ఆదివారం

వైదేహి ( 25వ వారం)

ఆ రాత్రి ఒక ప్రత్యేక ఏకాంత స్థలంలో అన్నదమ్ములు ముగ్గురి సమావేశం జరిగింది. మనసులో గుచ్చుకుంటున్న శూలంలాంటి బాధను ముందుగా లక్ష్మణుడు బయటపెట్టాడు.
లక్ష్మ: శతృ! నిజం చెప్పు- వారు మన అన్నగారి సంతానం కదూ.
భర: సత్యం చెప్పు తమ్ముడూ-నీ ఒక్కడికే ఆ రహస్యం తెలుసు.

వైదేహి - 24వ వారం

దివ్య తేజస్సుతో మెరిసిపోతూ ఇన బింబానికి ప్రతిబింబాలన్నట్టు బాలకులు వచ్చి వినయంగా అందరికీ నమస్కరించి తమ రామాయణ గానాన్ని ప్రారంభించారు.

వైదేహి (23వ వారం)

................
మొదట దైవ ప్రార్ధనతోను,
తరువాత గురు స్తుతి చేసి కథలో
ప్రవేశించారు. రాముడి
గుణగణాల్ని కొనియాడుతూ
మధురమైన కంఠాలతో గానం చేస్తుంటే సభంతా లేచిన దుమ్మును నీటి జల్లు అణచేసినట్టు నిశ్శబ్దమైపోయారు. ఆ సభలో
శతృఘు్నడు తన ముఖాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ముసుగు ధరించి ఒక మూల కూర్చున్నాడు.

వైదేహి - 22వ వారం

రేపటితో వీళ్లతోకూడా తన రుణం తీరిపోతున్నది. కాయగా మారే ముందు పూవు ఒక్కొక్క రేకును విప్పుకున్నట్టు తనకూ ఒక్కొక్క బంధం వదిలిపోతున్నది. ఏ ఘడియల కోసం ఇంతకాలం ఎదురు చూసిందో అవి సమీపించాయి. తన కథక్కూడా ఒక ముగింపు లభించబోతున్నది. తన విప్రబ్ధ జీవితాన్ని ముగించి భూమి పొరల్లో కలిసిపోవడానికి తన మనస్సెంత తహతహలాడుతున్నదో తనకు తెలుసు. అన్నీ తననుకున్నట్టు జరిగితే తనకు విముక్తి లభించబోతున్నది.

వైదేహి (21వ వారం)

ఆశ్రమంలో ప్రయాణ సన్నాహాలు వూపందుకున్నాయి. తెల్లవారు జామున వారంతా బయలుదేరుతారు. వారితోపాటు లవకుశులు కూడా. వాళ్లు ఇప్పటివరకు ఆశ్రమాలు తప్ప నగర జనాన్ని, చక్రవర్తుల్ని కలిసింది లేదు. ప్రయాణం అనుకున్న దగ్గరనుండి అయోధ్యానగరం, దాని వేడుకలు, చిత్రకూటానికి తరలిరావడం గురించి మునికుమారులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. జీవితంలో ఆ వైభవాన్ని ఒక్కసారి చూస్తే చాలట. ఇంకేమీ వద్దన్నంత ఆనందం కలుగుతుందట.

వైదేహి - 20వ వారం

అయోధ్య నగర పౌరులు

వస్త్రాలకు, ఆభరణాలకు

విశేష ప్రాధాన్యత ఇచ్చేవారు.

కేయూరాలు, భుజబంధాలు

వంటి బంగారు ఆభరణాలను

స్ర్తిలు, పురుషులు

సమానంగా ధరించేవారు.

ఆడవారు రత్నాలు తాపిన

మొలనూలును ధరించడం

అలంకరణలో ఒక భాగంగా

స్వీకరించేవారు. దానినే

‘మేఖల’ అని కూడా

అంటారు. మెడలో ధరించే

బంగారు తీగల గొలుసును

వైదేహి 19వ వారం

వారి మాటలు-రూపురేఖలు అతడికి ఇంకా ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నాయి. వారి ముఖాల్లో తమకు బాగా సన్నిహితులైన వారి పోలికలు కన్పిస్తున్నాయి. ఎవరివీ పోలికలు? రూప విశేషాలే ఆశ్చర్యమనిపిస్తుంటే ఇప్పుడీ మాటలు-సాధారణ ముని బాలకులకీవిధమైన పౌరుషం ఎట్లా సాధ్యం? కవ్విస్తున్న వారి చర్యలు సుక్షత్రియుల్లా ఉన్నాయి. వారి చర్యలనెలా అడ్డుకోవాలి?

వైదేహి (18వ వారం)

కదలివచ్చిన అయోధ్యతో చిత్రకూటమే అయోధ్యగా మారిపోయింది. ఎక్కడ చూసినా కోలాహలమే. నదినిండా కొంగల బారుల్లాగా జనాలు స్నానం చేస్తున్నారు. వృక్షాలకు వస్త్రాలు కాసినట్టు ఉతికిన బట్టలు ఆరేస్తున్నారు. ఒకచోట వంటలు, మరోచోట వడ్డనలు ఎంత సందడిగా వుందంటే అదొక అడవి అనే భావన లేకుండా పోయింది. ఎవరికి తగిన మర్యాదలు వారికందుతున్నాయి. ఇనే్నళ్లకు అయోధ్యా పౌరుల్లో ఆనందం తొణికిసలాడుతున్నది.

వైదేహి - 17వ వారం

‘ తండ్రీ! నేను కూడా ఏదీ నిర్ణయించలేకపోతున్నాను. ఏ ఆలోచన ఎటు దారి తీస్తుందో అన్న భయం. అనుకున్నది జరగకపోతే ఆ ఆలోచనే భరించలేకపోతున్నాను. మీరే ఆలోచించండి మహాత్మా! వారికి దక్కాల్సిన తండ్రి ప్రేమను దక్కించండి. నేను రాజ్యాధికారం కోసం ఆలోచించడం లేదు. ఉత్తముడైన రఘురాముని బిడ్డలుగా పుట్టి, ఉన్నతమైన ఇక్ష్వాకు వంశానికి వారసులై వుండి నాతోపాటు ఇలా అనామకంగా రాలిపోవడం నా మాతృ హృదయం సహించలేదు.

వైదేహి (16వ వారం)

ఆ సమయంలో ఆమె తన కొడుకులిద్దరినీ కూర్చోబెట్టుకుని రాజనీతి బోధిస్తున్నది.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading