సాధన

గ్రాండ్ విజన్ డైరెక్షన్

అంతరిక్షం నుండి భూమండలం ఎట్లా కనిపిస్తుందో తెలిసిన తర్వాతే తాను చేయవల్సిందేమిటో , ఏ దిశగా ప్రయాణం మొదలుపెట్టాలో బోధపడింది ‘రీస్టే’కి. అట్లా బోధపడిన మిషన్‌ని ఒక నిర్దుష్టమైన దిశకు మళ్లించాలి. అదే రిస్టే చేసిన పని. ఖాళీగా కూర్చుని కలలు కనే వ్యక్తికి, ఒక మిషన్‌లో ఇన్‌వాల్వ్ అయిన వ్యక్తికీ తేడా అదే.

గ్రాండ్ విజన్

మీ విలువలను గుర్తించండి

గ్రాండ్ విజన్

ఒక గ్రామంలో ఒక దిగుడు బావి ఉంది. ఆ బావిలో ఒక కప్ప చాలా కాలంనుండి నివశిస్తూ ఉంది. ఒకరోజున ఆ గ్రామంలో భారీ వర్షం కురిసింది. వీధులన్నీ జలమయం అయ్యాయి. జల ప్రవాహానికి ఎక్కడినుంచో ఒక కప్ప కొట్టుకు వచ్చి దిగుడుబావిలో పడిపోయింది. వర్షం వెలిసింది. కప్పలు రెండూ పిచ్చాపాటీ మొదలుపెట్టాయి. కొట్టుకు వచ్చిన కప్ప తాను వుండి వచ్చిన ప్రపంచం గురించి ‘బావిలో కప్ప’కి వివరించడం మొదలుపెట్టింది.

పద్ధతిగా చదివితే ఫారెస్ట్ సర్వీస్ సాధ్యమే

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అత్యున్నత ఉద్యోగ పరీక్షలలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) ఒకటి. అటవీ శాఖలో ఉన్నతోద్యోగానికి బాటలు వేసే ఈ పరీక్షను జాతీయ స్థాయిలో యుపిఎస్‌సి నిర్వహిస్తుంది. జాతీయ స్థాయి పరీక్ష కావడంవల్ల ఏటా వేలల్లో ఈ పరీక్షకు అభ్యర్థులు పోటీపడుతుంటారు.

స్విష్ టెక్నిక్

ఈ టెక్నిక్‌ని ఎన్‌ఎల్‌పి వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్యాండ్లర్ కనుగొన్నాడు. ‘స్విష్’ అంటే తుడిచిపెట్టుకుని పోవడం. మీ మైండ్‌లో ఉన్న అవాంఛనీయమైన చిత్రాలు హఠాత్తుగా మాయమైపోవడానికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను మీరు అనేక విషయాలకు ఉపయోగించుకోవచ్చు. మీలో ఉన్న ఫోబియాలను పోగొట్టుకోవడం దగ్గరనుంచి స్టేజి ఫియర్, ఇంటర్వ్యూ ఫియర్ వంటి లక్షణాలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్

మన మనసులో జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తమై పోయి ఉన్న ఒక దృశ్యం లేదా ఒక చిన్న శబ్దం ఒక అద్భుతమైన రిసోర్స్‌గా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు ‘రిసోర్సు’ అనేపదాన్ని బాగా అర్ధం చేసుకోవాలి. రిసోర్సెస్ అంటే ఏమిటి? వనరులు అని అర్ధం. మన ప్రయోజనాలకు ఉపయోగపడేది అని అర్ధం. మన మనుగడ సాధించడానికి ఉత్పాదక శక్తిని అందివ్వగల ముడిపదార్ధం.

పాజిటివ్ దృక్పథం

నిర్దుష్టమైన మన ఆలోచనలు, చర్యలు, అనుభూతులు, నిరంతరం నిర్దుష్టమైన ఫలితాలనే అందిస్తాయి. ఈ ఫలితాలవల్ల మనకు ఆనందం కలగవచ్చు లేదా విచారం కలగవచ్చు. ప్రయోజనం ఏర్పడవచ్చు, లేదా ఎదురు చూడని విధంగా నష్టాలే ఏర్పడవచ్చు. అది వేరే సంగతి. నిర్దుష్టమైన గిరి గీసుకున్న ఆలోచనలవల్ల, పరిమితమైన లేదా నిర్దుష్టమైన ఫలితాలే ఏర్పడతాయన్నది మనం ఇక్కడ గమనించాల్సిన శాస్ర్తియమైన సత్యం.

కండిషనింగ్ ప్రక్రియ

మనం ఒక భావనను వదులుకున్నామంటే మన మైండ్ వెంటనే అప్రయత్నంగా ఆ భావన మనకు అందిస్తూ వచ్చిన సుఖ సంతోషాలకోసం అనే్వషిస్తుంది. అది దొరక్కపోతే, మారడానికి అంగీకరించదు. పాత అలవాటునే కొనసాగించమని బలవంతపెడుతుంది. ఈ కారణం చేతనే ఒక వినూత్న ప్రత్యామ్నాయం ఉండాలి. పాత ప్రక్రియ (సిగరెట్ కాల్చడం, గోళ్లు కొరకడం, ఉక్రోషం చెందడం, తల బిరుసుగా ప్రవర్తించడం వగైరాలు) అందించిన సుఖ సంతోషాలనే కలిగించే ప్రత్యామ్నాయం ఉండాలి.

ప్రత్యామ్నాయం తప్పదు

ఎన్‌ఎల్‌పి స్టెప్ నెం.4
ప్రత్యామ్నాయాన్ని సృష్టించండి

మార్పుకు స్వాగతం

ఒక రివాజును అనుసరిస్తూ పోవడం మన చర్యలకు మాత్రమే పరిమితమైనవి కావు. మన మనోభావాలు, అనుభూతులు, ఆలోచనలు సైతం ఒక రివాజును అనుసరిస్తాయి. ఏళ్ల తరబడి మనం చేర్చిపెట్టుకున్న వైఖరులు, నమ్మకాలు, స్వాభావిక లక్షణాలు అన్నీ కలగలిపి ఒక తరహాకు చెందిన విధానాన్ని మాత్రమే ప్రమాణికంగా తీసుకుని దానినే ఒక రహదారి కింద ఉపయోగిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading