ఆదివారం

ఎడిటర్‌తో ముఖాముఖి -- మనలో మనం

కాళిదాసు, కావలి,

నెల్లూరు జిల్లా
మిమ్మల్ని సినీ

దర్శకులు కె.విశ్వనాథ్‌తో

సరిపోల్చుకొంటానే్నను.

ఆహార్యంలోనూ కొంత

సామ్యముంది. ఇక

ఆచార వ్యవహారాలు,

పనితీరులో రంగాలు

వేరైనా శైలి ఒక్కటేనని

నా అభిప్రాయం.

ఏకీభవిస్తారా?

ఖండిస్తారా?
నాకు ఒక్క ముక్కా అర్థం

కాలేదు.

సిహెచ్.సాయి ఋత్త్విక్,

ఎడిటర్‌తో ముఖాముఖి.. మనలో మనం

తాళాబత్తుల సత్యనారాయణమూర్తి, మల్కాపురం, విశాఖ
అన్ని టాబ్లాయిట్లు రంగురంగుల్లో జిగేల్ జిగేల్ మనిపిస్తుంటే పూటకూళ్లమ్మ వంట, వడ్డనలా వుంటే ఎలా? కొంచెం ఫేషన్‌బుల్ టచ్ ఇవ్వలేరా?
పూటకూళ్లమ్మకూ కస్టమర్లుంటారు.

బ్లాక్ అండ్ వైట్‌ని మడిచేసి, పాత హోల్డింగులకు పాతరేసి 30, 40 ఏళ్లు దాటినా ఇంకా వోల్డు ఈజ్ గోల్డు అంటే ఎలా?
ఎవరంటున్నారు?

ఎడిటర్‌తో ముఖాముఖి -- మనలో మనం

సిహెచ్.సాయి ఋత్త్విక్, నల్గొండ
తెలంగాణపై ఒక పార్టీది మూడు నాల్కల ధోరణి, మరొకటి నాన్పుడు ధోరణి కాగా మరొక పార్టీ వైరాగ్య ధోరణి అవలంబిస్తోంది. రాష్ట్రంలో రాజకీయాలను శాసించే ముఖ్యమైన పార్టీలు తమ వైఖరి చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం లేదంటూ కేంద్రంపై నింద వేయడం సబబేనా?
పార్టీల వైఖరి తేలితే తప్ప కేంద్రం తెలంగాణను ఇవ్వలేదా?

ఎడిటర్‌తో ముఖాముఖి .. మనలో మనం

వై.కె.మూర్తి, విజయవాడ
పుల్లయ్యని విమర్శించే స్థాయి ఎల్లయ్యకు లేదు. ఎల్లయ్యను విమర్శించే స్థాయి పుల్లయ్యకు లేదు. అయ్యా, ఇదీ నాయకుల ధోరణి. దీంతో స్థాయి ఎవరికుందో తెలియడంలేదు.
ఎవరికీ లేదు.

ఎడిటర్‌తో ముఖాముఖి -- మనలో మనం

సి.సాయి మనస్విత, సీతమ్మధార, విశాఖపట్నం
ఎవరిని ఈ రోజుల్లో అడిగినా టైము లేదంటున్నారు. పొద్దున లేచిన దగ్గర నుండీ ఒకటే ఉరుకులు పరుగులు. చిన్నాచితకా, ముసలీ, ముతకా అందరిదీ బిజీ లైఫ్. ఇంత హడావిడీ మనకు అవసరం అంటారా సార్?
అది ఆలోచించే టైము లేదు.

మనలో మనం ఎడిటర్‌తో ముఖాముఖి

ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు
ఒక దేశం మరొక దేశం నుండి అప్పు ఆర్థిక సహాయం పొందటం కంటే తమ దేశంలోనే కొన్ని నోట్లను అధికంగా ముద్రించి అవసరం తీర్చుకొనవచ్చును గదా?
దానివల్ల అవసరాలు తీరవు. సమస్యలు పెరుగుతాయి. కరెన్సీ నోట్ల ముద్రణకు కొన్ని పద్ధతులూ, కట్టడులూ ఉంటాయి. వాటిని అతిక్రమిస్తే మొదటికి మోసం.

మనలో మనం -- ఎడిటర్‌తో ముఖాముఖి

శేఖరమంత్రి వెంకట రమణయ్య, కంచరపాలెం
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర శాసనసభ ఏడు ఉప ఎన్నికల ఫలితాలు సామాన్యుడు ఊహించినవే. నాయకుల అంచనాలు ఎందుకు తలకిందులు అవుతున్నాయి!
నాయకులూ ఊహించినవే. కాని ఆ మాట పైకి చెప్పరు. గెలిచే ఆశ ఏ కోశానా లేదని తెలిసిన వాడు కూడా ఆ మాట ఒప్పుకోడు.

మనలో మనం -- ఎడిటర్‌తో ముఖాముఖి

ఎం.శంకరం, హైదరాబాద్
కుళ్ళే కళగా విరాజిల్లే నేటి లలిత కళల అధ్వాన్న స్థితికి కారకులెవరు?
కుళ్లుబోతులు.

మనలో మనం

సి.ప్రతాప్, సూర్యాపేట
ఈ ఏడు ఆస్కార్ అవార్డులు మనకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు నిర్మిస్తున్న దేశాలలో మనది రెండవ స్థానంలో ఉండగా ఒక్క అవార్డు కూడా గెల్చుకోలేక పోయాం. మనలో పదోవంతు సినిమాలు తీసే పలు దేశాలకు అవార్డులు లభించాయి. కారణం ఏమిటి?

ఎడిటర్‌తో ముఖాముఖి ---- మనలో మనం

పి.చంద్ర, కాకినాడ
ఈ మధ్య మీకు ప్రభుత్వ, వాణిజ్య సంస్థల ప్రకటనలు బాగానే వస్తున్నట్టున్నాయ. ఏ మాయ చేశారో ?
అది చేతకాకే ఇలా...

ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశం జిల్లా
మనం రానురాను ప్రజాస్వామ్యం నుండి దూరమై పోతున్నాం. మీరేమంటారు?
ఆ పదార్థం మనకు ఎప్పుడూ దూరమే.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading