S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

11/24/2016 - 07:27

ప్రపంచీకరణ వల్ల ఏర్పడిన ప్రధాన వైపరీత్యం భూ మిని వాణిజ్య ‘హిరణ్యాక్షులు’ కాజేస్తుండడం. ఇలా కాజేయడం తెలుగు రాష్ట్రాల్లో గత రెండేళ్లుగా మరీ మితిమీరిపోయింది. ఉన్నత న్యాయస్థానం వారు భూమి సేకరణను నియంత్రించడానికి, అక్రమంగా సేకరించే ప్రక్రియను నిరోధించడానికి పదే పదే జోక్యం చేసుకోవలసి వస్తుండడం ఇందుకు నిదర్శనం.

11/23/2016 - 00:50

ఆరోగ్యమే మహాభాగ్యం’ అనేది నానుడి. ఉరుకులు, పరుగుల నేటి నవ నాగరిజ సమాజంలో ఆ మాటకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శారీరకంగానూ, మానసికంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ మానవుడు తాను ఉన్న పరిసరాల్లో హాయిగా జీవించడానికి సకల సౌకర్యాలను ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఇందుకు కారణం- ఆరోగ్యం మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం వారి వ్యక్తిగత బాధ్యత అయితే, అలా ఉండేలా చూడటం ప్రభుత్వం బాధ్యత.

11/23/2016 - 00:46

తన మనస్సుకు గోచరించిన భావ సౌందర్యాన్ని మరో హృదయం అనుభవించేలా చేయటం చిత్రకారుడి లక్ష్యం. తన హృదయం అనుభవించిన భావ మాధుర్యాన్ని మరో హృదయంలో స్పందింప చేయటం గాయకుడి లక్ష్యం. హృదయానుభవాల వినిమయమే సంగీత పరమార్థం. ఈ పరమార్థానికి సాక్షి- బాలమురళీకృష్ణ. కర్ణాటక సంగీతం పాడే అతికొద్ది మందిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రథమస్థానంలో వున్న విద్వాంసుడు.

11/21/2016 - 23:15

వికటించిన విధికి ఇది మరో విషాద సాక్ష్యం.. ఇది ప్రాకృతిక బీభత్సం కాదు, మానవ మహాపరాధం కాదు! అయినప్పటికీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బిహార్ రాజధాని పాట్నాకు వెళుతున్న రైలు ప్రయాణీకులలో 143 మంది అకాల మృత్యువునకు ఆహుతి అయిపోయారు. కాళమృత్యు కరాళ దంష్టల్రు కరకరమని నమిలిన చప్పుళ్లు దేశవ్యాప్తంగా జన హృదయ సీమలలో ప్రకంపనాలను సృష్టిస్తున్నాయి, గుండెలను పిండి చేస్తున్నాయి.

11/20/2016 - 23:36

వివాదాలను పరిష్కరించవలసిన వ్యవస్థ వివాదగ్రస్తం కావడం విచిత్రమైన పరిణామం. వివాదం అంకురించడానికి కారణం ఎవరు? ప్రాతిపదిక ఏమిటి? అన్న సందేహాలకు సరైన సమాధానం దొరకకపోవడం మరో విచిత్రం.

11/18/2016 - 22:36

పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడంతో దేశప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి ప్రతిపక్ష రాజకీయవాదులు కడవలతో కన్నీరు కార్చడం నడుస్తున్న చరిత్ర. ఈ కన్నీటి కాలువలు పార్లమెంటు ఉభయ సభల సమావేశాలను ముంచెత్తుతున్నాయి.

11/17/2016 - 23:33

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మనదేశంలోకి చొరబడి తిష్ఠ వేసి ఉన్న వారి సంఖ్య దాదాపు రెండు కోట్లని ప్రభుత్వం అధికారికంగా నిర్థారించింది. అనధికార నిర్థారణల ప్రకారం అక్రమ ప్రవేశకుల సంఖ్య మూడుకోట్లకు పైనే ఉందన్నది జరుగుతున్న ప్రచారం. అక్రమ ప్రవేశకుల సంఖ్య కేవలం వేలలో మాత్రమే ఉందని గతంలో 2012లో నిర్థారించిన కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వంటి వారు కూడా దేశంలో ఉన్నారు.

11/17/2016 - 06:46

ఇజ్రాయిల్ అధ్యక్షుడు రూలెన్ రిబ్లిన్ మన దేశంలో పర్యటిస్తుండడం ఉభయ దేశాల ద్వైపాక్షిక మైత్రీ ప్రస్థానంలో మరో చారిత్రక పరిణామం! ఈ చరిత్ర సహస్రాబ్దుల క్రితం మొదలైంది, కొన్ని శతాబ్దుల పాటు ప్రాధాన్యం కోల్పోయింది. 1992లో మళ్లీ ఆరంభమైంది. ఈ పునరారంభ స్నేహానికి సహస్రాబ్దుల నాటి చారిత్రక బంధం ప్రాతిపదిక!

11/15/2016 - 22:47

పెద్దనోట్ల చెలామణిని రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించడం బుధవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ హేమంత సమావేశాలకు నిర్మాణాత్మక నేపథ్యం! ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను ‘చెలామణి’ ప్రక్రియ నుండి ఉపసంహరించడం వల్ల ప్రభుత్వం సాధించదలచిన లక్ష్యాలు వివాదాస్పదం కావడం ఇంగితజ్ఞానం వున్న దేశ ప్రజలకు విస్మయం కలిగిస్తున్న వ్యవహారం!

11/15/2016 - 06:27

పాకిస్తాన్ బలూచిస్థాన్‌లోని గ్వాడార్ ఓడరేవు అత్యాధునిక రూపు సంతరించుకొనడం చైనా వారి ఆర్థిక, భౌతిక, వ్యూహాత్మక దు రాక్రమణలో భాగం. చైనా ప్రభుత్వం పునర్ నిర్మించిన ఈ ఓడరేవులో రాకపోకల సందడి పెరగడం మన ప్రధాన మంత్రి జపాన్ పర్యటనకు సమాంతర పరిణామం! చైనా నిరంతరం ప్రత్యక్ష, ప్రచ్ఛన్న వ్యూహాత్మక దురాక్రమణను కొనసాగిస్తోందన్న వాస్తవానికి గ్వాడార్ పునఃప్రారంభం సరికొత్త సాక్ష్యం.

Pages