S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

12/17/2016 - 00:23

జాతీయ, ప్రాంతీయ మహాపథాల- హైవేస్- పక్కన మద్యం దుకాణాలు ఉండరాదని సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించడం ప్రయాణపు మత్తుదిగడానికి దోహదం చేయగలదు. మద్యం తాగి మత్తెక్కిన వారు వాహనాలు నడపడం వల్ల హైవేలపై ప్రమాదాలు పెరుగుతున్నాయన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎల్.నాగేశ్వరరావులు చేసిన నిర్ధారణ నిరాకరింపజాలని నిజం.

12/16/2016 - 01:13

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వ్యక్తిగత అవినీతికి పాలుపడినాడ’ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించడం బహుశా ఈ సంవత్సరపు అతిపెద్ద చమత్కృతి- జోక్ ఆఫ్ ది ఇయర్-! రాహుల్ గాంధీ ఆషామాషీ జీవనుడు.. రాజీవ్ గాంధీ కుమారుని హోదాలో సంక్రమింపచేసుకున్న రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని విలాసాలు, వినోదాలు అనుభవిస్తున్న విదూషక సముడు!

12/15/2016 - 07:32

గంజాయి మొక్కలను సాగు చేయడం నేరమని తెలియని రైతులు కూడా దేశంలో ఉన్నారన్నది దిగ్భ్రాంతిని కలిగిస్తున్న సమాచారం. ‘మా ఊళ్లో అందరూ ఈ మొక్కలను పెంచుతున్నారు. కిలో గంజాయి ఆకులకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు గిట్టుబాటు అవుతోంది! అందరూ ఇలా పెంచి లాభాలు ఆర్జిస్తున్నారు. మేమెందుకు సాగు చేయరాదు?’ అన్న ధ్యాస మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతోంది! గంజాయి మాదక పదార్ధం అన్న ధ్యాస మాత్రం లేదు!

12/13/2016 - 23:57

మన ప్రభుత్వం సకాలంలో ప్రతిస్పందించకపోవడం మరింత దిగ్భ్రాంతికరం! దాదాపు ఏడాదిపాటు ఈ ఘోరం కొనసాగుతున్నప్పటికీ నివారించడానికి మన ప్రభుత్వం పూనుకోలేదన్నది స్పష్టం. పూనుకొని ఉండి ఉంటే ఇంతమంది అభాగ్యుల మృతదేహాలు నెలల తరబడి అక్కడ పడి ఉండేవి కావు. సౌదీ అరేబియాకు వెళ్లి ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించాలని కలలుగన్న అభాగ్యుల మృతదేహాలు అవన్నీ.

12/12/2016 - 23:59

అయ్యవారిని చేయబోతే కోతిగా మారిందన్న సామెత ఎంతవరకు అన్వయం అవుతోందన్నది జనమానస క్షేత్రంలో అంకురిస్తున్న అనుమానం. అయ్యవారిని చేయాలన్న సంకల్పం మంచిదే. కానీ శిల్పం కోతిగా మారకుండా నిరోధించడం కూడా ‘ఆర్థిక రూపశిల్పుల’ కర్తవ్యం. నల్లధనాన్ని నిరోధించడానికి, నకిలీ ధనాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం వారు పెద్దనోట్లను రద్దు చేయడంలోని ఔచిత్యాన్ని మతిమంతులెవ్వరూ కాదనలేరు.

12/12/2016 - 00:05

అగస్టా వెస్ట్‌లాండ్ అవినీతి వ్యవహారంలో మన వైమానిక దళం మాజీ అధిపతి ఎస్‌పి త్యాగిని ‘కేంద్ర నేర పరిశోధక విభాగం’-సిబిఐ- వారు శుక్రవారం అరెస్టు చేయడం ఆశ్చర్యకరం కాదు. త్యాగి ఇన్నాళ్లు అరెస్టు కాకపోవడమే విస్మయకరం. ఎందుకంటె, ఈ అవినీతి ఉదంతం బట్టబయలయిపోయి నాలుగేళ్లయింది. లంచాలను గతికిన వారిలో త్యాగి, ఆయన సన్నిహిత బంధువులు ఉన్నట్టు అప్పటి నుంచి ఆరోపణలుఉన్నాయి.

12/10/2016 - 01:04

మూడు ‘తలాఖ్‌ల’ పద్ధతి అమానవీయమైనదని అలహాబాద్ ఉన్నత న్యాయమూర్తి సునీత్‌కుమార్ వ్యాఖ్యానించడం ఇస్లాం మహిళల మనోభావాలకు అనుకూలమైన పరిణామం. ఎప్పుడు పడితే అప్పుడు భర్త తన భార్యకు విడాకులనివ్వడానికి వీలు కల్పించే ఈ దారుణమైన నిబంధన ఇస్లాం మత వౌలిక తత్త్వానికి సైతం అనుగుణంగా లేదన్న ఉన్నత న్యాయస్థానం వారి వ్యాఖ్య ఉదారవాదులైన ఇస్లాం మతస్థుల అంతరంగానికి అద్దం.

12/09/2016 - 00:57

అటవీ పరిరక్షణకు సంబంధించిన నూతన విధానాన్ని రూపొందించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేయడం విచిత్రమైన వ్యవహారం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిజంగా వాయిదా వేసిందా? లేక ఉత్కంఠను సృష్టించడానికి మాధ్యమాలలో ఇలాంటి ప్రచారం జరుపుతోందా? అన్న మీమాంసకు తావులేదు. గతంలో ప్రభుత్వ విధానం ముసాయిదా పత్రం ఒకటి సామాజిక మాధ్యమాలలో ప్రచారమైంది.

12/08/2016 - 02:23

పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండను అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికపై అభిశంసించడం మన దేశానికి లభించిన వ్యూహాత్మక విజయం. అమృతసర్‌లో ఆదివారం జరిగిన ‘అఫ్ఘానిస్థాన్ సంబంధ ఆసియా సదస్సు’- హార్ట్ ఆఫ్ ఆసియా- హెచ్‌ఓఏ- కాన్ఫరెన్స్-లో పాకిస్తానీ లష్కర్ ఏ తయ్యబా- ఎల్‌ఇటి-, జాయిష్ ఏ ముహమ్మద్- జెఇఎమ్-లను అభిశంసిస్తూ తీర్మానించడంతో ఈ విజయం ప్రస్ఫుటించింది.

12/07/2016 - 02:45

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించడం చెరగని చారిత్రక విషాద చిహ్నం, తమిళ జన హృదయంలో ఏర్పడిన శూన్యం.. తమిళనాడు రాజకీయాలకు మాత్రమే ఆమె పరిమితం కాలేదు. భారత జాతీయ రంగ స్థలిని సైతం ప్రభావితం చేసిన, ప్రకంపనలకు గురి చేసిన రాజకీయ విప్లవం జయలలిత జీవన ప్రస్థానం! 1980వ దశకం నుండి ముప్పయి ఐదేళ్లకు పైగా తమిళనాడు రాజకీయ కేంద్ర బిందువు జయలలిత.

Pages