యువ

స్ఫూర్తి...

గల్ఫ్‌కోస్ట్‌లోని డీప్ వాటర్ హోరైజన్ అనే చోట, ఓడలోంచి చమురు కారి సముద్రంలోని జలచరాలు మరణించిన ఫొటోలని, న్యూయార్క్‌లో ఐదవ తరగతి చదివే ఒలీవియా బీలర్ (10) చూసింది. పక్షులంటే ఇష్టపడే ఆ పాప పక్షుల బొమ్మలని గీసి, వాటిని ఆడ్‌బోన్ సొసైటీకి ఇచ్చింది. వన్యమృగాలని సంరక్షించే ఆ సంస్థకి తన వాటర్ కలర్ బొమ్మలను అమ్మగా వచ్చిన డబ్బును జంతువులను రక్షించడానికి ఉపయోగించమని కోరింది.

ఓన్లీ ఇన్ ఇండియా

ఆంధ్రప్రదేశ్‌లోని నల్గొండలో 21 ఏళ్ళ వ్యక్తి అమెరికా ఫ్రెసిడెంట్ బరాక్ ఒబామా పేరు మీద ఓ సెల్‌ఫోన్ తీసుకున్నాడు. యం.ప్రసాద్ అనే అతను ప్రైవేట్ టెలికమ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఫోన్ కనెక్షన్ ఇచ్చే ముందు ధృవపత్రాలను సరిగ్గా వెరిఫై చేయడం లేదని రుజువు చేయడానికి బరాక్ ఒబామా ఫోటో అతికించి అతని పేరు మీద ఓ సెల్‌ఫోన్ కనెక్షన్ తీసుకున్నాడు.
=========

వింతలోకం

వర్ ఉల్ఫ్ సిండ్రోమ్ (వైద్యనామం హైపర్ ట్రైకోసిస్) అనే అరుదైన మెడికల్ కండిషన్ వంద కోట్లమందిలో ఒక్కరికే వస్తుంది.

హాలీవుడ్ కబుర్లు

1940లో వాల్ట్ డిస్నీ తీసిన మూడో కార్టూన్ సినిమా ఫాంటేషియాలో మంత్రగత్తె పేరు యన్‌సిడ్ . ఈ పాత్రకి ఈ పేరుని దాని రచయిత పెట్టాడు. ఐతే డిస్నీ పేరునే వెనకనుంచి ముందుకు రాసి ఈ పేరుని అతను సృష్టించాడు. చిత్ర నిర్మాణంలో డిస్నీ మంత్రగాడు లాంటివాడు కాబట్టి ఫేంటాషియాలోని మంత్రగత్తెకి అతని పేరు పెట్టడం సబబని భావించి ఆ రచయిత ఆ పేరు పెట్టాడు.

దురదృష్టపు దొంగ

న్యూయార్క్ సిటీ పోలీస్‌లో పనిచేసే హోవార్డ్ ఫెలిక్స్ డ్రగ్ డీలర్స్‌ని పట్టుకోడానికి వెళ్లినపుడు వారి మధ్య తుపాకీ కాల్పులు జరిగాయి. హోవార్డ్‌కి చాలా గుళ్ళు తగిలాయి. అతన్ని లింకన్ హాస్పిటల్‌లోని ఎమర్జన్సీ గదికి తరలించారు. తనకి ఎనస్తీషియా ఇవ్వబోయేముందు, ప్రమాద స్థితిలో అక్కడికి తీసుకువచ్చిన మరో వ్యక్తిని ఫెలిక్స్ చూశాడు.

స్ఫూర్తి... అదీ ఆలోచన

మేరీలేండ్‌కి చెందిన సోఫియా నెల్సన్ తన కారుని తన ఊరికి కొత్తగా వచ్చిన రిచర్డ్ స్టీఫెన్‌కి అమ్మింది. ఆమె కొత్త కారు చేతికి రావడానికి రెండు వారాలు ఆలస్యం అవుతుందని తెలిసిన స్టీఫెన్, ఆ కారుని అప్పటికే తను కొన్నదాన్ని తిరిగి కొత్తకారు వచ్చేదాకా వాడుకోమని ఇచ్చేసాడు. పదిహేడు రోజుల తర్వాత ఆమె కొత్తకారు డెలివరీ తీసుకున్నాక పాత కారుని అతను తీసుకున్నాడు.

హాలీవుడ్ కబుర్లు

నటి ఏంజెలినా జోలీ హాబీ కత్తులని సేకరించడం. ఆమె దగ్గర వందలకొద్దీ కత్తులు ఉన్నాయి. ఆమె తన పనె్నండో ఏట నించి వాటిని సేకరిస్తోంది. ఆమె కొడుకు మేడెక్స్‌కి కూడా ఇదే హాబీ ఉంది. వారిద్దరూ -ఏపిల్ తొక్కని కత్తిఉపయోగించి తొక్క మధ్యలో తెగకుండా మొత్తం తొక్కని తీయగలరు. అన్ని రకాల వెరైటీ కత్తులు వారింట ప్రదర్శనశాలలో చూడచ్చు.
==============
లింగు: బిల్ గేట్స్ తన ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తాడు?

డైవర్స్

పెళ్లిళ్లు స్వర్గంలో. విడాకులు భూమీద. అయితే ఎవరూ తాము విడాకులు తీసుకోవాల్సి వస్తుందని పెళ్లి సమయంలో అనుకోరు. కొన్ని వింత కారణాల వల్ల కొందరు దంపతులు విడాకులు తీసుకుంటుంటారు.
======

స్ఫూర్తి...

జర్మనీలో లోయర్ సాక్జన్‌లో బ్రెమన్ అనే ఊళ్ళో ఓ దొంగ ఓ రోజు తుపాకీతో ఓ ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాడు. ఆ ఇంటివాళ్ళు తమ ఇద్దరు పిల్లల్ని ఇంట్లోనే వదిలి వెళ్ళారని అతనికి తెలీదు. అది ఖాళీ ఇల్లనుకుని లోపలికి వెళ్ళాడు. ఆ పిల్లల బేబీ సిట్టర్‌కి అతను తుపాకీ గురి పెట్టాడు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading