S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

07/09/2016 - 07:45

నమామి గంగే-గంగానదీ నీకు నమస్కరిస్తున్నాను- అన్నది నినాదం కాదు, సనాతన భారత జాతీయ జీవన స్వభావం! నమామి గంగే అన్న విస్తృత ప్రక్షాళన కార్యక్రమం గురువారం ఆరంభం కావడం గ్రహణగ్రస్తమై ఉన్న ఈ స్వభావ విముక్తికి మరో శ్రీకారం.

07/08/2016 - 03:13

దేశంలోని దాదాపు మూడవ వంతు భూభాగం నిర్జీవమై పోయిందని, పోతోందని నిగ్గుతేలడం పాలకులకు పాలితులకు ఆందోళన కలిగించవలసిన విపరిణామం! దేశంలోని కనీసం మూడవ వంతు భూభాగం అడవులతో ఆకుపచ్చని అందాలతో, ప్రాకృతిక పరిమళాలతో పరిపుష్టం కావాలన్నది అంతర్జాతీయ ఆదర్శం! ఈ ఆదర్శం మనదేశంలో దశాబ్దులకు పూర్వమే వమ్మయిపోయింది. మొత్తం భూమిలో నాలుగవ వంతు కూడ అటవీ మయమయి లేదు.

07/07/2016 - 07:07

రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆఫ్రికా దేశాల్లో పర్యటించటం ఇదే మొదటిసారి. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మోదీ తన విదేశాంగ విధానాన్ని వ్యూహాత్మకంగా అమలు పరుస్తూ వచ్చారు. ప్రమాణస్వీకారానికి సార్క్ సభ్యదేశాధినేతలందరినీ ఆహ్వానించటంతో ప్రారంభమైన మోదీ ప్రస్థానం వివిధ దేశాల్లో ఒకదాని వెంట ఒకటిగా చేసిన పర్యటనలు సత్ఫలితాలనే ఇచ్చాయి.

07/06/2016 - 01:07

ఆశయంతో కార్యాచరణ పోటీ పడింది. సాధించాల్సిన లక్ష్యానికి లంగరేసే రీతిలోనే ప్రధాని మోదీ రెండో మంత్రివర్గ విస్తరణ సాగింది. కుల, మత ప్రాంతాల అనివార్యతలకూ అనేక కోణాల్లో అద్దంపట్టింది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికలను పరిగణనలోకి తీసుకునే కొత్త మంత్రులను మోదీ ఎంపిక చేసుకున్నారని చెప్పాలి. మంత్రివర్గ సహచరులను ఎంచుకోవడంలో ప్రధాని భారీ కసరత్తే చేశారు.

07/05/2016 - 04:37

వర్షాలు రాలేదన్న ఆందోళన ఎంత తీవ్రంగా యావద్భారతాన్ని కుదిపేస్తుందో..తీరా వర్షాలు పడితే దాని బీభత్సం కూడా అంతగానూ కకావికలం చేస్తుంది. చినుకు పడితే చాలు చిత్తడైపోయే రాష్ట్రాల్లో ప్రథమస్థానం ఉత్తరాఖండ్‌ది. ఇప్పుడా చిరు రాష్ట్రం తల్లడిల్లిపోతోంది. వర్షాలు లేక కాదు, కురిసిన వాన కుంభవృష్టిని తలపించడం వల్ల..

07/04/2016 - 04:40

అంతర్జాతీయ ఉగ్రవాదం వెర్రితలలు వేస్తోంది. ఓర్లాండో, ప్యారిస్ నుంచి ఇస్తాంబుల్, ఢాకా వరకూ ఏ నగరానికీ నిర్భయంగా మనుగడ సాగించగలిగే పరిస్థితులు కనుమరుగే! ఎప్పుడు ఏ ప్రాంతంలో, ఏ పట్టణంపై, ఎలాంటి నగరంపై ఉగ్రవాదులు విరుచుకు పడతారో తెలియని పరిస్థితి మరింతగా కలవర పెట్టేదే..నిన్న అల్ ఖైదా, నేడు ఐసిస్..పేరేదైనా వాటి వాదం ఉగ్రవాదం. అరాచక వాదం. శాంతిని కబళించి మానవత్వానికి పాతరేసే అమానుష, అనాగరిక విధానం.

07/02/2016 - 02:41

ఎట్టకేలకు ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు మార్గం సుగమమైంది. గత కొన్ని నెలలుగా ఎడతెగని వివాదాలకు, ఉత్కంఠకు దారితీసిన జీతాల పెంపు వ్యవహారం ఓ కొలిక్కి రావడం ఆనందకరమైనదే అయినప్పటికీ దీని పర్యవసానాలను, ఆర్థిక వ్యవస్థపై దీని వల్ల పడే భారాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాదాపు లక్ష కోట్ల రూపాయలకు వేతన సంఘం సిఫార్సుల అమలు వల్ల ఖజానాపై భారం పడుతుంది.

06/30/2016 - 23:51

టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రవాదులు బుధవారం సృష్టించిన భయంకర రక్తపాతం..మన హైదరాబాద్‌లో హత్యాకాండ జరుపడానికి ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం-ఐఎస్‌ఐఎస్-కుట్ర చేసినట్టు వెల్లడి కావడం.., అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు గురువారం నలబయి మంది ప్రభుత్వ దళాలను పొట్టనపెట్టుకొనడం..విడివిడిగా కనిపిస్తున్న ఈ దుర్ఘటనల మధ్య నిహితమై ఉన్న సమాన స్వభావం జిహాద్!

06/30/2016 - 04:55

వెలగపూడిలో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం ప్రారంభం కావడం తెలుగు ప్రజల జీవన ప్రస్థానంలో మరో చారిత్రక శుభ ఘట్టం...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014 జూన్ రెండున రెండుగా పునర్ వ్యవస్థీకరణ జరిగిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజధాని లాంఛనం ప్రస్ఫుటించడం ఇది మొదటిసారి.

06/29/2016 - 00:16

తోడేళ్లు విశ్రమించడం లేదు, ఆవులు అప్రమత్తం కావడం లేదు. ప్రమత్తత ఆవహించిన భద్రతాదళాలపై జిహాదీ తీవ్రవాదులు నిరంతరం దాడులు చేస్తుండడం జమ్మూకశ్మీర్‌లో వ్యవస్థీకృతమైపోయిన వైపరీత్యం.

Pages