S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

10/30/2018 - 04:04

అక్రమ ప్రవేశకులను దేశం నుండి వెళ్లగొట్టనున్నట్టు భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా భాగ్యనగరంలో ప్రకటించడం కొత్త విషయం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వ విధానానికి పునరుద్ఘాటన మాత్రమే. 2019వ సంవత్సరంలో జరిగే లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధించిన తరువాత ఈ ‘చొరబాటుదారులైన విదేశీయులను వెళ్లగొట్టే’ కార్యక్రమం మొదలౌతుందని అమిత్ షా చెప్పినట్టు జరుగుతున్న ప్రచారం మాత్రమే కొత్త విషయం.

10/27/2018 - 00:51

పాఠశాలల్లో పుస్తకాల బరువు సగానికి సగం తగ్గించి వేయాలన్నది ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పిన మాట.. బడిపిల్లలు పుస్తకాల భారంతో క్రుంగిపోతుండడం దశాబ్దుల ‘్భతిక’ దృశ్యం. పెద్దపెద్ద సంచులు నిండిన పుస్తకాలను వీపులపై మోసుకొనిపోతున్న ‘బుడుతలు’ గృహ ప్రాంగణాలలోను విద్యాలయ ప్రాంగణాలలోను నిరంతరం దర్శనమిస్తున్నారు.

10/26/2018 - 01:20

ఉబర్, ఓలా వంటి ఘరానా వాణిజ్య సంస్థలు నాగరిక జీవన ప్రస్థానాన్ని నియంత్రిస్తుండడం నడుస్తున్న ‘విలాసం’- ఫాషన్-! నగరాలలో మధ్యతరగతి వారి ప్రయాణం ‘ఉబర్’, ‘ఓలా’ సంస్థల వాహనాల లభ్యతపై ఆధారపడి ఉండడం ‘విస్తృత’మైన దోపిడీ వ్యవస్థలో ఒక అంశం మాత్రమే! స్వేచ్ఛా సమాజానికీ స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థకూ మధ్య సంఘర్షణ జరుగుతుండడం దశాబ్దులుగా వ్యవస్థీకృతమై ఉన్న ‘వాణిజ్య ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్-లో భాగం.

10/25/2018 - 01:23

కేంద్రీయ నేర పరిశోధక మండలి- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్- సిబిఐ-‘కేంద్రీకృత అవినీతి నేర మండలి’గా మారిందన్న ఆరోపణ ‘‘సరికొత్త ఉదాహరణ’’. దాదాపు అన్ని రాజ్యాంగ విభాగాలలోను ‘అవినీతి, అక్రమాల పుట్టలు’ పగులుతుండడం ‘ఉదాహరణల’ చరిత్ర.. ‘సిబిఐ’కి చెందిన ఇద్దరు అత్యున్నత అధికారులు తాత్కాలికంగా పదవీ బాధ్యతల నుండి వైదొలగవలసి రావడం ‘పరిశోధకులు’ నేరస్థులుగా మారారన్న ఆరోపణకు వౌలిక ధ్రువీకరణ!

10/24/2018 - 02:27

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘హరిత దీవాలీ’- ఆకుపచ్చని దీపావళి- ఉద్యమానికి సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చెప్పిన తీర్పు విచిత్రమైన నేపథ్యం..! ‘బాణసంచా’- ఫైర్ క్రాకర్స్-ను ‘ఇష్టం వచ్చినట్టు’ వ్యాపారులు అమ్మరాదని, ప్రజలు సమయ సీమలను అతిక్రమించి ‘పటాకులు’ కాల్చరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం పర్యావరణ పరిశుభ్రతకు దోహదం చేయవచ్చు.

10/23/2018 - 05:14

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నిరంతరం పెరుగుతుండడానికి కారణం ‘ప్రపంచీకరణ’. ఈ వాణిజ్య వాస్తవాన్ని అంగీకరించడానికి ప్రభుత్వ నిర్వాహక రాజకీయ పక్షాలవారు, ప్రతిపక్షాలవారు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థల- మల్టీ నేషనల్ కంపెనీల- ఎమ్‌ఎన్‌సిల-కు ‘అనధికార’ ప్రతినిధులుగా పనిచేస్తున్న ఆర్థిక నిపుణులు అంగీకరించరు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం ప్రతీక మాత్రమే!

10/20/2018 - 00:56

చైనా సైనికులతో కలసి మన సైనికులు ఉమ్మడి విశ్వాసాలను నిర్వహించడానికి రంగం సిద్ధం కావడం మన రక్షణ విధానంలో నిహితమై ఉన్న వైరుధ్యాలకు సరికొత్త సాక్ష్యం. ఈ ఉమ్మడి సైనిక విన్యాసాలు డిసెంబర్ నెలలో చైనాలోని ‘చెంగుడూ’ ప్రాంతంలో ప్రదర్శితం కానున్నాయట. ఇందుకు సంబంధించిన ‘కార్యాచరణ’ ప్రణాళికను సిద్ధంచేయడానికై నవంబర్ ఒకటవ తేదీ నుంచి మూడురోజులపాటు ‘చెంగుడూ’లో ఉభయ దేశాల ఉన్నత స్థాయి సమావేశం జరుగనున్నదట!

10/18/2018 - 00:48

పునరావృత్తి సృష్టి నిహిత పరిణామక్రమం. కాలం పునరావృత్తవౌతోంది, చరిత్ర పునరావృత్తవౌతోంది. స్వభావ పునరావృత్తి, స్వరూప పునరావృత్తి నిరంతరం ప్రస్ఫుటిస్తుండడం విశ్వవ్యవస్థ.. ‘వెలుగు’ పునరావృత్తం కావడం ఉదయం, ‘చీకటి’ పునరావృత్తం కావడం రాత్రి! ఇది సృష్టి స్వరూప పునరావృత్తి! ‘వెలుగు’ ఉన్నప్పటి నుంచి సమాంతరంగా ‘చీకటి’ కూడ కొనసాగుతోంది.

10/17/2018 - 02:41

పాకిస్తాన్ ప్రభుత్వం అప్పుడప్పుడు నిరసనలకు గురి అవుతోంది. సౌదీ అరేబియా ప్రభుత్వం నిరసనలకు గురి కావడం లేదు. ఇదీ అంతరం.. ఈ తేడాకు ప్రధాన కారణం సౌదీ అరేబియా నిండా నిండి ఉన్న భూగర్భ ఇంధన నిక్షేపాలు! అంతర్జాతీయ జిహాదీ బీభత్సకాండకు పాకిస్తాన్ ప్రధాన కేంద్రంగా అవతరించి ఉంది! కానీ, ఈ జిహాదీలకు సౌదీ అరేబియా ‘స్ఫూర్తి’ కేంద్రం. ఈ స్ఫూర్తి అన్యమత విధ్వంసక ప్రవృత్తి!

10/16/2018 - 02:25

‘తల్లిదండ్రుల’ క్రౌర్యానికి పసిపాపలు బలి అవుతుండడం ఆధునిక నాగరిక జీవన విలాసం.. ఈ ‘క్రౌర్యం’ నిర్లక్ష్యం, ఈ ‘క్రౌర్యం’ వ్యభిచారం, ఈ ‘క్రౌర్యం’ అక్రమ లైంగిక సహజీవనం.. అంతేకాదు- ఆధునికత పేరుతో పాశ్చాత్య భావ దాస్యగ్రస్తులైన తల్లిదండ్రులు ‘ప్రేమ’ పేరుతో శిశువులను క్రౌర్యానికి గురిచేస్తున్నారు. ఈ ‘ప్రేమ’ నిజానికి ప్రచ్ఛన్న క్రౌర్యం..

Pages