గ్రామాయణం ---24 -- పదండి ముందుకు!!
‘పదండి ముందుకు! పదండి ముందుకు!’
తోసుకు పోదాం పోదాం పైపైకి!!
కనబడలేదా నవ సమాజపు లుకలుకలు
వినబడలేదా బడి పిల్లల ఆక్రందనలు
ఎవరికి వారు, ఎక్కడికక్కడ వారివారి స్థితిగతులను
దిద్దుకోలేమా మనమందరము
చేయగలచి, చేయదలచిన యువతతో
చేపట్టలేమా నిర్మాణాత్మక కార్యక్రమాలను
బతుకులంతా బండబారి పోవలసిందేనా?
చూస్తూ, చూస్తూ కూర్చుందామా?













