S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

11/13/2016 - 21:54

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్‌లో నవంబర్ పదకొండవ తేదీ నుంచి జరిపిన పర్యటన అనేక వ్యూహాత్మక ప్రాధాన్యాలను సంతరించుకొంది. ఉభయ దేశాల మధ్య శుక్రవారం కుదిరిన ‘అణు’ సహకార అంగీకారం గురించి ప్రచారం ఎక్కువగా జరుగుతున్నప్పటికీ, చైనా దురాక్రమణ వ్యూహాన్ని ప్రతిఘటించడానికి తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలు జరుపుతున్న సమష్టి కృషి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా మరోసారి ప్రస్ఫుటించింది!

11/12/2016 - 08:30

లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలన్న ప్రతిపాదన కొత్తది కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఈ సంగతిని పదేపదే ప్రస్తావించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయమై అధ్యయనం చేసి ఆచరణాత్మక మార్గదర్శక సూత్రాలను నిర్ధారించడానికి గత జూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల బృందాన్ని నియమించింది.

11/11/2016 - 07:15

నేను హిందుత్వాన్ని ప్రేమిస్తున్నాను- ఐ లవ్ హిం దూ- అని అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గతంలో చెప్పిన మాట! భారతదేశంతో తమ ప్రభుత్వం స్నేహ సంబంధాలు పెంపొందించుకోగలదన్నది ఈ ప్రకటనలోని ధ్వని.. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో జరిగిన తమ రిపబ్లికన్ పార్టీ మహాసభలో అక్టోబర్ 16వ తేదీన ట్రంప్ తనను భారత మిత్రుడుగా ప్రకటించుకున్నాడు.

11/10/2016 - 05:32

ఇప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగం జరిగింది. అన్ని అస్తశ్రస్త్రాలు ప్రయోగించిన తరువాత మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాలన్నది సంప్రదాయం! కేంద్ర ప్రభుత్వం పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడం ద్వారా ఇప్పుడీ సంప్రదాయాన్ని మరోసారి పాటించింది. దీపావళికి ముందు రోజున సామాజిక బీభత్సకారుడైన నరకాసురుడు కూలిపోవడం చరిత్ర.. ద్వాపర యుగంలో యదుకుల కృష్ణుడు కూల్చివేయడం చరిత్ర!

11/09/2016 - 05:05

మనదేశంలో ఘరానా నేరాలు చేసి బ్రిటన్‌లో సురక్షితంగా తిష్ఠవేసి ఉన్న యాబయి ఏడుగురు నేరస్థుల గురించి దేశ ప్రజలకు మరోసారి ధ్యాస కలిగింది. మన దేశానికి బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మాయ్ విచ్చేయడం ఈ ‘్ధ్యస’ను కలిగించిన సరికొత్త పరిణామం. ఈ యాబయి ఏడుగురిని మన దేశానికి తరలించాలని బ్రిటన్ ప్రధానమంత్రిని మన ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలో కోరారు.

11/07/2016 - 23:50

ఊరంతా నిండిన వేదికపై ఊపిరి ఆడడం లేదు- అన్నది నగరీకరణ కాలుష్యం గురించి ఒక కవి చెప్పిన మాట! ఇది కల్పన కాదు, కఠోర వాస్తవమన్నది అనేకసార్లు ధ్రువపడింది, నిరంతరం ధ్రువపడుతోంది. సరికొత్త ఉదాహరణ స్వతంత్ర భారతదేశం రాజధాని. స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడమన్నది సర్వ స్వతంత్ర సార్వభౌమ జాతీయతకు ప్రతీక!

11/07/2016 - 00:33

పదకొండు వేల ‘ప్రభుత్వేతర సంస్థ’- నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్-లకు ఇక విదేశీయ నిధులు లభించవన్నది హర్షణీయ పరిణామం. విదేశీయ నిధులను పొందడానికి అవసరమైన ‘అనుమతి’ గడువు ముగిసిపోవడం ఇందుకు కారణం! ‘అనుమతి’ని కొనసాగించాలని కోరుతూ ఈ ‘నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ - ఎన్‌జిఒలు అభ్యర్థనలను దాఖలు చేయలేదట! అందువల్ల వీటికి ఇకపై విదేశీయ నిధులు పొందగల అర్హత లేదు!

11/05/2016 - 07:29

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ‘సచివాలయం కూల్చివేత’ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉమ్మడి హైకోర్టు ఆదేశించడం ఉపశమనం కలిగించిన వార్త. పదోపాతికో సంవత్సరాల క్రితం నుండి వాడుకలో ఉన్న భవనాలు కూల్చేయడం, అదీ కోట్లాది రూపాయల ప్రజాధనం వ్యయపరుస్తూ అయినప్పుడు ఒకటికి వందసార్లు ఆలోచించాలి. నిక్షేపంగా ఉన్న పటిష్టమైన భవంతుల్ని వాస్తుపేరుతోనో, మరేదో కుంటిసాకుతోనో కూల్చివేయాలనుకోవడం తగదు.

11/05/2016 - 07:21

జమ్మూ కాశ్మీర్‌లోని లడక్‌లో ఏర్పడిన వాస్తవ అధీనరేఖ- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్-ఎల్‌ఏసి- పొ డవునా ఉద్రిక్తతలను ఉద్ధృతం చేయడానికి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అమలుజరుపుతున్న విష వ్యూహంలో ఇది మరో ఘట్టం. చుమార్ ప్రాంతంలోని ‘డెమ్‌చోక్’ వద్ద చైనా వారి ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’- పిఎల్‌ఏ- మరోసారి ‘రేఖ’ను దాటి మన వైపునకు చొరబడింది.

11/03/2016 - 23:11

రోధక చర్యలను ముమ్మరం చేయకపోయినట్టయితే అనేక జాతుల వన్యప్రాణులు మరో నాలుగేళ్లలో అంతరించి పోవడం ఖాయమని అంతర్జాతీయ అధ్యయనాలు నిర్థారించడం పర్యావరణం పట్ల అనురక్తి కల వారిని ఆందోళన కలిగిస్తున్న వ్యవహారం.

Pages