ఆదివారం

అందరి దృష్టి విద్యపైనే!

బాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ, సెక్సీ క్వీన్ విద్యాబాలన్ పైనే ఇప్పుడు అందరి దృష్టి. ‘ద డర్టీ పిక్చర్’ తర్వాత విద్య కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ చిత్రం తెచ్చిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు చేసిన చిత్రాలన్నింటినీ ఈ ఒక్క చిత్రం పూర్తిగా తుడిచివేసింది. బాలీవుడ్ వసూళ్ల రికార్డులో కూడా ముందంజలో ఉండి దూసుకెళ్లింది. దీంతో బాలీవుడ్ హీరోలు, దర్శక, నిర్మాతలు ‘విద్య’ జపం చేస్తున్నార్ట.

ఇక నచ్చిందిలే..!

వెండితెరపై ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన మాధవీలత అనుకున్న అవకాశాలు దరిచేరక తీవ్ర నిరాశ చెందింది. ఒకానొక దశలో ఇక చిత్రసీమకు గుడ్‌బై కూడా చెబుదామనుకుంది. అలాంటి సమయంలోనే అడపాదడపా అవకాశాలు రావడం మొదలైంది. ఎలాగో అలా వెండితెరపై తానేంటో నిరూపించుకోవాలన్న పట్టుదల ఆమెలో మరీ ఎక్కువైంది.

మనసులో మాట!

సినిమా అంటే కొన్ని సూత్రాలకు కట్టుబడి పని చేయాల్సిందే. కోట్లు పెట్టుబడి పెడుతున్నప్పుడు అభిరుచులు, ఆశయాలు, ఉత్తమ విలువలు కాసేపు మర్చిపోక తప్పదు. సినిమాల్లో నాయిక పాత్ర ఈ పరిధుల్లోనే కొట్టుకుపోతోంది. సినిమాల్లో అందర్నీ ఆకర్షించే వస్తువుగా మిగిలిపోతోంది. ఈ విషయాన్ని నాయికలు కూడా ఒప్పుకొంటున్నారు.

శృతా..మజాకా!!

చాలా మంది హీరోయిన్‌లు తొలిసారి మేకప్ వేసుకొంటున్నప్పడే ఆస్కార్ అవార్డు తీసుకొంటున్నప్పుడు ఫొటోకి ఎలా ఫోజులివ్వాలో ఊహించుకొంటారు. వాటిల్లో తప్పేంలేదు. మన ఎదుగుదలకు ఎవరినో ఒకర్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే. శృతిహాసన్ మాత్రం అలా చేస్తే జిరాక్స్ కాపీలా తయారవుతాం...అని హెచ్చరిస్తోంది. ‘ఏదో అయిపోదామని ఈ రంగంలోకి రాకూడదు. ఎందుకంటే ఇక్కడ మన కోసం ఎవరూ పూలబాట పరచరు. ఈ దారిలో ముళ్లూ రాళ్లూ ఎదురవుతాయి.

నూతనోత్సాహం!

‘బోణీ’ భామ కృతి కర్బందాలో ఇప్పుడు నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. తాజాగా ఆమె మంచు మనోజ్‌తో చేసిన ‘మిస్టర్ నూకయ్య’ నటిగా ఆమె ఏమిటో నిరూపించింది. ఈ చిత్రం ద్వారా ఆమెకు పరిశ్రమలో మంచి మార్కులే పడ్డాయంటున్నారు సినీ విశే్లషకులు. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు ఆమె కళ్యాణ్‌రామ్ సరసన త్రీడీ చిత్రం ‘ఓమ్’లో నటిస్తోంది. ‘బోణీ’తో టాలీవుడ్‌లో మెరిసిన ఈ భామ అటు తర్వాత పవన్‌కళ్యాణ్ సరసన ‘తీన్‌మార్’ చేసింది.

హరివిల్లు

అలవోకగా మోడలింగ్‌లో పోజులిచ్చేసి బాలీవుడ్‌పై అడుగుపెట్టిన దీపికా పదుకొనె వెండితెరపై కూడా తానేంటో నిరూపించుకుంటోంది. బాలీవుడ్‌లో ఎంత మేరకు ఎక్స్‌పోజ్ చేయాలో అంత వరకే చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళుతోంది. దీపికా తన గురించి తాను ఏం చెబుతుందో చూద్దాం...
నా తత్త్వం: షైగా, క్వయిట్‌గా వుంటాను
నచ్చే ఫ్యాషన్ దుస్తులు: వైట్ షర్ట్, జీన్స్

హరివిల్లు

‘హ్యాపీ హ్యాపీగా...’!
తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ ముందుకు దూసుకెళుతున్న బ్యూటీ తమన్నా కెరీర్ ఇప్పుడు ‘హ్యాపీ హ్యాపీగా..’ సాగిపోతోంది. తను చేసే ప్రతీ చిత్రంలోనూ తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర ఉండాలన్నదే ఈ బ్యూటీ తాపత్రయం. తమన్నా గురించి కొన్ని విషయాలు పరికించి చూద్దాం...
పేరు: తమన్నా
పుట్టిన రోజు: 21 డిసెంబర్ 1989
ముద్దుపేరు: తమ్ము
చదువు: బిఏ

కరీనా పెళ్లికబురు!

గత ఐదేళ్లుగా సైఫ్ అలీఖాన్‌తో నడిపిస్తున్న ప్రేమాయణానికి కరీనా పెళ్లి కబురుతో ఇక ఫుల్‌స్ట్ఫా పెట్టాలనుకుంటోంది. బాలీవుడ్ జనాలు కూడా వీరి పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కరీనా సహ నటీమణులైతే ఆమె పెళ్లి కబురుకోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వారిలో అంత ఉత్సాహమెందుకంటే పెళ్లితో సినిమాలకు గుడ్‌బై చెప్పి పోటీ నుంచి తప్పుకుంటుందని కాబోలు!

అవధుల్లేని ఆనందం!

బాలీవుడ్ సెక్సీబ్యూటీ విద్యాబాలన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కారణం..ఆమె నటించిన ‘ద డర్టీ పిక్చర్’లోని పాత్ర విద్యను జాతీయ స్థాయిలో ఉత్తమ నటిని చేసింది. దాంతో ఆమె ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ‘‘ద డర్టీ పిక్చర్’ సినిమా కోసం ఎంతో శ్రమించాను. ఈ అవార్డుతో ఆ శ్రమ మరచిపోయేలా చేసింది. నేను ముందే ఊహించాను..ఈ చిత్రంలోని క్యారెక్టర్ నాకు అవార్డు తెచ్చిపెడుతుందని.

ప్చ్... తనూశ్రీ!

నేహా ఫిలాసఫీ!
గతం గురించి ఆలోచించకూడదు ఈ క్షణం ఆనందంగా ఉంటూ రేపటి సంతోషాన్ని ప్లాన్ చేసుకోవాలన్నదే నేహాధూపియా ఫిలాసఫీనట. బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటించి నటిగా మంచి మార్కులు తెచ్చుకున్న నేహా తన గురించి ఇలా వివరించింది.
ముద్దుపేరు: ఛోటూ
పుట్టిన రోజు: ఆగస్టు 27, 1980
జన్మస్థలం: కొచ్చిన్
చదువు: చరిత్రలో గ్రాడ్యుయేషన్
కీర్తికిరీటాలు: మిస్ ఇండియా 2002,

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading