వెన్నెల

'నా బంగారుతల్లే' ఆదర్శం!

వినోదాన్ని పంచేది సినిమా. అందుకే ఒకే తరహా సినిమాలకు పరిమితమైపోకుండా రకరకాల వైవిధ్యమైన కథలతో చిత్రాల్ని నిర్మించాల్సిన అవసరం ఇప్పుడెంతైనా వుంది. ఇక రాబోయే చిత్రాల్లో మూస విధానాల్ని మట్టుపెట్టాలి. మాస్, హారర్ లాంటివే కాకుండా మానవీయ విలువల్ని పెంచే చిత్ర నిర్మాణాలకు తెరతీయాలి. హీరో, హీరోయిన్.. దొంగలముఠా విలన్‌ను చంపేయడం, ‘శుభం’ కార్డు పడటం- ఇవన్నీ పాత పద్ధతులు. ఇంక హీరోయిజం..

భక్త జయదేవ్ -- ఫ్లాష్‌బ్యాక్ @ 50

సంస్కృతంలో ‘గీత గోవిందం’ గేయ మంజరిని రచించిన వాగ్గేయకారుడు శ్రీ జయదేవుడు. 16వ శతాబ్దంలో ఒరియా ప్రాంతానికి చెందినవాడు. జయదేవుని గీతాలు అష్టపదులుగా సుప్రసిద్ధం.
ఆ సాహిత్యకారుని గాథను శ్రీ లలితాకళానికేతన్ బ్యానర్‌పై సముద్రాలవారి రచనతో ‘్భక్తజయదేవ్’ చిత్రంగా 1961లో నిర్మించారు.

తూచ్..అలాకాదు! -- ‘టాలీ’ టాక్

హీరోయిన్ల నోటినుండి ఏ మాటలు వచ్చినా వాటికి మంచి విలువ వస్తుందని దాదాపు కథానాయికలందరూ గ్రహించేశారు. అందుకే ఏమాటైనా ఆచి తూచి మాట్లాడుతున్నారు. ఐనా కానీ ఒక్కొక్కసారి ఇబ్బందులెదురవుతున్నాయి. అలాంటి సంఘటనే అనుష్కకు ఎదురైంది. తాజాగా ఇటీవల కోలీవుడ్‌లో ఓ ఇంటర్వ్యూలో తనకు నచ్చిన నటులు ఎవరు? అని ప్రశ్నిస్తే, గతంలో ఓ కథానాయికకు ఎదురైన పరాభవం గుర్తొచ్చింది అనుష్కకు.

ట్రేడ్‌టాక్

ప్రస్తుతం వస్తున్న మూస చిత్రాల బారిన పడిన ప్రేక్షకులు మళ్లీ అటువంటి చిత్రాలను చూడడానికి ఇష్టపడటంలేదు. ఏ చిత్రం చూసినా ఒకే కథ. అమ్మాయి అబ్బాయి ప్రేమ, మధ్యలో ట్విస్టులు, చివరికి ముగింపు. చెత్త సంగీతం. జీర్ణించుకోలేని కథనాలతో ప్రేక్షకులు సినిమా అంటేనే బెంబేలెత్తుతున్నారు. ఈ వారం కూడా అటువంటి చిత్రాలే తెలుగు తెరపై ప్రత్యక్షమయ్యాయి.

తెలంగాణా సినిమా సంఘాలతో సరిపోతుందా?

‘‘దేశాలు స్వాతంత్య్రంకోసం పోరాటం చేస్తాయి,
జాతులు స్వేచ్ఛకోసం తిరుగుబాటు చేస్తాయి

ప్యార్ మే పడిపోయానె...

ప్రేమకి వయసేమిటి? పదేళ్ల వయసులోనూ ప్రేమించొచ్చు - అబ్బ! ఛ! ఈ థియరీ ఎవరిదంటారా? ఇంకెవరు? అతి పిన్న వయసులోనే తెరంగేట్రం చేసి.. తనదైన స్టైల్‌లో యూత్‌ని రెచ్చగొట్టి- నటనతో.. హాట్‌హాట్ వ్యాఖ్యలతో ఆకట్టుకొనే అలియాభట్. పదకొండేళ్ల వయసులోనే సీనియర్ నటుడు - షాహిద్ కపూర్ ప్రేమలో పడిందట. ముంబైలోని జెయిటీ గెలాక్సీలో ‘ఇష్క్‌విష్క్’ చిత్రం చూసింత్తర్వాత అలియాకి నిద్ర పట్టలేదట.

విభిన్న తరహాలో... -ముంబై టాక్

అభిమానులను అలరించటం కోసం- సినీ ప్రముఖులు సైతం - ట్విట్టర్‌నే ఆశ్రయిస్తున్నా రనటానికి ఇదొక తాజా ఉదాహరణ. అంతర్యుద్ధాలు జరిగినా... మాటల తూటాలు పేలినా- అవాకులు చెవాకులకు వేదిక ట్విట్టర్ అన్నది నిర్వివాదాంశం. ఆఖరికి అమితాబ్ బచ్చన్ కూడా ట్విట్టర్‌లో వ్యాఖ్యలు మొదలుపెట్టాడు. ‘షమితాబ్’లో అమితాబ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అతడి గెటప్‌పై అప్పుడే ఎన్నో అంచనాలు... ఎలా ఉండబోతున్నాడు? ఎలా అలరిస్తాడు?

గ్యారంటీ లేని కుర్చీలాట!

పరిశ్రమలో ఎవరూ టాప్‌స్టార్ అన్నదానికి సరైన అవగాహన ఎవరికీ లేదు. ఇక్కడ నెంబర్‌వన్ స్థానం ఓ మ్యూజికల్ ఛైర్ లాంటిది. ఈరోజు నేను కూర్చుంటే మరో రోజు మరొకరు కూర్చుంటారు. అలా స్థిరత్వం లేని దానిగురించి ఆలోచించడం, మాట్లాడడం శుద్ధ దండుగ అంటోంది బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనె. సినిమా పరిశ్రమలో ఈ రోజు స్టార్ అనిపించుకున్నవాళ్లు రేపు అదే పేరుతో పిలిపించుకుంటారన్న గ్యారంటీ లేదు.

కథ విషయంలో ‘రభసే’ -- సంతోష్ శ్రీనివాస్

అగ్ర కథానాయకుడు చిత్రం రూపొందిస్తున్నప్పుడు కథ విషయంలో ఎటువంటి మరో ఆలోచన ఉండకూడదు. పూర్తి నమ్మకం కుదిరాకే నేను కథను సినిమాగా రూపొందించడానికి ప్రయత్నిస్తా. ఈ విషయంలో నిర్మాతతో ఎప్పుడూ గొడవకు దిగుతూనే ఉంటాను. కథ అందరికీ నచ్చేలా వచ్చి సినిమా విజయాన్ని అందుకోవాలన్న తపనతో ఎప్పటికప్పుడు ఇదే తొలి సినిమా అని కష్టపడతాను అని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెలిపారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading