సాధన

ఆశయ సౌధానికి పునాది.. ‘ఆర్కిటెక్చర్’

నేడు దేశంలోని నిర్మాణరంగంలో అనూహ్యమైన మార్పులొచ్చాయి. పట్టణీకరణ ప్రభావంతో బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు అందుబాటులోకి వచ్చాయి. అపార్టుమెంట్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, ఐటి పార్కులు, సూపర్ మార్కెట్లు, టౌన్‌షిప్‌ల నిర్మాణం జోరందుకున్నందున ఈ రంగంలో అభివృద్ధి గణనీయంగా పెరిగింది. గత ఐదేళ్లతో పోల్చి చూస్తే ఈ రంగంలో ఏటా 20 శాతం చొప్పున అభివృద్ధి జరుగుతున్నదని ఓ అధ్యయనం ద్వారా తెలుస్తోంది.

సాంకేతిక ప్రజ్ఞకు సముచిత స్థానం

మన దేశాన్ని పరిరక్షిస్తున్న ముఖ్యమైన మూడు రక్షణ విభాగాలలో వైమానిక దళం పాత్ర అమోఘమైనది. ఆఫీసర్ స్థాయినుంచి కిందిస్థాయి వరకు ఉన్న ఉద్యోగాలు వేటికవే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఓ విశిష్టమైన గుర్తింపుని, ప్రత్యేకమైన గౌరవాన్ని ఆపాదించిపెట్టే భారత వైమానిక దళంలో చేరడానికి ఏటా వివిధ కేటగిరీల కింద లక్షలాదిమంది అభ్యర్థులు పోటీపడుతుంటారు.

సృజనే తఫనైతే ‘క్లిక్’ అవుతారు..

పోటోగ్రఫీ... జీవితంలో గడిచిపోయిన మధుర స్మృతులను తిరిగి కళ్ల ముందుంచడానికి ఉపయోగపడే మాధ్యమం. వర్తమాన సంఘటనలను, మధుర స్మృతులను కళ్లకు కట్టినట్టు చూపించగలిగే అపురూప మాధ్యమం. మాటలకందని భావాలను, కళ్ల ముందుంచే అద్భుత మాధ్యమం. మన దైనందిన జీవితంలో భాగమైపోయిన ఫోటోగ్రఫీని మనం ఓ నిత్యావసరంగా భావిస్తున్నాం.

ఉద్యోగార్థులకు ఉత్తేజం-‘ఔషధం’

నేడు ప్రాథమిక ఆరోగ్యం పరిరక్షణ గురించి ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలు ప్రజలకు మంచి ఆరోగ్యాన్నివ్వడానికి తమవంతు కృషి చేస్తున్నాయి. తత్ఫలితంగా వచ్చిన వ్యాధులకు మందుల తయారీనుంచి రాబోయే వ్యాధులను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై విస్తృతమైన అధ్యయనాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే బీఫార్మసీ.

సేవకు చిహ్నం ... ఉపాధి పుష్కలం

నర్సింగ్ ఓ అరుదైన వృత్తి. సహనం, సేవాభావం ఉన్నవారు ఈ రంగాన్ని తమ కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ఎంతమంది స్పెషలిస్టులు వైద్య సేవలందించినా, నర్సుల సేవలు లేనిదే అవి సత్ఫలితాలను ఇవ్వవు. నిరంతరాయంగా పనిచేస్తూ రోగికి కావాల్సిన అన్నీ సమకూర్చి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంలో నర్సుల పాత్ర అమోఘం. వైద్య రంగంలో వైద్యులు దైవ సమానులైతే, నర్సులను తల్లి సమానులుగా మనం భావించవచ్చు.

‘పుట్‌వేర్’తో ఉపాధి వైపు అడుగులు..

నేడు ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌వేర్ ప్రొడక్షన్ (పాదరక్షల ఉత్పత్తుల)కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రోజురోజుకీ కొత్త పోకడలు, విదేశీ సంస్కృతి నేపథ్యంలో వినియోగదారుల అభిరుచులలో అనూహ్య మార్పులొచ్చాయి. ఈ నేపథ్యంలో చెప్పుల దగ్గరనుంచి వేసుకునే దుస్తుల వరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ జనం కొత్త పోకడలకు పోతున్నారు.

దీక్షా దక్షతలుంటే ఉపాధి యోగం

భారతీయ సంస్కృతిలో ‘యోగా’ ఒక భాగంగా ఇమిడిపోయింది. ‘యోగా’కు ఆదిగురువైన పతంజలి కాలంనుంచి ఆచరణలో ఉన్న పద్ధతులను ఎందరో యోగులు, సిద్ధులు, మునులు అభివృద్ధి పరిచి మనకు అందించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసర మైన వ్యాయామాన్ని అందించే యోగాభ్యాసాన్ని మించిన వైద్యం లేదని నేడు అంతా అంగీకరిస్తున్నారు. ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌కు నేడు లక్షల్లో శిష్యులు పెరిగారంటే దానికి కారణం ‘యోగా’.

సృజనకు ఆహ్వానం- ‘ఫ్యాషన్ డిజైనింగ్’

ఫ్యాషన్ డిజైనింగ్‌లో అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించే ప్రఖ్యాత సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (‘నిఫ్ట్’). కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 15 కేంద్రాలతో నడుస్తున్న ఈ సంస్థ ఏడు బ్యాచిలర్ కోర్సులు, మూడు మాస్టర్ డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. నేడు ఫ్యాషన్ డిజైనింగ్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది.

కలతల్లో కాంతిరేఖలు-‘కౌన్సెలర్లు’

నేడు జీవితం బిజీ బిజీ అయిపోయింది. రోజంతా చిరాకు. దీనివల్ల ఒత్తిడి తీవ్రమై మనిషి జీవిత కాలాన్ని తగ్గించేస్తుంది. అంతేకాదు లేనిపోని సమస్యలు పుట్టి, మనిషి మానసికంగా కుంగిపోయి, మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. ఇక భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే వారి పరిస్థితి వర్ణనాతీతం. ఆదరాబాదరాగా ఆఫీసుకెళ్లి, ట్రాఫిక్‌లోను, ఆఫీసులోనూ అలసిపోయి, ఆనక ఇంటికొచ్చిన తర్వాత అలాగే మంచంమీద కూలబడే భార్యాభర్తలెందరో.

సంపాదనకు, సమర్థతకు ఒకే వేదిక

ఒకప్పుడు ఏదైనా వస్తువుకి గానీ, ఉత్పత్తికిగానీ ప్రచారం చేయాలంటే దండోరా వేయించేవారు. కొంచెం అభివృద్ధి చెందాక వాల్‌పోస్టర్లు, అడ్వర్‌టైజ్‌మెంట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, నేడు కార్పొరేట్ సంస్కృతి తన పరిధిని పెంచుకోవడంతో బర్త్‌డే పార్టీనుంచి మ్యారేజి పార్టీ వరకు అదిరిపోయే విధంగా చేసి, ప్రచారం సంపాదించుకునేవారికి స్ఫురించే పదం ‘ఈవెంట్ మేనేజ్‌మెంట్’.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading