S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

01/20/2016 - 05:04

ప్రాథమిక విద్యకు ఆంగ్లభాషా దాస్యం నుండి విముక్తి లభించగలదన్న ఆశలు మళ్లీ అంకురిస్తున్నాయి. క్రమంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రాథమిక విద్యను మాతృభాషా మాధ్యమంగా మాత్రమే బోధించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు మాధ్యమాలలో ప్రచారవౌతోంది.

01/18/2016 - 23:40

చిత్రవిచిత్ర మానసిక శారీరక వ్యాధులకు గురి అయినవారిని బహుళ జాతీయ వాణిజ్య సంస్థల యజమానులు వెక్కిరిస్తుండడం ప్రపంచీకరణ మారీచ మృగ మాయాజాలంలో భాగం. ఎండోసల్ఫాన్ అన్న క్రిమినాశక రసాయనం లక్షల ప్రజల బతుకులను నాశనం చేయడం ఒక ఉదాహరణ మాత్రమే. ఎండోసల్ఫాన్‌ను ప్రపంచమంతటా నిషేధించిన తరవాత మాత్రమే మనదేశంలో నిషేధించడం ప్రభుత్వ నిర్వాహకుల ప్రపంచీకరణ నిబద్ధతకు ఒక సాక్ష్యం మాత్రమే.

01/18/2016 - 07:23

పౌష్టికాహార లోపం వల్ల ఎదురౌతున్న సమస్యలు సామాజిక హిత నిష్ఠ కలవారికి ఆందోళన కలిగించడం సహజం! ప్రత్యేకించి బాల బాలికలకు శిశువులకు పౌష్టికాహారం లభించకపోవడం ప్రధాన సమస్య! అందువల్ల శిశు సంరక్షణ సమాచారాన్ని సేకరించి ప్రచారం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం వారి ఆకాంక్ష అభినందనీయం. అయితే చిన్న పిల్లల ఆరోగ్యానికి హానికరమైన పోషకాహార విధానాన్ని అనుసరించాలని కేంద్రం నిర్ణయించడం సమాంతర విపరిణామం.

01/15/2016 - 07:57

మన పంజాబ్‌లోని పఠాన్‌కోట వైమానిక దళం స్థావరంపై తాను జరిపించిన దాడి గురించి పాకిస్తాన్ ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుందట! ఇలా దర్యాప్తు జరపడానికి వీలుగా పాకిస్తానీ ప్రత్యేక పరిశోధక బృందం వారు మన దేశానికి వస్తారట! ఇలా రావడాన్ని మన ప్రభుత్వం స్వాగతించడం మతిమాలిన మన విదేశాంగ విధాన వైపరీత్యానికి మరో నిదర్శనం! పఠాన్‌కోటపై జిహాదీలు దాడి చేసిన తరువాత ఉభయ దేశాల మధ్య ముమ్మరంగా చర్చలు జరుగుతునే ఉన్నాయి!

01/14/2016 - 04:02

చిల్లర ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుండడం ఆర్థికవేత్తలకు హర్షం కలిగిస్తున్న పరిణామం! ధరలు పెరుగకపోవడం వల్ల తద్వారా ద్రవ్యోల్బణం పెరగకపోవడం వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడిపోతుందన్నది ఆర్థిక వేత్తల భయం! అందువల్ల సామాన్య ప్రజల మనోభీష్టానికి విరుద్ధంగా ధరలు ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతుండడమే ప్రగతికి చిహ్నమన్నది మేధావుల నిర్ధారణ! ఈ మేధావులు ప్రభుత్వ నిర్వాహకులకు సలహాదారులు!

01/13/2016 - 07:00

నైతిక ప్రమాణాల సూచిక పాతాళ పతన స్థాయికంటె మరింత హీనమైన స్థాయికి దిగజారిపోతుండడం శిశువులపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలకు కారణం. మహిళలను, యువతులను, బాలికలను, లైంగిక అత్యాచారాలకు గురిచేసే మగ పిశాచాలకు భారతీయ శిక్షాస్మృతిలో శిక్షలను నిర్దేశించారు.

01/12/2016 - 06:53

రాయలసీమలో ఉపాధిని కోల్పోయిన గ్రామీణులు లక్షల సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వలసపోతుండడం ప్రతీక మాత్రమే! దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలోను గ్రామీణ ప్రాంతాలవారు క్రమంగా ఉపాధిని కోల్పోయి పట్టణాలకు నగరాలకు ఉరుకులెత్తుతుండడం అసలు సమస్య!

01/11/2016 - 04:30

దేశద్రోహం అభియోగంపై వైమానిక దళానికి చెందిన మరో ఇద్దరిని శుక్రవారం ‘నిఘా’ అధికారులు నిర్బంధించడంతో డొంక కదలడం మొదలైంది. కొందరు రక్షకులు భక్షకులుగా మారుతుండడం భద్రతాకుడ్యంలోని కన్నాలు మరింతగా విస్తరిస్తున్నాయనడానికి నిదర్శనం. ఈ కన్నాలగుండా పాకిస్తానీ బీభత్స మృగాలు దేశంలోకి చొరబడుతుండడం దేశానికి అత్యంత అవమానకరం. ఇప్పుడు ఈ మృగాలు మన సైనిక స్థావరాలలోకి సైతం చొరబడి పోతున్నాయి.

01/09/2016 - 04:05

షేక్ అబ్దుల్లా తరువాత జమ్మూకశ్మీర్ రాజకీయ గతిని నిర్దేశించిన వారిలో అత్యంత ప్రముఖుడు ముఫ్తిమహమ్మద్ సరుూద్. గురువారం నాడు డెబ్బయి తొమ్మిదేళ్ల ముఫ్తి మరణించడం అందువల్ల ఈ రాజకీయ ప్రపంచానికి తీరని లోటు. 2002 నుంచి మూడేళ్లపాటు ముఫ్తి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆయన నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ-పిడిపి-కాగ్రెస్‌తో జట్టుకట్టింది.

01/08/2016 - 06:07

సంజయ్‌దత్ అనే చలనచిత్ర నటుడిని శిక్షాకాలం పూర్తి కాక మునుపే జైలునుండి విడుదల చేస్తున్నారట! ఈ దుర్వార్త మహత్తర హర్షణీయ పరిణామంగా ప్రచారం అవుతుండడం అనైతికతా పరిమాణ సూచిక పెరుగుతుండడానికి నిదర్శనం. సంజయ్‌దత్ ఘరానా నేరస్థుడన్నది న్యాయస్థానాలు నిగ్గుతేల్చిన నిజం!

Pages