ఆదివారం

నవ్వుల లోకం

పుట్టినట్టు గుర్తు ఏడుపు
కానీ బతికి బట్టకట్టినట్టు

గుర్తు నవ్వు

బోసినవ్వులు చిందించే

పిల్లల్ని చూసినప్పుడే

తల్లిదండ్రులకు ఆనందం.

వాళ్లు ఆనందంగా పెరిగి

పెద్దవుతూంటేనే తాము

గొప్పగా పెంచామని

గర్వం. అంటే

ఏమిటన్నమాట

నవ్వులు పెంచడం,

నవ్వులు పంచడం ఈజ్

ఈక్వల్టూయే గర్వించదగ్గ

బతుకు.

అమ్మో భూకంపం!

మళ్లీ ఒక్కసారిగా ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఒక పక్క కాళ్ల కింద భూమి కంపిస్తూంటే మరోపక్క సునామీ విరుచుకు పడవచ్చునేమోననే వదంతులతో తీర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రకృతి ప్రకోపిస్తే అంతే మరి! ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒక ప్రకృతి విపత్తు సంభవించిందనే వార్త లేకుండా ఒక్క వారం కూడా ఉండదనే విషయం మనకు తెలుసు.

మన మెట్రో

మెట్రోరైలు. ట్రాఫిక్ సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, సిటీ బస్సులతో సమయానికి చేరుకోలేక, ఎంఎంటీఎస్ రైళ్లు సరిపోక, సతమతమవుతున్న హైదరాబాద్ వాసులను ఊరిస్తున్న రైలు. నగరం, జనాభా, ట్రాఫిక్ అన్నీ అంతకంతకూ పెరిగిపోతూ, ప్రయాణం అంటే భయపెడుతున్న తరుణంలో చేపడుతున్న సిటీరైల్ ప్రాజెక్టు. పలు వివాదాలు, భయాందోళనల నడుమ ప్రాథమిక దశ దాటి నిర్మాణ దశకు చేరుకుందీ ప్రాజెక్టు.

ఏ తీరాలకీ చట్టాలు!

భారతీయ వివాహ వ్యవస్థ కాలాన్ని తట్టుకుని నిలిచిన ఓ అద్భుతం. పెళ్లి రెండు కుటుంబాలు, రెండు జీవితాలు, రెండు భావాలు, రెండు మనసుల కలయిక.. ఇలాంటి వివాహ వ్యవస్థ ఇటీవల కొన్ని దశాబ్దాలుగా ఆటుపోట్లకు గురవుతోంది. ఒకరిని ఒకరు చూసుకోకుండా, పెద్దలు కుదిర్చిన పెళ్లికి తలలొగ్గిన కాలంలో కాకుండా, విద్య, అవగాహన, సంపాదన పెరిగి, ఒకటికి పదిసార్లు ఆలోచించి వివాహాలు జరుపుతున్న కాలంలో ఈ సమస్య అధికం కావడం గమనార్హం.

జంగిల్ యోగా

‘కాదేదీ కవిత కనర్హం’ అన్నట్టు ఆధునిక కాలంలో ‘కాదేదీ వ్యాపారాని కనర్హమ్!’ అంటున్నారు. దేన్నైనా సరే! అమ్మగలమా? సొమ్ము చేసుకోగలమా? - ఇదీ ప్రపంచవ్యాప్త ధోరణి. ఆధునిక పరిజ్ఞానం రోజురోజుకీ కొత్త సౌకర్యాలను తెచ్చి పెడుతూనే, వాటి తోడుగా కొంగ్రొత్త సమస్యలనీ తోడుగా ఇస్తున్నది - కంప్యూటర్లు, మొబైళ్లు.

అధికార యా(సూ)త్ర

ఈ తరానికి నప్పని ఓ సామెత వుంది. మగవాడు తిరక్క చెడ్డాడు.. మహిళ తిరిగి చెడింది అని. దానే్న ఆ తరువాత ఎవరికి వారు తమ ప్రజ్ఞాపాటవాలతో రకరకాలుగా మార్చేసారు కూడా. జర్నలిస్టులైతే, రిపోర్టరు తిరక్క చెడ్డాడు..సబ్బెడిటరు తిరిగి చెడ్డాడు అని మార్చుకున్నట్లు. ఇప్పుడు ఇదే సామెత రాజకీయాలకు కూడా రూపాంతరం చెందుతోంది. లీడర్ తిరిగి అధికారంలోకి వచ్చాడు.. ఎమ్మెల్యే తిరక్క అధికారం కోల్పోయాడు అన్న రీతిగా.

శ్రీ సీతారామ కల్యాణ వైభోగమే!

చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి. ఆ రోజు దేశమంతా సీతారామ కల్యాణం చేసుకుంటుంది. ఏ ప్రాంతంలో ఆచారాలను బట్టి ఆ ప్రాంతంలో వేడుకలుంటాయి. కొన్ని దేశాలలో దీనిని ఒక ప్రణయగాథగా భావించి పండుగ చేసుకుంటారు. మరికొన్ని దేశాలలో దీనిని ఒక వీరగాథగా భావిస్తారు. యూరోప్, అమెరికాలలో భారతీయ పద్ధతులలో వేడుకలుంటాయి. ఎవరు ఎన్ని వేడుకలు చేసినా తెలుగునాట సీతారామ కల్యాణం వైభవమే వైభవం. ఆ సందడే సందడి.

నేల విడిచి ఆటలు

కంప్యూటర్స్, వీడియో కన్‌సోల్స్ లేని కాలంలో ఆ రకమైన గేమ్స్ నవలలకీ, జానపద కథలకీ, సినిమాలకీ మాత్రమే పరిమితమై ఉండేవి. నేడో! గగుర్పాటు కలిగించే రీతిలో కంప్యూటర్ గేమ్స్ ఉన్నాయి. గతంలో పెద్దగా ఆసక్తి కల్గించని ఆటల స్థానంలో నేడు త్రీడీ గేమ్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల వ్యాపారంగా ‘గేమ్స్’ కొనసాగుతున్నాయి. భారతదేశంలో సైతం ఈ గేమ్స్‌కి క్రేజ్ ఉంది.

కొత్త పండుగ

వర్షవర్షానికీ తను సంతరించుకునే కొంగ్రొత్తలు-
మన శుభ జీవన భవనపు ఆశల పునాదులు.
తన కదలికనీ, ఆ కదలిక మనపై ముద్రించే
అనుభవ చిత్రాలనీ తిలకించి స్పందిస్తూంటాం.
అకృత్రిమ సౌందర్యరాశి,
ఋతుక్రమాన ఆసాదిత వ్వన కన్యక - ఉగాది.
ఇక నందన ఉగాది.
ఉగాది -
వన జీవితమంతా ఆధారపడి వున్న కాలానికి సంబంధించింది.
మృత్యు శిశిరాలు వెళ్లిపోతూ, జనన వసంతాలు వస్తూంటాయి.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading