ఆదివారం

ఈ సైట్ మీకు తెలుసా? -- మీరు చేయాలనుకుంటున్న పనులు

మనలో ప్రతీ ఒక్కరికీ లక్ష్యాలు ఉంటాయి. తమతమ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పరచుకున్న ఆ లక్ష్యాలని చేరుకోవాలని అంథరూ అనుకుంటారు. అలాగే, తమకిష్టమైన పనులకి, అభిరుచులకి కూడా సమయం కేటాయించాలి అనుకుంటారు. ఏర్పరచుకున్న ఆ లక్ష్యాలను చేరుకోడానికి, అభిరుచులను ఆస్వాదించడానికి తగిన కృషి చేయవలసింది మీరే.

విను నా మాట -- క్షణాలను గుణించటం తెలియాలి!

నిన్నా జీవితాన్ని ప్రేమించాం.. నేడూ ప్రేమిస్తున్నాం.. రేపూ ప్రేమిస్తాం. ఇలా ప్రేమించటం మన సహజ స్వభావం. కారణం జీవితం మనథి కాబట్టి. మనలను మనం ప్రేమించుకుంటున్నాం. కాబట్టే మన జీవితాన్ని ప్రేమిస్తుంటాం. కష్టాలు వచ్చినప్పుడు, కన్నీరు వొలికినపుడు జీవితాన్ని విసుక్కున్నా, చీదరించుకున్నా లోలోతుల నుండి ప్రేమిస్తూనే ఉంటాం.

విప్లవవీరుడు - 2 -- అల్లూరి బందిపోటా?

‘పెద్దాపురము కాంగ్రెసు వారేమియు కల్పించుకొనగూడదు. దోపిడీగాండ్రు పోలీసుస్టేషనులను దోచుకొని, తుపాకులను తూటాలను తీసికొని పోవుచుండ కాంగ్రెసు వారు చేయవలసినదేమో నాకు బోధపడుట లేదు. వారి దగ్గరకు పోయి మీరిటుల చేయగూడదని నెమ్మదిగా బోధించుటకు గూడ నవకాశము లేదు. కాంగ్రెసు వారెవరును బందిపోటుల కడకు పోగూడదు. కాంగ్రెసు నాయకులు రావలెనను తంతి వార్తలను పత్రికలకు పంపుటయే అసంగతము’

పాటకచేరీ

ఏప్రిల్ 29, ఆదివారం అనుబంధంలో బ్లాగ్.. బ్లాగ్ మమ్మల్ని ఎంతగానో అలరించింది. చక్కటి చిత్రాలతో వారం వారం కనువిందు చేస్తున్నాయి. ‘హలో మైక్ టెస్టింగ్’ సరదా సంగతులు సరదాగా సాగిపోతూ మమ్మల్ని నవ్వుల లోకంలో విహరింపజేస్తోంది. ‘మల్లాది మిరియాలు’ బాగుంటున్నాయి.
-మార్కస్ మణిరాజ్ (ముద్దనూరు)

అల్లూరి నుంచి నేతాజీ దాకా... 1 - ఒకే ఒక్కడు

అనగనగా ఒక ‘చిట్టిబాబు’. రెక్కాడితేగాని డొక్కాడని మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. పదకొండవ ఏట తండ్రిని పోగొట్టుకున్నాడు. పెద్దకొడుకు అయి ఉండీ ఇల్లు ఎలా గడుస్తుందన్న ధ్యాస లేదు. తల్లి అష్టకష్టాలూ పడి, బంధువుల పంచన చేరి, పళ్ల బిగువున చదివించదలిచినా అబ్బాయికి చదువు అబ్బలేదు. ఫస్ట్ ఫారమే మూడేళ్లు చదివాడు. ఫోర్త్ ఫోరం (తొమ్మిదో తరగతి) మధ్యలోనే చదువును గుంటబెట్టి గంట వాయించాడు.

నీళ్ల అడుగున అందాలు

స్విట్జర్లాండ్‌లోని వెర్జాస్కా నది అంటేనే పారదర్శకతకు పెట్టింది పేరు. అంత అద్దంలా వుంటాయి నీళ్లు. నీటి అడుగున ఏమున్నదీ స్పష్టంగా తెలుస్తుంటుంది. అయితే అందరూ దీన్ని పైనుంచే చూసి, ఆనందించి, ఫొటోలు తీసుకుని చూసి, మురిసిపోతే, ఫొటోగ్రాఫర్ క్లాడియో గజ్జరోలి మాత్రం ఇంకోలా ఆలోచించాడు. డైవింగ్ సూట్ వేసుకుని, వాటర్ ప్రూఫ్ కెమేరా తీసుకుని, కొన్ని అద్భుతమైన చిత్రాలు తీసాడు.

విను నా మాట

నిన్న, నేడులు కరిగిపోయాయి.. రేపు ఒక్కటే కాలానికి ఎదురీది నిలబడ్డట్టు అనిపిస్తుంటుంది. నిన్న నేడులలో జీవితాన్ని పారేసుకుని రేపటిలో ఆరేసుకోవాలని ఉబలాటపడుతుంటాం. నిన్న కన్న కల నేడు కల్ల కావటంతో వికారంగా మొహం పెడతాం. కనీసం నేడు కంటున్న కల రేపు సాకారం కాకపోతుందా అని కమ్మగా ఆశపడుతుంటాం. జీవితాన్ని రేపు ధరించాలనుకోవటం, భవిష్యత్తుకు బదిలీ చేయటం మనలో ప్రతి ఒక్కరం చేసేదే!

ఈ సైట్ మీకు తెలుసా?

మనం రోజూ పేపర్లో ఎన్నో వార్తలు చదువుతుంటాం. వింతలూ, విశేషాలు కూడా. వీటితోపాటే, ఆ వార్తా విశేషాలకు సంబంధించిన ఛాయాచిత్రం వేసినప్పుడు ఆసక్తిగా చూస్తాం. ఇవే కాకుండా, అందమైన ప్రకృతికి ప్రతీకగా ఉన్న ఒక చక్కటి ఛాయాచిత్రం చూసినప్పుడు కూడా ఎవ్వరికైనా ఆనందం కలుగుతుంది. ఇక ఫొటోగ్రఫీపై మక్కువ, అభిరుచి ఉన్న వారైతే చెప్పనే అక్కర్లేదు. వారికి చూసే ప్రతీ దాంట్లో ఒక చిత్రం కనిపిస్తుంది.

సోలార్ మ్యూజియం

ఈ రోజుల్లో మ్యూజియం అంటే తెలీని వారుండరు. అరుదైన కళాఖండాలూ.. యుద్ధ సామాగ్రి.. ఒకప్పటి సంస్కృతి ఆనవాళ్లు - ఒకటేమిటి? ఎనె్నన్నో. ఆ మ్యూజియంలో దర్శించి తరించవచ్చు. కానీ - హబ్బళ్లిలోని విజయనగరంలో ఉన్న ‘మ్యూజియం’ మాత్రం అందుకు భిన్నం. అదే సోలార్ మ్యూజియం.

ఈ సైట్ మీకు తెలుసా? -- సంగీత ప్రియులకి...

భారతీయ శాస్ర్తియ సంగీత ప్రియులందరికీ ఒక చక్కటి వార్త. పలు ప్రముఖ సంగీత విద్వాంసులు ఆలపించిన లేక ఏదేని వాయిద్యంతో వినిపించిన కీర్తనలు, కృతులు ఒక్కచోట వినే అవకాశం ఒక వెబ్‌సైట్ కల్పిస్తోంది. ఆ సైట్ అడ్రస్:
http://www.sangeethapriya.org/

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading