S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

03/09/2017 - 05:45

ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం జరిగిన చివరి విడత పోలింగ్‌కు మధ్యప్రదేశ్‌లోని ఒక రైలులో జరిగిన బాంబుపేలుళ్లు వికృత నేపథ్యం! రాజధాని భోపాల్ నుంచి ఉజ్జయినికి వెడుతుండిన రైలుబండిలోని సాధారణ తరగతి పెట్టెలో ‘ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం’ (ఐసిస్) జిహాదీ సంస్థకు చెందిన దుండగులు పేలుళ్లు జరపడం భద్రతా దృష్టిని మళ్లించడంలో భాగం!

03/08/2017 - 01:05

‘మహిళా సాధికారత.. మహిళలకు భరోసా.. అధికారంలో భాగస్వామ్యమే లక్ష్యంగా’ ఇటీవల నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరిగిన ‘జాతీయ మహిళా పార్లమెంటు’ సదస్సు అనేక కొత్త అంశాలను చర్చకు తెచ్చింది. టిబెట్ బౌద్ధ మతగురువు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత దలైలామా ఈ సదస్సులో స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.

03/08/2017 - 00:57

మాతృశక్తి మరింత చైతన్యవంతంగా ప్రస్ఫుటిస్తూ ఉండడం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సముచిత నేపథ్యం. మహిళలపై వివిధ రకాల అత్యాచారాలు పెరుగుతుండడం సమాంతర వైపరీత్యం! ఉభయ తెలుగు రాష్ట్రాలలోని యువతులకు, మహిళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పురస్కారాలు లభించడం, సమ్మానాలు జరగడం సాధికార పథంలో మరో ప్రగతి పదం..

03/07/2017 - 02:53

గంగా యమునా నదుల మధ్య ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో బయటపడిన ‘రాగి’ పనిముట్లును, ఉపకరణాలను చూసి ‘్భరతీయ’ చరిత్ర పరిశోధకులు-ఇండాలజిస్టులు- ఆశ్చర్యపోతున్నారట. ఆశ్చర్యపోవడం కూడా చారిత్రక పరిశోధనలలో భాగం కావడం మనకు బ్రిటన్ సామ్రాజ్యవాదులు ప్రసాదించిన వారసత్వం! తమకు తెలిసినది మాత్రమే విజ్ఞానమని తమ పరిగణనను పొందినది మాత్రమే ‘అస్తిత్వమని’ భావించడం ఐరోపా మేధావుల దురహంకారం!

03/06/2017 - 07:29

ఇది బహుశా పరాకాష్ఠ! ‘ప్రపంచీకరణ’వల్ల పెరిగిన అక్రమ ఆర్థిక ప్రాధాన్యం వైద్యరంగాన్ని వాణిజ్య రంగంగా మార్చడం మొదటిదశ... వాణిజ్య వైద్యం జనాన్ని వంచనకు గురి చేస్తుండడం రెండవ దశ! ప్రభుత్వాలు సైతం వంచనకు గురి అవుతున్నాయి! వ్యాధిగ్రస్తులను వాణిజ్య-కార్పొరేట్-వైద్యశాలల యాజమాన్యాలు దోచుకొనడం పాత కథ.

03/04/2017 - 01:27

ఉత్తరఖండ్ ప్రాంతంలో గంగానదికి ఇరువైపుల వం ద మీటర్ల దూరం వరకూ ఎలాంటి ‘వినోద విహార స్థలాల’- టూరిజమ్ క్యాంప్స్-ను ఏర్పాటు చేయరాదని ‘జాతీయ హరిత పరిరక్షణ న్యాయమండలి’- నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్- ఎన్‌జిటి- ఆదేశించడం ‘స్వచ్ఛ్భారత్’ పునర్ నిర్మాణానికి దోహదం చేయగలదు. ‘స్వచ్ఛ్భారత్’లో నీటి స్వచ్ఛత ప్రధానమైనది. మానవుని జీవన వ్యవహారాలలో నీటి ద్వారానే నిరంతరం స్వచ్ఛత ఏర్పడుతోంది.

03/03/2017 - 00:40

అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం ఏ విధంగా చూసినా ఏకపక్షం కానే కాదు. గంటకుపైగా సాగిన ఆ ప్రసంగంలో ట్రంప్ సామరస్యాన్ని, కలసి పనిచేయాలన్న భావనను బలంగా చాటిచెప్పారు. పరుష వ్యాఖ్యలతో, విపరీత ధోరణులతో తీవ్ర స్థాయిలో విమర్శలకు గురైన ట్రంప్‌కే ప్రజలు అధికారం అప్పగించడంతో అమెరికా ఏమైపోతుందోనన్న భయం పెరిగిందన్నది వాస్తవం.

03/02/2017 - 04:29

విధి విధానాన్ని అతిక్రమించడం మానవులకు, జీవ జాలానికి సాధ్యం కాదన్నది ఇలా మరోసారి ధ్రువపడింది. భువనేశ్వర్ నుంచి సోమవారం సాయంత్రం బయలుదేరి హైదరాబాద్‌కు వస్తుండిన వోల్వో బస్సు మంగళవారం ఉదయం గమ్యం చేరకపోవడం ‘విధి’ చే సిన వికృత వికటాట్టహాసం! బస్సును డ్రైవర్ పైశాచిక వేగంతో నడిపినప్పటికీ సోమవారం రాత్రి, తెల్లవారుజామున ప్రయాణీకులు బెంబేలెత్తలేదు! ‘ఏమయ్యా ఇంత వేగంగా బస్సునెందుకు పోనిస్తున్నావు?

03/01/2017 - 03:22

ప్రకృతి స్వరూప స్వభావాలు చెరిగిపోతుండడానికి కారణం మానవులు పెంచుతున్న కాలుష్యం. కాలుష్యం కోరల నుంచి పరిసరాలను పరిరక్షించడానికి అంతర్జాతీయ సదస్సులు, గోష్ఠులు, తీర్మానాలు, నియమ నిబంధనల రూపకల్పనలు జరుగుతూనే ఉ న్నాయి. సమాంతరంగా పరిశ్రమల నుంచి, కర్మాగారాల ప్రాంగణాల నుంచి, చెత్తకుప్పల నుంచి బహిరంగ మలమూత్ర విసర్జన కలాపాల రహదారుల నుంచి భయంకరమైన కాలుష్యం వెలువడుతూనే ఉంది.

02/28/2017 - 00:47

అఫ్ఘానిస్తాన్‌లోని నంగధర్ ప్రాంతంలో నక్కి ఉన్న ‘్భరతీయ’ జిహాదీ ముష్కరుల వివరాలను తెలుసుకోవడానికి మన ‘జాతీయ నేర పరిశోధక సంస్థ’-‘నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ’-ఎన్‌ఐఏ-వారు ‘అంతర్జాతీయ నిఘా సంస్థ’-ఇంటర్ పోల్- సహాయం కోరడం సరికొత్త పరిణామం. ‘ఇరాన్ సిరియా ఇస్లాం మతరాజ్యం’-ఐఎస్‌ఐఎస్- జిహాదీ ముఠాలోకి పెద్ద సంఖ్యలో భారతీయులు చేరిపోవడం ఇందుకు కా రణం!

Pages