S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

03/12/2019 - 02:06

సమస్యలకు కాక ‘సమీకరణ’లకు ప్రాధాన్యం పెరుగుతుండడం పదిహేడవ లోక్‌సభ ఎన్నికలకు విచిత్రమైన నేపథ్యం. ఏప్రిల్ పదకొండవ తేదీ నుండి మే పంతొమ్మిదవ తేదీ వరకు ‘మత ప్రదానం’-పోలింగ్- ఏడు విడతలుగా జరుగనున్న కొత్త లోక్‌సభ ఎన్నికల కార్యక్రమాన్ని ఆదివారం ఎన్నికల సంఘం ప్రకటిస్తుండిన సమయంలో ‘సమీకరణ’లను గురించి మాధ్యమాలలో చర్చలు పరాకాష్ఠకు చేరడం సమాంతర పరిణామం.

03/08/2019 - 22:05

మరో యాబయి కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారం నాటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం ప్రామాణిక విద్యావిస్తృతికి దోహదం చేయగల పరిణామం. దేశంలో ప్రస్తుతం పదకొండు వందల ఇరవై ఐదు కేంద్రీయ విద్యాలయాలు నడుస్తున్నాయట. విదేశాలలో సైతం ఈ కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలు నడుస్తున్నాయి.

03/08/2019 - 01:36

భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికలలో పోరాడగల జాతీయ స్థాయి కూటమిని ఏర్పాటు చేయడం అసాధ్యమన్నది ‘భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ’- భా.మా.క.పా-వారు కనిపెట్టి ఆవిష్కరించిన గొప్ప రాజకీయ వాస్తవం! ‘‘ఊరందరికీ తెలిసిన ఉదంతాన్ని ‘ఊలప్ప’ వచ్చి చెవిలో ఒదాడన్నది’’ ‘భా.మా.క.పా.’ వారు వెల్లడించిన పొత్తుల రహస్యం తీరు..

03/07/2019 - 01:29

హైదరాబాదును ‘భాగ్యనగరం’ అని పిలవడం గొప్ప నేరమన్న ప్రచారం జరిగిపోతోంది. ఇలా ‘నేరమని’ నిర్ధారిస్తున్న వారిలో వారసత్వ పరిరక్షక ఉద్యమకారులు- హెరిటేజ్ యాక్టివిస్టులు- కూడ ఉండడం మరో విచిత్రం. ఈ తథాకథిత ‘వారసత్వ పరిరక్షకుల’కు తెలిసిన ‘గతం’ కేవలం వందల సంవత్సరాలకు పరిమితమై ఉంది. ఈ వందల సంవత్సరాలలో మన దేశం వివిధ రకాల విదేశీయుల దురాక్రమణకు గురి అయింది.

03/06/2019 - 02:05

పాకిస్తాన్ ‘ప్రభుత్వం’ వారి వంచన క్రీడలో మరో ‘ఆవృత్తం’- రౌండ్- మొదలైపోయింది. ‘జమాత్ ఉద్ దావా’, ‘ఫలారుూ ఇన్‌సానియత్ ఫౌండేషన్’ అన్న జిహాదీ బీభత్స సంస్థలను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది-అట-! ‘‘ఇంకెన్నిసార్లు చెంపలేసుకుంటారు?’’ అని పాకిస్తాన్‌లోని ‘జిహాదీ’ సిద్ధాంత ప్రవర్థకులు పాకిస్తానీ ‘పాలకుల’ను యద్దేవా చేస్తున్నారట!

03/05/2019 - 02:01

భాషా వైవిధ్యాలు భాషా వైరుధ్యాలుగా విస్తరించడానికి ‘రైలు రాజకీయాలు’ దోహదం చేస్తుండడం నడిచిపోతున్న మంత్రాంగం... విశాఖపట్టణం కేంద్రంగా ఉండిన- వాలుతేరు (వాల్తేరు)- రైలు విభాగం- ‘డివిజన్’-ను రెండుగా విడగొట్టడం భాషా వైరుధ్య స్ఫురణను మరోసారి కలిగించిన విపరిణామం! విశాఖపట్టణం ‘రైలు క్షేత్రం’- రైల్వే డివిజన్- అవతరించింది. కానీ, విశాఖపట్టణం ‘రైలు విభాగం’-డివిజన్- అంతరించింది.

03/01/2019 - 22:08

సర్వోన్నత న్యాయస్థానం వారి ఫిబ్రవరి 13వ తేదీనాటి తీర్పు ప్రాతిపదికగా ఘోరమైన అన్యాయానికి గురికావలసి ఉండిన లక్షలాది వనవాసీ ప్రజలకు ఆ ప్రమాదం తాత్కాలికంగా తప్పిపోయింది. ఫిబ్రవరి పదమూడవ తేదీనాటి తమ తీర్పు అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తదుపరి విచారణను కొనసాగించనున్నట్టు ఫిబ్రవరి 28వ తేదీ సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించడం ప్రమాదం తప్పిపోవడానికి ప్రాతిపదిక.

03/01/2019 - 01:40

శస్త్ర విజయంతోపాటు ‘శాస్త్ర’ విజయం కూడ మన దేశానికి లభించింది. పాకిస్తాన్ ప్రభుత్వ అక్రమ నిర్బంధంనుంచి మన వాయుసేన ‘విభాగ అధిపతి’ అభినందన్ వర్థమాన్‌కు శుక్రవారం విడుదల లభించనుండడం మన ప్రభుత్వానికి లభించిన శాస్త్ర విజయం... దౌత్య శాస్త్ర విజయం.

02/28/2019 - 01:34

యత్నే కృతే యది నసిద్ధ్యతి కోత్ర దోషః?- అన్నది దాదాపు రెండు సహస్రాబ్దులకు పూర్వం భర్తృహరి మహాకవి సంధించిన ప్రశ్న. ‘కార్యసిద్ధి జరుగకపోయినప్పటికీ కార్యసాఫల్యంకోసం ప్రయత్నించడంలో తప్పేమిటి?’అన్నది ప్రశ్న.

02/27/2019 - 03:56

సమరం ఇది ‘నిశా’సురుల
దునుమాడిన శుభ సమయం,
సమరం ఇది మతోన్మాద
మూకలపై క్షణం క్షణం....
సమరం ఇది ‘జిహాదీ’ల
బీభత్సంపై అనిశం,

Pages