S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

12/29/2016 - 07:28

విషయమేమిటో తెలియని వారు విడ్డూరపు నయనాలతో వీక్షిస్తున్నారు.. రాహుల్ గాంధీ ప్రసంగిస్తూంటే పక్కనే మమతా బెనర్జీ తలపట్టుకుని, తలవంచుకుని ‘దిక్కుతోచనట్లు’ కూర్చున్న దృశ్యాలు మాధ్యమాలలో ఆవిష్కృతమయ్యాయి. వీరిద్దరూ కలసికట్టుగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మాధ్యమ ప్రతినిధుల సమావేశం విచిత్ర విన్యాసాల సమ్మేళనంగా మారింది. పల్లెటూళ్లలో, పట్టణాలలో మధ్యవర్తులు ‘పంచాయితీలు’ చేస్తూంటారు.

12/27/2016 - 23:36

మన సైనిక దళాల ‘అమ్ములపొది’లో ఆగ్నేయాస్త్రం చేరింది. రక్షణ పటిమ విస్తరించింది. మన ప్రతిఘటన వ్యూహం మరింత పటిష్టంగా అమలు జరుగుతోంది. దురాక్రమణ ప్రమాదం కూడా పెరుగుతుండడం సమాంతర పరిణామం. ఐదవ శ్రేణి ‘అగ్ని’ పరీక్ష విజయవంతం కావడం ఇది నాలుగవసారి. సోమవారం నాడు ఒరిస్సా సముద్రతీరం సమీపంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఐదవ శ్రేణి ‘అగ్ని’ దూసుకొని వెళ్లడంతో మన సుదూర లక్ష్యచ్ఛేదక రక్షణ పటిమ మరోసారి ధ్రువపడింది.

12/26/2016 - 23:43

బహిరంగ ప్రదేశాలలో ‘చెత్త’ను తగులబెట్టడాన్ని ‘జాతీయ హరిత న్యాయమండలి’-నేషనల్ గ్రీన్ ట్రి బ్యునల్-ఎన్‌జిటి- నిషేధించడం పరిసరాల పరిశుభ్రతను పెంపొందించే చర్య. ‘చెత్త’ పేరుతో చెలామణి అవుతున్న ‘వ్యర్థ పదార్థం’లో విష రసాయనాలు నిండి ఉన్నాయన్నది బహిరంగ రహస్యం.

12/26/2016 - 02:34

జమ్మూ కశ్మీర్‌లో ముస్లింల ‘జన బాహుళ్యాన్ని’- మెజారిటీని- నిలబెట్టడం కోసం రక్తపాతం సృష్టించడానికి సైతం వెనుకంజ వేయబోమని ‘జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్’- జెకెఎల్‌ఎఫ్- అన్న దేశ విద్రోహ బీభత్స సంస్థకు చెందిన యాసిన్ మాలిక్ హెచ్చరించడం ‘సర్వమత సమభావ వ్యవస్థ’ స్ఫూర్తికి విఘాతకరం. ఏడు దశాబ్దులుగా ‘పాకిస్తాన్ తొత్తులైన’ జిహాదీలు ఈ సర్వమత సమభావ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు.

12/24/2016 - 01:00

బొగ్గు పాల కడుగ పోవునా మలినంబు?- అన్నది వేమన శతకంలోని ఒక పద్య పాదం. మన భాష విదేశీయ భాషలతో కల్తీ అయిపోయిన తరువాత ‘విశ్వదాభి రామ వినుర వేమ’ అన్న పద్యాల గురించి చాలామంది నాగరికులకు తెలియడం లేదు. బొగ్గును పాలతో కడగడం మతిమాలిన చర్య. కానీ, బొగ్గు పాలలోనే చొరబడిపోతుండడం నడుస్తున్న చరిత్ర.

12/23/2016 - 00:42

మన ఉత్తర సరిహద్దును ఉద్రిక్తతలకు నిలయంగా మార్చడానికి చైనా ప్రభుత్వం అమలు జరుపుతున్న కుటిల వ్యూహంలో ఇది మరో ఘట్టం... నేపాల్‌తో కలసి చైనా సంయుక్తంగా సైనిక విన్యాసాలను నిర్వహించబోతోందట! ఫిబ్రవరి పదవ తేదీ నుంచి జరుపనున్న ఈ ఉమ్మడి విన్యాసాలు నేపాల్ రక్షణ విధానంలో ప్రస్ఫుటిస్తున్న భారత వ్యతిరేకతకు సరికొత్త సంకేతాలు! నేపాల్ రక్షణ, యుగాలుగా ఆనాదిగా భారత రక్షణతో ముడిపడి ఉంది.

12/22/2016 - 07:25

రాజకీయ పక్షాల నిధుల నిర్వహణలో ‘పారదర్శకత’ లేదన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అంగీకరించిన వాస్తవం. ఇరవై వేల రూపాయల వరకు విరాళాలిచ్చే వారి పేర్లను రాజకీయ పక్షాల వారు వెల్లడించే అవసరం లేకపోవడం పారదర్శకతా రాహిత్యానికి ప్రత్యక్ష ప్రమాణం. ఈ పారదర్శకత లోపంవల్ల నల్లడబ్బు చెలామణి అవుతోందని కూడ ప్రధానమంత్రి వ్యాఖ్యానించాడు.

12/21/2016 - 01:16

కేంద్రప్రభుత్వ నిర్వాహకులకు అకస్మాత్తుగా మతిభ్రమించిందేమోనన్న అనుమానం కలగడం అతార్కికం కాదు! రద్దయిన పాత కరెన్సీ నోట్లను బ్యాంకులలో జమ చేసే ప్రక్రియను గందరగోళగ్రస్తం చేయడానికి ప్రభుత్వం పూనుకోవడం ఈ మతిభ్రమించిందన్న అనుమానానికి ప్రాతిపదిక! మతిభ్రమించడం నిజం కాకపోతే, దుర్బుద్ధి పూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం వారు ప్రజలను కడగండ్లపాలు చేయడానికి, వేధించడానికి పూనుకున్నట్లు భావించవలసి వస్తుంది!

12/20/2016 - 01:14

ఐదుగురు ఉగ్రవాదులకు న్యాయస్థానం మరణ శిక్షను విధించడంతో న్యాయ ప్రక్రియ పాక్షికంగా పూర్తయింది. బీభత్స జిహాదీ కలాపాల సూత్రధారుడు మొహమ్మద్ రియాజ్ భత్కల్ పాకిస్తాన్‌లో సురక్షితంగా ఉండడం న్యాయప్రక్రియ పూర్తికాకపోవడానికి నిదర్శనం.

12/19/2016 - 04:29

నగరాలలోను పట్టణాలలోను తిరుగుతున్న ‘టాక్సీ’ల యజమానులు, చోదకులు కనీసపు శుల్కం కంటె నాలుగురెట్లు వరకు ప్రయాణీకులవద్ద వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించడం స్వేచ్ఛావిపణి- మార్కెట్ ఎకానమీ- వల మరింతగా బిగిసిపోతోందన్న వాస్తవానికి మరో నిదర్శనం. వికేంద్రీకృత భారతీయ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేసిన ‘ప్రపంచీకరణ’ కబంధ బంధంలో ప్రభుత్వాల విధానాలు చిక్కుకొని ఉన్నాయనడానికి ఇది మరో సాక్ష్యం!

Pages