ఆదివారం

రాధామాధవం

ఒక బిడ్డ తన తల్లిని కనిపెట్టడం ఎంత తేలిక! అక్కను గుర్తించడం, అన్నను గుర్తించడం, పసికందుకు కష్టం. మరి అమ్మ విషయం...? అమ్మను పసిపాప కెలా పరిచయం చేస్తాం? అమ్మను గురించి ఏమని వర్ణించి వివరిస్తాం? అమ్మకు నిర్వచనం పాపకు చెప్పగలమా? అమ్మను చూసీ చూడగానే పసికందు పెదవులపై నాట్యమాడే బోసినవ్వు కంటె సమాధానమేముంది?

జీవన బృందావనం --- శరణాగతి

నడకలోని కదలికలో ఒక లక్ష్యం ఉంది. నాట్యంలోని కదలికలో ఏ లక్ష్యమూ లేదు. మరి నాట్యంలో ఎంత ఆనందముంది! మాటకూ, పాటకూ పెదవులు కదులుతాయి. మాటలో తన భావం ఎదుటివారికి చెప్పాలనే సంకల్పం ఉంది. ఆశయం ఉంది. పాటకు ఏ ఆశయమూ లేదు. పాటకు పాడటమే పరమావధి. మాటకు మామూలుగా స్పందిస్తాం. పాటకు పరవశంతో మైమరిచిపోతాం. పనిచేస్తున్నంత వరకూ పనిలో ఆనందం పొందుతాం. ఫలితం రాగానే (అనుకూలమైనా, వ్యతిరేకమైనా సరే) అంతటితో సరిపోతుంది.

జీవన బృందావనం --- ఆశారాహిత్యం

కంగారు పుట్టించే వేదాంత పరిభాష జోలికి వెళ్లకుండా హాయిగా కొద్దిసేపు ముచ్చటించుకుందాం. సముద్రపు ఒడ్డున ఒక పిల్లవాడు కేరింతలు కొడుతున్నాడు. ఆటలాడుతూ, అలలు పట్టుకోవాలని లోలోపలకి వెళుతున్నాడు. అక్కడున్న ఓ పెద్దాయన, ‘బాబూ ఏమిటలా వెళ్లిపోతున్నావు’ అని అడిగాడు. ‘బలే సరదాగా ఉంది, కెరటాలతో ఎంచక్కా ఆడుకుంటాను’ అని కుర్రవాడు సమాధానమిచ్చాడు. ‘ఈత వచ్చా నీకు?’ పెద్దమనిషి మళ్లీ ప్రశ్నించాడు.

జీవన బృందావనం ... ఈత నేర్పిన గీత

జీవితంలోని ఆటుపోట్లకు విజ్ఞాని బెదరడు. తుపానులకు చెక్కుచెదరడు. సుడిగుండాల్లో చిక్కుకోడు. కన్నీటి బిందువు గర్భంలో ఆనందపు శిశువు రూపుదిద్దుకుంటుందని అతనికి తెలుసు. చూసే పద్ధతి ననుసరించి ఒకే అంకె ఒకసారి ఆరు (6)లా, మరొకసారి తొమ్మిది (9)లా కనిపిస్తుంది. ఒకే వస్తువు ఒకసారి సుఖాన్నీ, మరోసారి దుఃఖాన్నీ ఇస్తుంది. జ్ఞానికి సుఖంలా కనపడేది, మామూలు వ్యక్తికి దుఃఖంలా దర్శనమీయవచ్చు.

జీవన బృందావనం --- దుఃఖబాష్పం

మనను ద్వేషించే స్వభావం దైవానికి లేదు. మనను శిక్షించే తత్వం ఆయనది కాదు. మన పాపాలకు, నేరాలకు పగ సాధించాలనే వాంఛ పరమాత్మకు లేదు. మన వేదనలతో తాను వేడుక చేసుకునే నైజం భగవంతునిలో అణుమాత్రమైనా లేదు. మనపై ఆయనకున్న ప్రేమ అనిర్వచనీయమైనది. వర్ణించ శక్యంకానిది. ఆయన ప్రేమ ఎంత గాఢమైనదంటే, అనుక్షణం మనం ఆయనను ద్వేషిస్తూనే ఉన్నా, ప్రతిక్షణం మనను ప్రేమిస్తూనే ఉంటాడు.

జీవన బృందావనం -- అశ్రుబిందువు

‘అశ్రుబిందువు’.. ఆ పదం ఎంత కమనీయంగా ఉంది! నా చెవులకు ‘అమృత బిందువు’లా వినిపిస్తోంది. ఆ మాట ఉచ్ఛరిస్తే చాలు, నా పెదవులు పునీతవౌతాయి. నా మదినిండా శాంతి పవనాలు పరిమళిస్తాయి. విషాదాశ్రువు నాకెంత విజ్ఞానాన్ని ప్రసాదించింది! ఎన్ని జీవిత పాఠాలు నేర్పింది! ఎనె్నన్ని విశ్వరహస్యాలు నా చెవులకు చేరవేసింది! శోకదేవత కరస్పర్శ ఎంత మృదువైనది! విషాద సంగీతపు మాధుర్యం వర్ణనాతీతం. కేవలం అనుభవైకవేద్యం.

కన్నీటి కెంపులు

పాపకు మాత్రమే అమ్మ స్వంతం. పాపకు మాత్రమే అమ్మపై స్వతంత్రం. పసికందుకు తల్లిని వెతికే అవసరం రాదు. అమ్మే పాపను వెతికి అక్కున చేర్చుకుంటుంది. అమాయకపు పసి హృదయం చిన్నదవుతూ, ఆలోచించే మెదడు పెరుగుతున్న తరుణంలో అమ్మను వెతికే అవసరం పాపకు మొదలవుతుంది. అమ్మ ఎప్పుడూ మనతోనే ఉండాలంటే, తిరిగి మనం ఆ పసితనాన్ని అందుకోవాలి. మనుషులుగా శారీరకంగా ఎదిగిన మనం, శిశువులుగా మానసికంగా ఎదగాలి.

జీవన బృందావనం

ఒక్కసారి మన శరీరంలోని రక్త ప్రసార వ్యవస్థపై దృష్టిని ప్రసారం చేద్దాం. ఇది శరీరంలోని రవాణా వ్యవస్థ. ఇది చాలా పొడవైన ప్రయాణ మార్గం. సువిశాల భారతదేశానికి వెనె్నముక లాంటి ప్రధాన రవాణా వ్యవస్థ ‘్భరతీయ రైల్వే’. అరవై మూడు వేల కిలోమీటర్ల సుదీర్ఘమైన రైలు మార్గంలో, పదకొండు వేల రైళ్ల్లు, వేలాది టన్నుల సరుకులను, లక్షలాది ప్రజలను ప్రతిరోజూ రవాణా చేస్తున్నాయి.

జీవన బృందావనం

కనపడే ఈ సౌందర్య మకరందాన్ని తృప్తిగా కళ్లతో త్రాగండి. గుండె గదిలో పదిలంగా ఆ మధురానుభూతిని దాచుకోండి. అప్పుడప్పుడు హృదయాన్ని సున్నితంగా మీటి ఆ కమనీయ స్వరాలు మళ్లీమళ్లీ వినండి. తీయని స్మృతులు నెమరువేసుకోండి. ఒక మంచి పండు నీకు అందుబాటులో ఉన్నపుడు చేతిలోకి తీసుకో. పండు గుణగణాలను పొగడుతూ అది తయారైన విధానానికి అచ్చెరువొందుతూ హాయిగా తిను.

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading