S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

10/22/2016 - 01:15

విదేశీయ సంస్థల ఆధ్వర్యంలో వినూత్న రాజధానిని ని ర్మిస్తున్న అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలాది ఎకరాల్లోని ఆకుపచ్చదనాన్ని ‘ప్రగతి’ యజ్ఞానికి ఆహుతినిస్తోంది! మరోవైపు హరిత తెలంగాణను అవతరింప చేయడానికై కోట్లాది మొక్కలను నాటే కార్యక్రమం కూడా కొనసాగుతోంది. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఒక సమాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిపోతోందట! ఏపుగా ఎదిగిన వృక్షాలను గొడ్డళ్లతో నరికి వేయటం ఆ కార్యక్రమం..

10/20/2016 - 22:10

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్న సామెతలో సగం మాత్రమే వర్తమాన వివాదానికి అన్వయవౌతోంది! పిట్టలు రెండు పోట్లాడుకోవడం ఈ సగం.. కృష్ణా జలాలను ఉభయ తెలుగు రాష్ట్రాలు పరస్పరం సామరస్యంగా పంచుకుని ఉండవచ్చు! కానీ జలాలలో ద్వైపాక్షిక వివాద జ్వాలలు చెలరేగడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా పునర్‌ఘటితమైన నాటినుంచి నడచిన కథ!

10/20/2016 - 03:00

ప్రభుత్వేతర రంగ విమాన సంస్థలు రంగప్రవేశం చేసిన తరువాత గగన యానం కారుచౌక అయిపోయిందన్న భ్రమ కొన్నాళ్లు కొనసాగింది. ప్రభుత్వరంగ ఎయిర్ ఇండియా విమానాలలో కంటె ప్రభుత్వేతర సంస్థల విమానాలలో ప్రయాణ శుల్కం తక్కువ కాబట్టి ఎక్కువ మంది.. ప్రధానంగా మధ్యతరగతి వారు ప్రభుత్వేతర విమానాలను ఎక్కడం మొదలైంది! దీనివల్ల జరిగిన మొదటి విపరిణామం ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుని పోవడం!

10/18/2016 - 23:55

ఆవుతలను అమర్చుకొని గోవాకు వచ్చిన ‘చైనా తో డేలు’ తిరిగి వెళ్లిన వెంటనే విషపు కోరల సొంత ముఖాన్ని వికృతంగా ప్రదర్శించింది! ఉగ్రవాదంతో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ముడి పెట్టడం సరికాదన్న వాదాన్ని మళ్లీ వినిపించింది! గోవాలో ఈనెల 15, 16 తేదీల్లో జరిగిన ‘బ్రిక్స్’ ప్రభుత్వాధినేతల సమావేశంలో రూపొందించిన ‘ఉగ్రవాద వ్యతిరేక’ ఉమ్మడి విధాన పత్రాన్ని అంగీకరించినట్టు చైనా అధ్యక్షుడు ఝీ జింగ్ పింగ్ అభినయించాడు!

10/17/2016 - 22:54

ముమ్మారు ‘తలాక్’ చెప్పడం ద్వారా ఇస్లాం మతానికి చెందిన పురుషుడు భార్యకు విడాకులివ్వడానికి వీలు కల్పిస్తున్న మత నిబంధన గురించి చర్చలు ముమ్మరవౌతున్నాయి! ఈ నిబంధనను మత వ్ఢ్యౌవాదులు సమర్ధించడం వెనుక పురుషాధిక్య భావ దురహంకారం తొంగిచూస్తోంది! ఈ నిబంధన కారణంగా అమాయకులైన వివాహిత మహిళలు బలవంతపు విడాకులకు గురై నిరాశ్రయులైపోతున్నారు.

10/16/2016 - 23:29

ప్రచారం జరుగుతున్న స్థాయిలో ప్రభావం ఉండబోదన్నది ధ్రువపడనున్న వాస్తవం.. కానీ, బీభత్స వ్యతిరేక ఆర్భాటానికీ, ఆచరణకూ మధ్య అంతరం తగ్గిపోవడం గోవాలో జరిగిన ‘బ్రిక్స్’ ప్రభుత్వాధినేతల సమావేశంలో సంభవించిన ప్రధాన పరిణామం! పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మరింత తీవ్రంగా ‘బ్రిక్స్’ కూటమి అభిశంసించడం ఈ పరిణామం.

10/15/2016 - 03:14

వ్లాదిమిర్ పుతిన్ విచిత్ర స్వభావానికి సజీవ విగ్రహం. ఆయన రష్యా అధ్యక్షుడిగా మొదటిసారి 2000వ సంవత్సరం మే నెలలో ఎన్నికయ్యే నాటికి రష్యా ఆర్థిక, రాజకీయ సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకుని ఉంది. ఈ సంక్షోభాలు 1991లో అంతరించిన ఏకపక్ష కమ్యూనిస్టు నాయకత్వం ప్రసాదించినవి! పుతిన్ ప్రజాస్వామ్య రష్యాకు రెండవ అధ్యక్షుడు.

10/14/2016 - 00:27

ఆవును కుక్కగా చిత్రీకరించడానికి తస్కర ముష్కరులు చేసిన ప్రయత్నం మరోసారి గుర్తుకువస్తే, అందుకు బాధ్యతను కేంద్ర ప్రభుత్వం వహించవలసివస్తోంది! ప్రాధాన్యం కోల్పోయి మరుగుజ్జులుగా మారి మరుగున పడిపోతున్న రాహుల్‌గాంధీ వంటి మతిలేని రాజకీయవేత్తలకు మళ్లీ ఎంతో కొంత గుర్తింపు రావడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిర్వాహకుల ప్రతిస్పందన దోహదం చేసింది.

10/13/2016 - 04:47

డొనాల్డ్ ట్రంప్ అనేవాడు అమెరికాలో పుట్టి పెరిగిన అభినవ మహిషాసురుడు...కాబట్టి అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ పార్టీ ‘నామాంకిత’-నామినీ-హిల్లరీ క్లింటన్ ఎన్నిక కావడం ఇప్పుడు కేవలం లాంఛనమన్న ప్రచారం జరుగుతోంది. నవంబర్ ఎనిమిదవ తేదీన జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఆమె మట్టి కరిపించడం ఖాయమన్న విశే్లషణలు అమెరికాలోను విదేశాలలోను కొనసాగుతున్నాయి.

10/11/2016 - 06:35

సనాతన జాతి మళ్లీ గర్జిస్తోంది, భద్రతా ధ్యాసకు దూరమై ఏళ్ల తరబడి నిద్రఒడిలో పడివుండిన భరత భూమి ‘‘స్వయమేవ మృగేంద్ర’’ స్వభావంతో సమర స్వరాన్ని సంధిస్తోంది. నిరంతరం దూకుతున్న ఉగ్రవాదపుతోడేళ్ల మందల గుండెలలో భయప్రకంపనాలను సృష్టిస్తున్న సమర స్వరం ఇది, భరత మాత వరాల బిడ్డలు నిశ్చింతగా నిదురించడానికి దోహదం చేస్తున్న నిర్భయ భావగీతం ఇది.

Pages