S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

08/08/2016 - 23:51

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన 123వ నంబరు ఉత్తరువు హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌కె కయత్ ఆగస్టు మూడవ తేదీన రద్దు చేయడం సామాజిక న్యాయసాధన పథంలో మరో ప్రగతిపథం.

08/07/2016 - 23:41

గలగలా కదలిపోతున్న గోదావరీ నదీ జలాలు గ్రామీణ గృహ ప్రాంగణాలలో పరవళ్లు తొక్కడం చారిత్రక శుభపరిణామం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ అభినవ ‘్భగీరథ’ చరిత్ర ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సాకారమైంది...

08/06/2016 - 04:58

నేపాల్ ప్రధానమంత్రిగా పుష్పకమల్ దహల్ ప్రచండ ఎన్నిక కావడం పునావృత్తమైన మరో భారత వ్యతిరేక పరిణామం. 2009లో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన ఈ నేపాల్ మధ్యేమార్గ మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ మహానేత పదవిలో ఉండిన సంవత్సర కాల వ్యవధిలో అనేక భారత వ్యతిరేక విధానాలను రూపొందించాడు. ఆయన అవలంబించిన ఈ విధానాలు బెడిసికొట్టడం వల్లనే ప్రచండ 2009లోపదవీ పరిత్యాగం చేయవలసి వచ్చింది.

08/04/2016 - 23:43

చోదకుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, నిమగ్నతా రాహిత్యం వల్ల కావచ్చు, నిరంతరం పొంచివున్న బీభత్స పిశాచాల దాడుల వల్ల కావచ్చు. విధి వికటించడం వల్ల కావచ్చు...వాహనాలు కూలిపోతున్నాయి, వాహనాలు పేలిపోతున్నాయి, వాహనాలు కాలిపోతున్నాయి. ఢీకొట్టి ప్రాణాలు తీస్తున్నాయి. నదులలోపడి కొట్టుకుపోతున్నాయి. సముద్రాలలో మునిగిపోతున్నాయి.

08/04/2016 - 04:32

ఒక జాతికి ఒకే ఆర్థిక నీతి ఉండాలి. ఒకే దేశం-ఒకేపన్ను- అన్న వాణిజ్య ఆదర్శం వాస్తవంగా మారుతుండడం హర్షదాయకం! వస్తు, సేవల పన్నుల-జిఎస్‌టి-బిల్లుపై ప్రధాన రాజకీయ పక్షాల మధ్య అభిప్రాయ సమానత్వం ఏర్పడడం చారిత్రక పరిణామం. సంబంధిత రాజ్యాంగపు సవరణ బిల్లునకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలపడం పదకొండేళ్ల సమీకృత వాణిజ్య విధాన రూపకల్పన ప్రక్రియకు పరాకాష్ఠ.

08/03/2016 - 00:01

కేంద్ర ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య మరోసారి అధికార, సంఘర్షణ మొదలు కావడానికి రంగం సిద్ధమైనట్టు ప్రచారవౌతోంది. సర్వోన్నత, ఉన్నత న్యాయమూర్తులకు వ్యతిరేకంగా దాఖలయ్యే ఫిర్యాదులను విచారించడానికి ఒక సమగ్ర వ్యవస్థను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొందన్నది ఈ సంఘర్షణకు ప్రాతిపదిక.

08/02/2016 - 01:00

దేశ వ్యవహారాల మంత్రి రాజనాథ్ సింగ్ పాకిస్తాన్‌కు వెళ్లి రావాలన్న ప్రభుత్వ కృతనిశ్చయానికి హఫీజ్ సరుూద్, సలాఉద్దీన్ వంటి జిహాదీలు ఇటీవల జరిపిన బీభత్స యాత్ర లు నేపథ్య వైపరీత్యం! ఇస్లామాబాద్‌నుంచి లాహోర్ వరకు మొదటి యాత్ర జరిపిన ఈ భారత వ్యతిరేక ఉగ్రవాదులు వాఘా వరకు రెండవ యాత్రను జరిపారట! ఈ బహిరంగ ఉగ్రయాత్రలను పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతించడం బీభత్స వ్యవస్థ-టెర్రర్ రిజీమ్-కు మరో నిదర్శనం మాత్రమే!

07/31/2016 - 23:46

రాజకీయం, అభినయం ఒకే నాణేనికి రెండు ముఖాలన్నది మరోమారు స్పష్టమైంది. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిపోతోందని ఆర్భాటం చేస్తున్నవారు, జరుగుతున్న అన్యాయానికి ఇతరులెవరో కారకులని నిర్ధారించడానికి మాత్రమే తీవ్రంగా కృషి చేస్తున్నారు. తాము కారకులు కాదని నవ్యాంధ్ర ప్రజలను నమ్మించడం మాత్రమే వారి లక్ష్యం.

07/30/2016 - 00:10

గందరగోళం మధ్య నిజాయతీ కూడ ప్రస్ఫుటిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వైద్య విధాన పరీక్ష -ఎమ్‌సెట్-2-కు హాజరైన వేలమంది విద్యార్థినీ విద్యార్థులలో అత్యధికులు కష్టపడి చదివి నిజాయతీగా పరీక్షలు వ్రాశారన్నది ఇప్పుడిలా ధ్రువపడింది. ఈ పరీక్షను రద్దుచేయరాదని రాష్టవ్య్రాప్తంగా పరీక్ష వ్రాసినవారు వారి తల్లిదండ్రులు ఆందోళన చేయడం ఇందుకు ప్రత్యక్ష ప్రమాణం.

07/28/2016 - 23:53

గోడ దూకడం తోడేలునకు నిరంతర కృత్యం..చైనా మళ్లీ గోడ దూకింది! ఈసారి ఉత్తరఖండ్‌లోకి చొరబడింది! ఒకచోట దూకుతున్న తోడేలును కాపరులు కనిపెట్టనంతవరకు ఆ వికృత మృగం దూకుతూనే ఉంటుంది! కనిపెట్టిన కాపరులు తోలడానికి తరమడానికి బద్ధకించినట్టయితే ఆ కోరల వృకానికి మరింత ధైర్యం వస్తుంది. తరమడానికి వెళ్లినట్టయితే ఆ హింసమృగం తమను కూడ కరిచి గాయపరస్తుందన్న భయం కాపరులకు కలిగితే మరీ ప్రమాదం.

Pages