఎక్కువగా లభించింది! ఇలా లభించడం మనకూ రష్యాకు మధ్యగల స్నేహ సంబంధాలలో యథాతథస్థితి కొనసాగుతోందనడానికి మరో నిదర్శనం. కుడంకుళంలో రష్యా సహకారంతో మనం నిర్మించుకున్న అణువిద్యుత్ కేం ద్రంలో మరో రెండు ఉత్పాదక యంత్ర వ్యవస్థ- రియాక్టర్-లను నెలకొల్పడానికి ఉభయ దేశాల మధ్య ఒప్పందం కుదరడం కొత్త పరిణామం కాదు.

06/02/2017 - 00:24

సూర్యుడు కొత్తవాడు కాదు.. కానీ ప్రతిదినం కొ త్తగా ఉదయిస్తున్నాడు. మూడేళ్ల క్రితం తెలుగుగడ్డపై సూర్యుడు మరింత కొత్తగా ఉదయించాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు అది శుభోదయం, మరో ‘కొత్త రాష్ట్రం’గా ఏర్పడిన అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అది మరో వినూతన శుభారంభం! 1956 నుంచి కొనసాగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడటం మూడేళ్లనాడు జరిగిన చారిత్రక, రాజ్యాంగ మహా పరిణామం.

06/01/2017 - 03:22

మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జరిపిన జర్మనీ యాత్ర ఉభయ దేశాల మధ్య స్నేహ మాధుర్య విస్తరణకు దోహదం చేసింది! ఈ ద్వైపాక్షిక స్నేహం అవ్యాజమైన మైనది. ఎందుకంటే వాణిజ్యపరంగా ఉభయ దేశాల మధ్య ఎలాంటి భారీ ఒప్పందాలు కుదరలేదు. కుదిరిన వాణిజ్య అంగీకారాలు కేవలం లాంఛనప్రాయమైనవి! వాణిజ్య, వ్యూహాత్మక ప్రయోజనాలను ఆశించి మాత్రమే వివిధ దేశాల ప్రభుత్వ నేతలు విదేశాలలో పర్యటిస్తున్నారన్నది స్పష్టం!

05/31/2017 - 06:34

గోసంతతి పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు జరుపతలపెట్టిన నియమావళిని వ్య తిరేకిస్తున్నవారు భారత రాజ్యాంగ స్ఫూర్తికి వి ఘాతం కలిగిస్తున్నారు. కొన్ని ప్రతిపక్షాలకు కేవలం ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడం ఏకైక కార్యక్రమం. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ దానిని ‘రాజ్యాంగ వ్యతిరేకమని’ చిత్రీకరించడం ఈ ‘కొన్ని’ ప్రతిపక్షాలకు విధానమైపోయింది.

Pages