S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

02/02/2017 - 08:47

వౌలిక రంగాల ప్రగతి గురించి మోదీ ప్రధానమంత్రిత్వంలోని భాజపా ప్రభుత్వాన్ని ఆవహించి వున్న తపన- 2017-2018వ ఆర్థిక సంవత్సరపు ఆదాయ వ్యయ పత్రంలోని వౌలిక ఇతివృత్తం! ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు సమర్పించిన ఈ ఆదాయపు పత్రం-బడ్జెట్-లో ఈ వౌలిక అంశం గురించి సుదీర్ఘ వివరణ ఉంది!

02/01/2017 - 00:29

హఫీజ్ సరుూద్ అనే జిహాదీ హంతకుడిని నిర్బంధించే నాటకాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం మళ్లీ ఆరంభించింది. జిహాదీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం గుర్తించింది. అయితే పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు కేవలం మన దేశంలో బీభత్సకాండ సాగిస్తున్నంత వరకూ ‘అంతర్జాతీయ సమాజం’ పాకిస్తాన్ వ్యతిరేక చర్యలకు పూనుకొనడం లేదు.

01/31/2017 - 01:14

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారం దేశ ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. దేశంలోనే అతి పెద్ద రాష్టమ్రైన యుపిలో దేశ జనాభాలోని ఆరవవంతు నివసిస్తుండం ఇందుకు ఒక కారణం! సమాజ్‌వాదీ పార్టీ చీలిక కావడం, మళ్లీ ముక్కలు రెండు అతుక్కుపోవడం మళ్లీ చీలిపోవడం వంటివి మరో కారణం.

01/30/2017 - 01:01

మన అరవై ఎనిమిదవ గణతంత్ర దినోత్సవాల్లో ‘ఐక్య ఆరబ్ సంస్థానాల’- యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్- యుఏఈ- ప్రభుత్వాధినేత- క్రౌన్ ప్రిన్స్- షేక్ మహమ్మద్ బిన్ జాయాద్ అల్ నహ్‌యాన్ ప్రధాన అతిథిగా పాల్గొనడం ఆ దేశంతో మనకు పెరుగుతున్న ‘వ్యూహాత్మక’ మైత్రికి సరికొత్త నేపథ్యం. చైనా ప్రభుత్వం పాకిస్తాన్‌కు రెండు యుద్ధనౌకలను సమర్పించడం ‘యుఏఈ’తో మన వ్యూహాత్మక సంబంధాలకు ప్రాధాన్యం పెంచిన పరిణామం.

01/28/2017 - 03:45

లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాలన్న ప్రతిపాదన ప్రస్తుతం ప్రముఖంగా ప్ర చారం అవుతోంది. రాష్టప్రతి ప్రణవ్‌కుమార్ ముఖర్జీ అరవై ఎనిమిదవ గణతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యా ప్రసంగంలో కూడ జనవరి ఇరవై ఐదవ తేదీన ఈ సమాంతర ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రస్తావించారు. శాసనసభలకు, లోక్‌సభకు ఒకేసారి ప్రతి ఐదేళ్లకు నియతంగా ఎన్నికలు జరిపించాలన్న ‘ఆదర్శం’ మరింత ప్రాధాన్యం సంతరించుకొంది.

01/27/2017 - 02:53

వారి హృదయ సీమలలో ఆనందపు చిరుజల్లు కురవనుందట.. వారు స్వదేశంలోనే శరణార్థులు, దశాబ్దులుగా నిర్వాసితులు, మతోన్మాద జిహాదీ నిశాచర పీడితులు, తల్లులు ‘శిబిరాల’లో పురుడు పోసుకున్నారు, పిల్లలు ఆకాశపు నీడలందు ఆటలాడుకుంటున్నారు. వారు విధి వంచితులు.. కశ్మీరీ పండితులు! యుగయుగాలుగా కశ్మీరీ లోయ ప్రాంతంలో పరిఢవిల్లిన ఈ హిందూ జన సముదాయంలో అత్యధికులు 1947వ, 1948వ సంవత్సరాలలో తరిమివేతకు గురి అయ్యారు.

01/26/2017 - 07:24

కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న విరాళాలలో ఎనబయి మూడు శాతం రహస్య ప్రదాతల నుంచి సమకూరుతుండడం విస్మయకరం. భారతీయ జనతాపార్టీ సైతం ఈ ‘రహస్య గోపనం’లో వెనుకబడిలేదు. భాజపా వసూలు చేస్తున్న నిధులలో ముప్పయి ఐదు శాతం చెల్లించిన వారి పేర్లు మాత్రమే వెల్లడవుతున్నాయట! అరవై ఐదు శాతం నిధులు సమకూర్చిన వారి పేర్లు రహస్యంగా వుండిపోయాయి.

01/25/2017 - 01:50

అమెరికా వాణిజ్య ద్వారాల తలుపులు మూసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఈ ‘తలుపులు మూసే’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ ‘తాను చేతల మనిషిని’ అని నిరూపించుకొంటున్నాడు!

01/24/2017 - 05:35

విజయనగరం జిల్లా కూనేరు రైల్వేస్టేషన్ సమీపంలో ‘హీరాఖండ్’ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి పడిపోవడానికి విద్రోహుల బీభత్స చర్య కారణమన్నది జరుగుతున్న ప్రచారం. ప్రమాదవశాత్తు రైలు బోగీలు పట్టాలు తప్పలేదన్నది ధ్రువపడినట్టయితే పెరుగుతున్న ఉగ్రవాద కలాపాలకు ఇది మరో ప్రతీక కాగలదు. పట్టాలు తప్పిన చోటికి రైలు రావడానికి ముందు అక్కడ మంటలు చెలరేగడాన్ని ఒక ఉద్యోగి గమనించాడట.

01/23/2017 - 00:44

ముస్లింలకు పనె్నండు శాతం ‘ఆరక్షణల’ను కల్పించడానికి కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం వారు పదే పదే ప్రకటించడం విచిత్రమైన వ్యవహారం. మత ప్రాతిపదికపైన ‘రిజర్వేషన్’-ఆరక్షణ-లను కల్పించడం భారత రాజ్యాంగ విరుద్ధం. ఈ నిబంధనను, ఈ రాజ్యాంగ స్ఫూర్తిని ధిక్కరించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్లాం మతస్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలోను, విద్యా సంస్థలలోను రిజర్వేషన్‌లు కల్పించింది.

Pages