ఆదివారం

చారిత్రాత్మక నేరస్థుల వేట

1998లో ఆఫ్రికాలో ఓ దేశంలోని అమెరికన్ ఎంబసీ మీద బాంబు దాడి జరిగినప్పుడు అది బిన్‌లాడెన్ పని అని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ ఓ ప్రెస్ రిలీజ్‌లో పేర్కొన్నాడు. ఆ తర్వాత న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్ మీద దాడి జరిగాక బిన్ లాడెన్ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది.

ఆదివాసీల సంస్కృతికి దర్పణం.. ‘రేలా’ సంబరం

ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో 2013 ఏప్రిల్ 10, 11వ తేదీల్లో రెండురోజులు అంతర్‌రాష్ట్ర ఆదివాసీ సాంస్కృతిక సమ్మేళనం ఖమ్మం జిల్లా చింతూరు మండలం చింతూరు గ్రామ సంత మైదానంలో భారీగా జరిగింది.

చిరుతిళ్లు - కమామీషు

మన దేశంలో చిరుతిళ్లు ఇళ్లల్లో ఆడవాళ్లు తయారుచేసి పెడుతూంటారు. జంతికలు, అరిసెలు, చెక్కలు, పాలకాయలు, చేగోడీలు.. ఇలా. కాని విదేశాల్లో పెద్దపెద్ద కార్పొరేషన్స్ అత్యధిక క్వాంటిటీని తయారుచేసి చవకగా పాకెట్లలో అమ్ముతూంటాయి. రీసెర్చ్ శాఖ వారే వీటన్నింటినీ కనిపెట్టేది. ప్యాకింగ్ నించి వీటి మీద ప్రత్యేక శ్రద్ధని తీసుకుంటారు.

సరస్సులో నగరం

తూర్పు చైనాలోని ‘జెజియాంగ్’ గురించి లోకానికి అంతగా తెలీదు. ఎక్కడో చరిత్ర పుటల్లో అక్షరబద్ధంగా మారిపోయింత్తర్వాత ఆ సంస్కృతి సంగతి పట్టించుకున్న వారూ లేరు. ఇది 1,339 ఏళ్లనాటి కథ. ‘జెజియాంగ్’ ప్రాంతంలో అందమైన ఖియాండువా సరస్సు గర్భంలో ఒక మహానగరం నిక్షిప్తమై ఉన్నట్టు స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ చూసిన వాళ్లులేరు. అదే ‘షిచెంగ్ సిటీ’.

సిరి సూక్తులు

‘సంపన్నులను చూసి ఈర్ష్య పడకు, వారి నుంచి ఏమైనా నేర్చుకునేది ఉంటే నేర్చుకో..’- ఇదీ మా తండ్రి నాకు చిన్నప్పుడు నేర్పించిన పాఠం. దాన్ని నేను తు.చ తప్పకుండా పాటించాను. దేశంలోని అత్యధిక సంపన్నుల జాబితా 50 మందిలో నా పేరు ఉండడానికి నేను చదువుకునే రోజుల్లో నా తండ్రి నేర్పించిన ఈ పాఠం నాకు ఉపయోగపడింది అంటారు- రాఖేష్ ఝుంఝున్ వాలా.

విమాన ప్రయాణంలో పదనిసలు

రైలు, బస్సుకన్నా విమాన ప్రయాణంలో సుఖం ఉందనుకుంటాం. ముఖ్యంగా పిల్లలతో ప్రయాణించేప్పుడు. కాని కొందరి అనుభవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. కాలిఫోర్నియాకి చెందిన జోన్ ఆమె భర్త రాబర్ట్‌లు నెవార్క్ నించి బేకర్స్ ఫీల్డ్‌కి విమానంలో తమ 16 ఏళ్ల కొడుకు బెడెతో ప్రయాణమయ్యారు. విమానంలో ఫస్ట్‌క్లాస్ టిక్కెట్లని కొన్నారు. ఎందుకంటే బెడెకి ఆ అనుభవం ఎలా ఉంటుందో రుచి చూపించాలని. బెడెకి డౌన్స్ సిండ్రోమ్ ఉంది.

కవలల గ్రామం..!

ఆ గ్రామానికి సరైన రహదారి గానీ, పాఠశాల, ఆస్పత్రి వంటి ప్రాథమిక సౌకర్యాలు గానీ లేవు.. అభివృద్ధికి దూరంగా విసిరేసినట్లు ఉన్నప్పటికీ ఆ పల్లె జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందింది.. సుమారు ఆరువేల జనాభా నివసిస్తున్న ఆ ప్రాంతం కవల పిల్లలకు పుట్టినిల్లుగా వాసికెక్కింది. గత అయిదు దశాబ్దాల కాలంలో ఆ గ్రామంలో సుమారు వందమంది కవల పిల్లలు జన్మించారు.

షాపింగ్ మాల్‌లో ఈతకొలను!

వస్తువులు కొనడానికే కాదు, సరదాలు తీర్చుకునే సదవకాశాన్ని కల్పించడంతో ఆ షాపింగ్‌మాల్‌కు జనం వేలం వెర్రిగా ‘క్యూ’ కడుతున్నారు. కెనడాలో అతి పెద్ద షాపింగ్ మాల్‌గా ప్రఖ్యాతి పొందిన ‘వెస్ట్ ఎడ్మంటన్ మాల్’ సుమారు 800 దుకాణాలతో విస్తరించింది. షాపింగ్‌కు వచ్చే వారికోసం ఈ మాల్‌లో విశాలమైన ఈతకొలను, స్కేటింగ్ రింక్, వాటర్ పార్క్, కృత్రిమ అడవి, సినిమా థియేటర్లు వంటివి ఏర్పాటు చేశారు.

ముముక్షుపీఠం.. గోమాత సేవలో పునీతం

హిందువుల ఆరాధ్య దైవం, సర్వదేవతల సమాహారం- గోవు. గోమాతకు గరికపోచ పెట్టినా పుణ్యమే. ఒకటీ రెండూ కాదు, అయదారు వందల గోవులను అనునిత్యం ప్రేమపూర్వకంగా సాకడమంటే నిజంగా ఒక అరుదైన యజ్ఞమే. అదీ మడులు, మాన్యాలు లేశమాత్రం లేకుండా కేవలం సేవాభావమే పెట్టుబడిగా ఓ మహోన్నత వ్యక్తి ఎలాంటి లాభాపేక్ష లేకుండా గోమాత సంరక్షణకు పూనుకోవడం అందరికీ స్ఫూర్తి దాయకం.

మతిమరుపు రాయుళ్లు

మనిషికి మతిమరుపు సహజం. ఇంట్లో కళ్లజోడు, తాళం చెవులు సాధారణంగా వెతుక్కునే ప్రధాన వస్తువులు. వీటి తర్వాతి స్థానాలు సెల్‌ఫోన్, పెన్‌లవి.
ప్రతీ వస్తువుని ఇంట్లో ఎప్పుడూ ఒకేచోట ఉంచే అలవాటు లేకపోవడమే వెదుక్కోడానికి అసలు సమస్య.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading