మల్లాది మిరియాలు -- అనుమానం లేని హత్య
ఆ గురువారం కోర్నిలియస్ రోజూకన్నా ముందే న్యూయార్క్‌లోని తన ఆఫీస్ నించి బయటికి వచ్చాడు. న్యూయార్క్ శివార్లలో ఉన్న తన ఇంటికి వెళ్లడానికి రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాడు. ఏడు స్టాపుల తర్వాత లోకల్ ట్రైన్ దిగి, స్టేషన్ బయట పార్క్ చేసిన తన కారెక్కి పావుగంట దూరంలోని తన ఇంటికి బయలుదేరాడు. ఓ మైలు దూరం వెళ్లాక గేట్లు కాని, గేట్ కీపర్ కాని లేని ఓ రైల్వే లైన్ రోడ్డుని క్రాస్ చేస్తూ వెళ్తోంది.















