యువ

అదే.. మన పనితనం

మనం ఒక ఉద్యోగం కొరకు అభ్యర్థన పంపాలంటే, మనకున్న ఆ కోరిక ఒకటి చెపితే చాలదు. మన గురించి, చదువు గురించి, ఇంతకుముందు చేసిన ఉద్యోగాల గురించి వివరాలు కూడా పంపాలి. ఈ సంగతులనంతా ఒక క్రమంలో రాసి పంపాలి. బయోడేటా, కరికులమ్ విటే, రెజూమె లాంటివి ఇందుకు పద్ధతులు. ఈ మధ్యన రెజుమె (ఈ మాటను సరిగా పలకడం చాలామందికిచేతకాదు. తెలుగులో దాన్ని రాసి చూపించడం అంతకన్నా వీలు కాదు) పద్ధతిని అందరూ ఆదరిస్తున్నారు.

రెండవ అవకాశం

అనగనగా ఒక రైతు. ఆయన పొలం అడవికి పక్కనే ఉంది. కష్టపడి పనిచేస్తాడుగానీ, ఏదో ఒకనాడు అదృష్టం వచ్చి తన ముందు కుప్పగా పడుతుందని అతనికి ఒక నమ్మకం. అతను మామూలుగానే తోటలో తన పని తాను చేసుకుంటున్నాడు. అంతలో బాగా బలిసిన కుందేలు ఒకటి వేగంగా పరిగెత్తుతూ వచ్చింది. మరీ వేగంగా వచ్చిందేమో, అక్కడ ఒక చెట్టుకు తగిలింది. చటుక్కున దాని మెడ విరిగింది. కుందేలు పాపం చచ్చిపడింది.

అదే కథ!

బ్యాంకు మేనేజర్‌గారు తీర ప్రాంతంలో తిరుగుతున్నారు. జాలరి బుట్టలో తాజా చేపలతో ఎదురయ్యాడు. ‘చేపలు బాగున్నాయి. ఎంత సేపట్లో పట్టావూ?’ అడిగాడు మేనేజరు.
‘ఎంతో సేపెక్కడండీ? ఇందాకేగా వెళ్లిందీ?’ ప్రశ్నించాడు జాలరి.
‘మరి కాసేపుండి మరిన్ని చేపలు పట్టుకపోయావా?’ మేనేజరన్నాడు.
‘ఇవాళ్టికివి చాలన్నాడు’ జాలరి.
‘ఇంటికి పోయి, ఊరికే ఉంటావాయిక?’ ప్రశ్న.

చేతులు కలిసిన చప్పట్లు

జీతం బాగానే ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఇంక్రిమెంట్ మాత్రం లేదన్నారు. అందరికీ ఇవ్వగూడదని ఒక పాలసీ! అందుకని ఇవ్వలేదు! అని చెప్పారు కూడా. అయినా అతను అక్కడే సంతోషంగా పని చేస్తున్నాడు. అతనికి అక్కడ ఆనందంగా ఉందని మాత్రం కాదు. ఆనందం కొంత ఉంది. కొంత లేదు. ఉద్యోగం వదిలితే మరోచోట దొరుకుతుంది. ఎక్కువ జీతం వచ్చే వీలు కూడా ఉంది. కానీ, ఎక్కడో ఏదో మెలిక ఉంది. ఏది బాగుంది. మేనేజర్లు తప్ప మిగతా వారంతా బాగుంటారు.

ముందుచూపు

అనుకోకుండా గాడిద, ఒంటె దారిలో ఎదురుపడ్డాయి. గాడిద గౌరవంగా ఒంటెను పలుకరించింది. ఒంటె అంతే అభిమానంగా సమాధానమిచ్చింది. అప్పుడు గాడిద, ఒంటెను ఒక ప్రశ్న అడిగింది. ‘అవునన్నా! ఇద్దరమూ నాలుగు కాళ్లు గలిగి ఉన్నాము. నేనేమో మాటిమాటికి తట్టుకపడుతుంటాను. నీవెప్పుడూ అట్లా పడడం చూడలేదు. కాళ్లు పొడుగున్నందుకా? ఏమిటి సంగతి?’ అని.

ఇవాళ ఏం చేయాలి?

పక్క పక్క ఇళ్ళలో ఉండే గృహిణులు ‘పని తెమిలిందా?’ అంటూ ఒకరినొకరు పలకరించుకుంటారు. వాళ్లకు నిజానికి ఒక పట్టాన పని తెమలదు. ఒకటి ముగియకముందే మరొకటి కనబడుతుంది. ఒకే సమయంలో రెండు మూడు పనులను చేస్తూ, చక్కని ప్లాన్ ప్రకారం వారు ముందుకు సాగుతుంటారు. ‘దాని కోసం ప్రత్యేకంగా చోటు కల్పిస్తే తప్ప ఏ పనీ జరగదు’ అంటాడు జిమ్ మెక్‌కే! అంటే, ప్రతి పని కొరకు ప్రత్యేకంగా, మనమే కొంత సమయాన్ని కేటాయించాలని అర్థం.

ఆలోచించగలరా?

అతను ఇంట్లోకి వచ్చాడు. ఎవరికీ అభ్యంతరం లేదు. చెప్పులను మాత్రం దారిలో అడ్డంగా వదలి వచ్చాడు. వాటిని కొంచెం పక్కకు వదిలితే మరింత గౌరవంగా ఉంటుందని ఆలోచన అతనికి రాలేదు. ఆ ఆలోచన మనకూ రాకపోవచ్చు. జీవితంలో ఆలోచన ఎంతో అవసరం. అది లేకుండానే చాలామంది బతుకు గడుపుతుంటారు. ఆలోచన మారితే, ఆచరణ మారుతుంది. అసలు ఆలోచన ఉంటే, ఏదైనా మారవలసిన అవసరం ఉంటే, తెలుస్తుంది. చాలా విషయాలు మారితే బాగుంటుందని మనకు తోచనే తోచదు.

ఆలోచన -మార్గాలు

వినడం: కొందరికి ఇతరుల నుంచి వినడం ద్వారా ఆలోచనలు వస్తాయి. స్వంత ఆలోచన ఆ తర్వాతే.
చదవడం: కొందరికి వింటున్న ఆలోచనలతో పోటీగా స్వంత ఆలోచనలు వస్తాయి. ఆ తరువాత తిరిగి ఆలోచించడానికి, చదవగలిగిన సమాచారం ఉంటే మేలంటారు ఈ రకం వారు.
రాయడం: ప్రతి విషయం గురించి నోట్స్ రాయడం, తర్వాత ఆలోచించడం కొందరి పద్ధతి.

నిజాయితీ

ఒకానొక తూర్పు దేశంలో ఒకానొక రాజుగారు. రాజుగారికి పిల్లలు లేరు. అంతమాత్రాన రాజుగారు ముసలి కాకుండా ఉండరుగదా? రాజ్యానికి, తన తరువాత అధిపతి ఎవరని ఆలోచన మొదలయింది. ఆయనకు మంచితనం, నిజాయితీల మనిషి కావాలి. అందుకే ఆయన ఒక ప్రకటన చేయించారు. చదువు, ఆరోగ్యం, దారుఢ్యం గల యువకులంతా ప్రకటన విని ఒకనాడు రాజుగారి కోటకు చేరుకున్నారు. రాజుగారు వారందరికీ తలొక పొట్లం అందించారు!

మాట తీరు.. మనిషి తీరు

మాటగానీ, రాతగానీ, అందరికీ అర్థమయేలా ఉంటే బాగుంటుందని. కానీ, తెలియకుండానే ఆడంబరం చేస్తారు కొందరు. సూటిగా, సింపుల్‌గా, తక్కువ మాటలతో, బలంగా, సులభంగా అర్థమయేలా మాట్లాడితే ఉపన్యాసం, రాస్తే ఆ రచనా, అందరికీ నచ్చుతాయి. మాటల వాడకంలో కొన్ని సూత్రాలు పాటించడానికి ప్రయత్నం చేద్దాం!
-అందంగా వినిపించే అర్థం కాని మాటకన్నా, తెలిసిన మాట మేలు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading