సాధన

టిఎంసిలో కోర్సులు

టాటా మెమోరియల్ సెంటర్ హాస్పటల్ అడ్వాన్స్‌డ్ డిప్లమో ఇన్ మెడికల్ ఇమేజ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: ఫిజిక్స్‌తో బిఎస్‌సి/మెడికల్ లేబరేటరీ టెక్నాలజీలో డిప్లమో/బిఫార్మసీ/డిఫార్మసీ/డిఎంఎల్‌టి ఉండాలి. వయసు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 మే 30. ఇతర వివరాలకు హెచ్‌టిటిపి://టిఎంసి డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.

డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఈడి, బిఈడి, బిఈడి (స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తులను యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ నుండి గానీ లేదా రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్లనుండి కానీ లేదా ప్రోగ్రామ్ సెంటర్లనుండి గానీ పొందవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 మే 31. ప్రవేశ పరీక్ష 2012 జూన్ 24న జరుగుతుంది.

నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్), హైదరాబాద్ పీజీ మెడికల్ (డిఎం/ఎంసిహెచ్) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. డిఎం విభాగంలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, క్లినికల్ ఫార్మకాలజీ, మెడికల్ అంకాలజీ, ఎంసిహెచ్ విభాగంలో రుమటాలజీ, యూరాలజీ, కార్డియో థైరాసిస్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ కోర్సులున్నాయి.

లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ

లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు మాస్టర్ ఆఫ్ బిజినెస్ లా (ఎంబిల్), పీజీ డిప్లమో కోర్సులైన హ్యూమన్ రైట్స్ లా, మెడికల్ లా అండ్ ఎథిక్స్, ఎన్విరాన్‌మెంటల్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లా, చైల్డ్ రైట్స్ లా, కన్జ్యూమర్ లా అండ్ ప్రాక్టీస్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. దరఖాస్తులను ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా పంపాలి.

జెఎన్‌టియుహెచ్‌లో ఎంఎస్‌ఐటి కోర్సు

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఎస్‌ఐటి) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: బిఈ/బిటెక్/కంప్యూటర్ సైన్స్/మ్యాథమేటిక్స్/స్టాటిస్టిక్స్‌లో పీజీ/ఎంసిఏ ఉండాలి. దరఖాస్తులను వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 మే 14.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎ/ఎంఎస్‌సి(సైనె్సస్/సోషల్ సైనె్సస్/హ్యుమానిటీస్) కోర్సులు, ఎంటెక్ (ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో కంప్యూటర్ సైన్స్, ఐటి, కంప్యుటేషనల్ టెక్నిక్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, మినరల్ ఎక్స్‌ప్లొరేషన్స్), ఎంఫిల్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్/పిహెచ్‌డి, ఎంఎస్‌సి/పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

నిక్మర్‌లో కోర్సులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కనస్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ (నిక్మర్) పీజీ ప్రోగ్రామ్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, పీజీ ప్రోగ్రామ్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్, పీజీ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్‌డ్ కనస్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 50 శాతం మార్కులతో బిఈ/బిటెక్ ఉండాలి.

ఐఐఎంసిలో కోర్సులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లమో కోర్స్ ఇన్ జర్నలిజం (ఇంగ్లీష్/హిందీ/ఒరియా), పీజీ డిప్లమో ఇన్ రేడియో అండ్ టెలివిజిన్ జర్నలిజం, పీజీ డిప్లమో ఇన్ అడ్వర్టయిజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పిఈసెట్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బిపిఎడ్, యూజిడిపిఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పిఈసెట్)-2012కు దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: బిపిఎడ్‌కు ఏదైనా డిగ్రీ పాసై ఉండి వయస్సు 19 సంవత్సరాలు నిండాలి.

సౌత్ ఏషియన్ యూనివర్సిటీ

సౌత్ ఏషియన్ యూనివర్సిటీ

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading