యూరప్‌లోని పేద దేశాల్లో ఒకటైన స్లోవేనియా పర్యాటకులను ఆకర్షించే దేశం. స్విట్జర్లాండ్‌లో సగం ఉండే ఈ దేశ జనాభా 20 లక్షలు. 1991లో స్వతంత్రం పొందింది. ఇక్కడి బీచ్‌లు, మంచు కప్పిన పర్వతాలు, ద్రాక్ష తోటలు, సన్‌ఫ్లవర్ పంట, పురాతన చర్చ్‌లు, కోటలు చూడదగ్గవి. ఇటలీ, ఆస్ట్రియా, హంగరీ, క్రోయేషియా దేశాలు దీని సరిహద్దులు.
చూడదగ్గ విశేషాలు
ఇది యూరప్‌లోనే ఉన్నా, అక్కడి మిగిలిన దేశాల్లా ఇది ప్రసిద్ధి చెందింది కాదు. బ్రటన్‌కీ, ఫ్రాన్స్‌కి మధ్య ఇంగ్లీష్ ఛానల్‌లోగల ఎనిమిది ద్వీపాలకి ఛానల్ ఐలండ్స్ అని పేరు. వీటిని ఫ్రెంచ్ ఛానల్ ఐలండ్స్ అని కూడా పిలుస్తూంటారు. ఫ్రెంచ్ తీరమైన నార్మండీ నించి ఎనిమిది మైళ్ల దూరంలోని ఈ ద్వీపాల్లోని ఆల్డర్న్ ద్వీపం కనిపిస్తూంటుంది. అన్ని ద్వీపాలలో కలిపి జనాభా 1,58,000. విస్తీర్ణం 194 చదరపు కిలోమీటర్లు.
యూరప్‌ని సందర్శించే పర్యాటకులు స్విట్జర్లాండ్‌లోని ఏదో ఓ ప్రదేశాన్ని తప్పనిసరిగా చూస్తారు. ఆ దేశపు నాలుగో పెద్ద నగరం బెర్న్. దీని జనాభా 6,60,000. ఇక్కడ అధికార భాష జర్మన్. కానీ ‘బెర్నీస్ జర్మన్’ అనే మాండలికాన్ని వారు మాట్లాడతారు. బెర్న్‌లోని పాత నగరాన్ని 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ప్రపంచంలో చక్కని జీవన శైలిగల మొదటి పది నగరాల్లో బెర్న్ ఒకటి.
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌ని యూరోపియన్ యూనియన్ కేపిటల్‌గా కూడా పిలుస్తారు. 10 లక్షల జనాభాగల ఇది 19వ శతాబ్దంలో బెల్జియంకి రాజధాని అయింది. వెంటనే పాత నగరాన్ని ధ్వంసం చేసి కొత్త కోటలని, పాఠశాలలని, కార్యాలయ భవంతులని, ఆర్మీ బేరక్స్‌ని నిర్మించారు. 1880-1980 మధ్య ఈ నిర్మాణం కొనసాగుతూనే ఉంది. కేవలం ఒక్క స్క్వేర్‌ని మాత్రమే చరిత్ర కోసం ధ్వంసం చేయకుండా ఉంచారు.
ఇటలీ రాజధాని రోమ్‌కి ‘ఇటర్నల్ సిటీ’, ‘లాడోల్స్‌విటా’ (స్వీట్ లైఫ్) అనే ముద్దు పేర్లున్నాయి. 2500 సంవత్సరాల పాత సిటీ ఇది. ఈ సిటీ సెంటర్ మొత్తం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపబడింది.
ఇక్కడ చూడదగ్గ విశేషాలు
యూరప్‌లో ఎక్కువ మంది పర్యాటకుల గమ్యం పేరిస్. కళలు, ఆహార పదార్థాలు, వైన్, ఫ్యాషన్, రొమాన్స్‌లకి అది రాజధాని. ఎన్నడూ నిద్రించని నగరంగా పిలువబడే పేరిస్‌లో చూడదగ్గ కొన్ని ముఖ్యాంశాలు.
నెదర్లాండ్స్ లేదా హాలెండ్ రాజధాని ఆమ్‌స్టర్ డేమ్ యూరప్‌లలోని ప్రముఖ పర్యాటక నగరాలలో ఒకటి. పనె్నండవ శతాబ్దంలో ఏమ్‌స్టెల్ నదికి డేమ్ కట్టారు. దాని పక్కనే ఏర్పడిన గ్రామానికి ఏమ్‌స్టర్ డేమ్ అనే పేరు వచ్చింది. అదే నేటి ఆమ్‌స్టర్ డేమ్. 12 లక్షల జనాభాగల ఇది 2010లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో చేరింది.
ఇక్కడ చూడదగ్గ కొన్ని విశేషాలు
ఇటలీలో చూడాల్సిన ప్రదేశాలలో వెనిస్‌కి విశిష్టమైన స్థానం ఉంది. ఇటలీకి ఈశాన్య దిశలోగల ఈ పట్టణం జనాభా 2 లక్షల 72 వేలు. విస్తీర్ణం 416 చదరపు కిలోమీటర్లు. పదవ శతాబ్దం నించి ఇక్కడ జనావాసం ఉంది. 117 చిన్న ద్వీపాలుగల వెనిస్‌లో పో, పైవే అనే రెండు నదుల ముఖ ద్వారాలు ఉన్నాయి. కళలకు ఇది పెట్టింది పేరు.
సముద్ర తీరం లేని దేశాలలో ఒకటి ఆసియాలో హిమాలయాలకి తూర్పున ఉన్న భూటాన్. నేపాల్, సిక్కిం, చైనా, ఇండియా, బంగ్లాదేశ్‌లు దీని సరిహద్దులు. వీరి పూర్వీకులు టిబెట్ నుంచి ఇక్కడికి వలస వచ్చిన యుద్ధ వీరులు. దీని జనాభా సుమారు ఏడు లక్షలు. బౌద్ధమతం ప్రధాన మతం. రాజధాని థింపూ. 2007లో ఇది రాజరికం నించి రాజ్యాంగ రాజరికానికి మారింది. దీని విస్తీర్ణం 38,394 చ.కిమీ.