S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

09/29/2016 - 07:05

ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో పుట్టలుగా గుట్టలుగా పెరిగిన అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలైంది. ఎప్పుడో మొదలు కావలసి ఉండిన ఈ మహానగర ప్రక్షాళన కార్యక్రమం ఇప్పటికైనా శ్రీకారం చుట్టుకొనడం హర్షణీయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరంభించిన ఈ ప్రక్షాళన పథకం అభినందనీయం. ఈ ప్రక్షాళన మురికి నుండి విముక్తి కోసం.. దుర్గందం నుండి విముక్తి కోసం.. అవినీతి నుండి విముక్తి కోసం..

09/28/2016 - 04:47

సింధూ నదీ జల నిర్వహణ మండలి సమావేశాలను జరపడం తాత్కాలికంగా నిలిపివేయాలని మన ప్రభుత్వ నిర్ణయం బీభత్స పాకిస్తాన్ ప్రభుత్వ దుశ్చర్యలను నిరోధించడానికి దోహదం చేయగలదు. పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశంలోని జిహాదీ ఉగ్రవాదులను ఉసిగొల్పడం పూర్తిగా మానుకోనంత వరకూ ‘సింధూ జల నిర్వహణ మండలి’- ఇండస్ వాటర్ కమిషన్- ఐడబ్ల్యుసి- చర్చలు రద్దు చేయాలని మన ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయ పరిణామం.

09/27/2016 - 01:51

ఫ్రాన్స్ నుంచి మన ప్రభుత్వం కొనుగోలు చేయనున్న ‘రాఫెల్’ బహుళ ప్రయోజన విమానాల వల్ల మన వైమానిక దళం సమర పటిమ మరింత విస్తరించనుంది. సంపూర్ణ స్వదేశీయ పరిజ్ఞానంతో సమగ్ర రక్షణ స్వయం సమృద్ధిని సాధించాలన్న లక్ష్యం ఎండమావిలోని మంచినీటి ప్రవాహం వలె ఊరిస్తోందన్న వాస్తవం కూడా ఈ కొనుగోలు ఒప్పందం వల్ల మరోసారి స్ఫురించింది. మన సైనిక బలం రక్షణ పటిమ పెరగడం అనివార్యమైన పరిణామం.

09/26/2016 - 03:36

పాకిస్తాన్ ప్రజలు బీభత్సకాండను ప్రోత్సహిస్తున్న తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవించే రోజులు సమీపిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మరో అంతర్జాతీయ ప్రకంపనం...

09/24/2016 - 00:43

కాలానుగుణంగా అనివార్యమైన మార్పులను స్వాగతించాల్సిందే! ఏ వ్యవస్థలోనైనా మార్పుతోనే రాణింపు ఉంటుందన్న వాస్తవం ఎన్నో సందర్భాల్లో రుజువైంది. కాలం చెల్లిన, వర్తమానానికి ఏ మాత్రం ఉపయోగపడని ఎన్నో చట్టాలకు దశలవారీగా కేంద్రం చరమగీతం పాడుతున్న నేపథ్యంలో తాజాగా రైల్వే ప్రత్యేక బడ్జెట్‌కూ స్వస్తి పలికి దాన్ని వార్షిక సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం అభినందనీయ పరిణామం.

09/22/2016 - 22:41

చినుకుపడితే చాలు..నగరాలు పట్టణాలు నీటి మడుగులుగా మారిపోతుండడానికి ఏకైక కారణం అతార్కికమైన, దుర్మార్గమైన పట్టణీకరణ. కేంద్రీకరణ ఈ క్రూరమైన పట్టణీకరణకు ప్రాతిపదిక!

09/22/2016 - 06:47

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల వివాదం పరిష్కారం అయిపోయిందన్నది కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి బుధవారం కొత్త ఢిల్లీలో వ్యక్తం చేసిన విశ్వాసం. ఉభయ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదపు ఛాయలేవీ ఉన్నత మండలి-అపెక్స్ కౌన్సిల్- సమావేశం తరువాత మాధ్యమాల ప్రతినిధులతో ముచ్చటించిన ఉమాభారతి మాటలలో గోచరించలేదు. కృష్ణా జలవివాదం పరిష్కారం అయిపోయిందన్న ధీమా ఆమె సంక్షిప్త ప్రసంగంలో ధ్వనించింది.

09/20/2016 - 22:18

బలూచీస్థాన్ స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు బ్రహమ్ దహ్ బుగ్తీ మనదేశంలో ఆశ్రయం పొందాలని నిర్ణయించడం అంతర్జాతీయ బీభత్సకాండకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి లభించిన వ్యూహాత్మక విజయం. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ ఉగ్రవాదానికి బలవుతున్న వారందరూ సంఘటితం అవుతున్నారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న బ్రహమ్‌దహ్ బుగ్తీ కుటుంబం పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండకు మూడు తరాలపాటు బలైంది.

09/20/2016 - 07:52

ప్రమత్తత మరోసారి సమర వీరుల ప్రాణాలను తీసుకొంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పిన నలుగురు జిహాదీ ఉగ్రవాదులు పదిహేడుమంది సైనికులను హత్య చేయగలగడం భద్రతా కుడ్యంలో ఏర్పడి ఉన్న కన్నాలకు మరో ప్రత్యక్ష నిదర్శనం.

09/19/2016 - 04:41

కందిపప్పు, మినపపప్పు, సెనగపప్పు ఇంకా ఇతర రకాల పప్పుల ధరలు మరింత పెరగడానికి వీలైన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక వ్యవహారాల సలహాదారుడు అరవింద సుబ్రహ్మణ్యన్ నాయకత్వంలోని నిపుణుల బృందం వారు రూపొందించారట. ఈ నిపుణుల బృందం వారు తమ నివేదికను శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారట.

Pages