యువ

ఆ డేట్స్ చెప్పరూ!

ఆంధ్రభూమి అనుబంధం ‘యువ’ ద్వారా పాఠకులకు ఐటి లోకాన్ని చూపిస్తున్న రమణగారికి ధన్యవాదాలు. వారంవారం ఆయన ఆర్టికల్స్ చదువుతుంటాను. టెక్నాలజీకి సంబంధించి ఈ-మెయిల్ ద్వారా అడుగుతున్న సందేహాలను సైతం రమణగారు ఓపిగ్గా నివృత్తి చేయడం సంతోషించదగ్గ విషయం. సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, ధోరణులు, అందుబాటులోకి వస్తున్న అంశాలను ఆంధ్రభూమి ఫ్లాట్‌ఫారంగా అందిస్తుండటం పట్ల ఆయనకు ధన్యవాదాలు.

ముఖ‘చిత్రం’ సూపర్బ్

ట్రెండీ అ‘డ్రెస్’ కవర్‌స్టోరీతో వచ్చిన యువ ఆకట్టుకుంది. చిరాకు మనుషులతో మసలాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ‘వికాసం’ పేజీలో రచయిత విజయగోపాల్ అద్భుతంగా చెప్పారు. ‘కొత్తకొత్తగా’ పేజీలో మొబైల్స్ వివరాలు ఆకట్టుకున్నాయి. కానీ, గాడ్జెట్స్ పేరు పెట్టి మొబైల్స్ వివరాలు మాత్రమే ఎక్కువగా అందించటం బాగలేదు. మార్కెట్‌కు కొత్తగా వస్తున్న అనేక గాడ్జెట్స్ వివరాలు అందిస్తే బావుంటుందేమో..

వికాసం బావుంది

‘అనుభవసారం’తో విజయగోపాల్ గారు అందించిన ‘వికాసం’ అద్భుతంగా ఉంది. జీవితానికి ప్రేరణనిచ్చే అంశాన్ని చిన్న పిల్లలకు కథ చెప్పినంత ముచ్చటగా రాయడం భలే ఆనందం వేసింది. జపాన్ సమురాయ్ యోధుడు ముసాఫీ అని, తన రచనల్లో జీవితానికి పనికొచ్చే ఎన్నో అంశాలను చెప్పాడంటూ మొదలైన వ్యాసం ఆసాంతం ఆసక్తికరంగా సాగింది.

యువ అదుర్స్

యువ అనుబంధంలో కొత్త ఫీచర్లు ప్రారంభించిన కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఓపక్క మల్లాది హాస్యం, మరోపక్క విజయగోపాల్ ‘వికాసం’, ఇంకోపక్క వాసిలి ‘విజయం’.. కథనాలకు కొత్త అందాలు తెచ్చే చిత్ర విచిత్రాల బొమ్మలు, హంగుల్లో రంగుల్లో డిజైన్లు. వావ్ యువ సూపర్. కానీ, కుర్రకారు ఇష్టపడే ఇంకా కొన్ని కోణాలు ఉన్నాయ్.. వాటినీ టచ్ చేయొచ్చుగా.

మినీ మేగ్....

మినీ మేగ్....

వికాసం

హమ్మయ్య, మళ్లీ మాకు ఇష్టమైన పేజీని అందుబాటులోకి తెచ్చినందుకు ధన్యవాదాలు. ‘వికాసం’ కథనాలు ఆసక్తికరంగానూ, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. కొన్నాళ్లు వాటిని ఆపేశారు. తిరిగి మళ్లీ ప్రారంభించినందుకు ధన్యవాదాలు. ఈవారం కవర్ కథనం అద్దిరిపోయింది. కుర్రాళ్లకు మ్యూజిక్ మత్తునిచ్చే కుర్రాడు రెహమాన్. అందుకే అతని గురించి ఏం చెప్పినా, ఏం రాసినా బావుంటుంది.

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading