పాలనాగు
ఊపిరి తీగ నుండి గుండెలయ దాకా
వొక బాధ వెంటాడుతూనే ఉంటుంది
పసిగులాబీ మొగ్గల బుగ్గల్ని
పాలనాగు కసిగా కాటేస్తున్న బాధ
కలల బంగారు ముద్దల్ని కాకి బంగారం చేస్తూ
కల్తీవిషాన్ని కడుపులో కుమ్మరిస్తున్న బాధ
మంచుబిందువంత స్వచ్ఛమైన నవ్వుపైన
హాలాహలాన్ని పెయింటు చేస్తున్న బాధ
వేయిపడగల వ్యాపార కాలకూటం
కాసుల వేటలో కసిగాయల్ని సైతం















