యువ

ప్రేమ.. ఓ సవాల్!

ప్రేమ విఫలమై విలపించే వారు.. సఫలమై సతమతమయ్యేవారు.. ప్రేమ కోసం ప్రాణాలను త్యజించే వారు.. ప్రాణాలను తీయడానికి తెగించేవారు. ఇలా ఎందరో ప్రేమ చట్రంలో కనిపిస్తే, వారిలో ఎక్కువ శాతం యువతే ఉంటుంది. ప్రేమకోసం చావడంలోను, చంపడంలోనూ ప్రేమే ఉంటుందనేది ప్రేమికుల వాదన... ప్రేమలో స్నేహం ఉంటుందంటారు కొందరు. ప్రేమలో ఆకర్షణ ఉంటుందంటారు ఇంకొందరు. ప్రేమలో వ్యామోహం ఉంటుందని మరికొందరు చెబుతారు.

కాస్త.. ఆలోచిద్దాం!

.............................................

ఎందుకంత తొందర..?

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్..
80వ దశకంలో కుర్రకారును ఊపు ఊపేసిన పాట అది. ఆ కాలంలో యువతకు పెద్ద టార్గెట్ -ఉద్యోగం సంపాదించడం. ఆ పాట నేటి యువతకు సిల్లీగా అనిపించొచ్చు.
కాలం మారింది. కుర్రకారు కోరికలు మారాయి. సంస్కరణలు దేశంలో ఊహించని పెను మార్పులు సంభవిస్తున్నాయి. కానీ -చిత్రంగా లావవుతున్న కోర్కెల చిట్టా, అందుకు అనుగుణంగా సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.

మనం.. మనలా ఉందాం!

సంప్రదాయానికి దూరంగా ఉండటమే ఫ్యాషనని, ట్రెడిషినల్ వేషధారణ ‘ట్రాష్’ అనడమే స్టయిలని, నాజూకు అందాలు సజీవత్వాన్ని కోలోయేలా రసాయినాలు పూయడమే అందమని నిన్నటి వరకూ యవత భ్రమించింది. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడుతోంది. -‘్ఫ్యషననేది ఒక భావజాలం. అది వికాసవంతంగా ఉండాలేగానీ, వికారంగా మాత్రం కాదు. అతికాని, కాలానుగుణమైన సంప్రదాయమే ఎప్పటికీ ఫ్యాషన్’ అంటోంది యువత. ఆహ్వానించదగ్గ ‘్ఫ్యషన్’ ఇది!

=====

మీరే కెరీర్ శిల్పులు!

కెరీర్‌ను మలచుకోవటం అంటే -బండరాయిని శిల్పంగా తీర్చిదిద్దడానికి శిల్పి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో అన్ని జాగ్రత్తలు తీసుకోవటమే అంటుంటారు -మోడ్రన్ కెరీర్ కౌన్సిలర్లు. అంటే -బండరాయిలాంటి జీవితాన్ని అందమైన శిల్పంగా మార్చుకునే విద్యను ఔపోసన పట్టాలన్న మాట. అదే -జీవితంలో రాణించటం. అందుకేంచేయాలి? అనువైన మార్గాల్ని అనే్వషించి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి.

సరదాగా కాసేపు..

అర్థం పెద్దగా తెలీకపోయినా, అనుభవం ద్వారా యువత జీవితాల్లో నిత్యకృత్యమైపోయిన మాట -ఒత్తిడి. దాన్ని అధిగమించకపోతే మానసిక, శారీరక రుగ్మతలు తప్పవంటున్న వైద్యుల హెచ్చరికలూ వాళ్లను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. కెరీర్ పరంగా చూస్తే -స్ట్రెస్‌ని అధిగమించడానికి కావాల్సిన సమయం కూడా దొరకని పరిస్థితి. చదువు, కెరీర్ బిల్డప్, ఉద్యోగ నిర్వహణ..

నిన్నలేని అందమేదో..

జయ చలాకీగానే వుంటుంది. కాని ఒక్కోప్పుడు ఆమె మేకప్ ఆమెను పీలగా.. నీరసంగా ప్రమోట్ చేస్తుంది. వైష్ణవ్ ఫస్ట్ లుక్‌లో -ఈ అమ్మాయేంటి ఇలా వుంది అనుకున్నాడు. రెండ్రోజుల తర్వాత ఆమెనే తదేకంగా చూస్తూ వుండిపోయాడు. ఏంటి.. జయేనా? అంటూ మనసును పదే పదే ప్రశ్నించుకున్నాడు. నిజమే! జయ ఆ రోజు మరింతగా మెరిసిపోయింది.
-కారణం మేకప్.
=============

రేడియో... రీయెంట్రీ...

టీవీ ముందు కూర్చుంటే నీకు ప్రపంచమే కనిపించదు...
ఏంటీ? రోజంతా ఇంటర్‌నెట్ ముందేనా?...
ఈ ప్రశ్నలు చాలామంది యువత ఇంట్లోనో, బయటో రోజూ వినేవే. ఇకపై ఈ మాటలు తగ్గిపోవచ్చు. నిజమా? అని విస్తుపోకండి. ఆ స్థానాన్ని మారిన రేడియో ఆక్రమిస్తోంది. పాత రేడియోకు కొత్త రోజులు వస్తున్నాయంటే నమ్మాలి. వచ్చేశాయ్ కూడా.

‘కలర్‌ఫుల్’...

పూచిన పూలలో వర్ణాలను తిలకించినపుడు మనసు పులకరిస్తుంది. నిర్మల ఆకాశంలో హరివిల్లును చూసినపుడు అనుభూతులు కలగకమానవు. జీవితాలకు రంగులకు ఎంతో అవినాభావ సంబంధం వుంది. జీవితం రంగులమయం కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. రంగుల ప్రపంచాన్ని ఊహించుకుని దానిలో ఎగసిపడి జీవించాలని యువత కోరుకుంటుంది. జీవితం ‘కలర్‌ఫుల్’గా వుంటే మరింత జోష్‌తో దూసుకుపోతారు.

ప్రేమతో...

పదిమందీ నన్ను గుర్తించాలి... ఎలా?
వాళ్లను నేను ఆకర్షించాలి... సాధ్యమేనా?
చుట్టూవున్న వాళ్లతో కలిసిపోవాలి... అందుకు చిట్కాలేంటి?
వాళ్ల హృదయాలు కొల్లగొట్టేలా మాట్లాడగలగాలి.. చాతనవుతుందా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు మీదగ్గరుంటే -దూసుకుపోవడమే తరువాయి. లేదంటే వీటన్నింటికీ ఒక్కటే పరిష్కార మార్గం అనుకోవాలి. అదే -ప్లీజింగ్ పర్సనాలిటీ.
అంటే..?
కాస్త స్నేహంగా...

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading