S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/25/2018 - 00:42

జకార్తా, ఆగస్టు 24: సంప్రదాయక క్రీడ కబడ్డీలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న భారత్‌కు ఆసియా గేమ్స్‌లో బలమైన ఎదురు దెబ్బ తగిలింది. సెమీ ఫైనల్స్‌లో పురుషుల, మహిళల జట్లు రెండూ ఇరాన్ చేతిలో ఖంగుతిని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాయి. శుక్రవారం చారిత్రక అపజయాల పరాభవంతో ఆసియా గేమ్స్‌నుంచి భారత కబడ్డీ నిష్క్రమించక తప్పలేదు.

08/25/2018 - 00:15

18వ ఆసియా గేమ్స్‌లో భారత్ పసిడి వేటను భారంగానే సాగిస్తోంది. ఒలింపిక్ హెవీవెయిట్ చైనా 66 స్వర్ణాలను కైవసం చేసుకుంటే, భారత్ ఆరో రోజు రెండు స్వర్ణాలు సాధించి ఆరు రోజుల్లో ఆరు పసిడి పతకాలకు పరిమితమైంది. శుక్రవారం భారత సైన్యం తరఫున రోయింగ్ రేస్‌లోకి దిగిన జట్టు అత్యద్భుత ప్రదర్శనతో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది.

08/24/2018 - 04:49

న్యూఢిల్లీ: విలువిద్య భారత చరిత్రలో అంతర్భాగమని అందరికీ తెలుసు. పురాణాల్లో, ఇతిహాసాల్లో ఈ విద్యకు సముచిత స్థానం ఉంది. కానీ, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు మాత్రం ఆర్చరీపై ఏ మాత్రం నమ్మకం లేదు. అందుకే ఆర్చర్లలో ఎవరికీ ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్)లో చోటు కల్పించలేదు. అన్ని క్రీడలను సమ దృష్టితో చూసి, అందరినీ ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే కొన్ని క్రీడలకు మాత్రమే పరిమితం కావడం దురదృష్టకరం.

08/24/2018 - 00:19

పాలెంబంగ్, ఆగస్టు 23: ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో రజతం చేరింది. గురువారం జరిగిన షూటింగ్ విభాగం డబుల్స్ ట్రాప్‌లో మన దేశానికి చెందిన 15 ఏళ్ల యువ సంచలనం శార్దూల్ విహాన్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ టీనేజర్ విహాన్ డబుల్స్ ట్రాప్‌లో మొత్తం 73 షాట్‌లతో ఈ పతకాన్ని అందుకున్నాడు.

08/24/2018 - 00:17

పాలెంబంగ్, ఆగస్టు 23: భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో చైనా క్రీడాకారిణి జాంగ్ షూయ్‌తో పోటీ పడిన అంకిత 4-6, 6-7 (6)తో ఓటమితో కాంస్యతో సరిపెట్టుకుంది. 25 ఏళ్ల అంకిత రైనా ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్ టెన్నిస్‌లో పతకం అందుకున్న రెండో భారత క్రీడాకారిణిగా ఘనత దక్కించుకుంది.

08/24/2018 - 00:15

న్యూఢిల్లీ, ఆగస్టు 23: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రీడాకారిణి, పేసర్ జూలన్ గోస్వామి అంతర్జాతీయ టీ-20లకు గుడ్‌బై చెప్పింది. ఈ విషయాన్ని ఆమె గురువారం ఇక్కడ వెల్లడించింది. అయితే, ఈ ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే ఐసీసీ వరల్డ్ టీ-20 మ్యాచ్‌లో మాత్రం ఆడుతుంది. ఇప్పటివరకు 68 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన 35 ఏళ్ల గోస్వామి 56 వికెట్లు పడగొట్టింది.

08/25/2018 - 00:55

నాటింగ్‌హామ్: టీమిండియా టెస్టు క్రికెట్‌లో చేస్తున్న ప్రయోగాలు, మార్పులు ఆశ్చర్యకరంగా ఉన్నాయని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఇటీవల కాలంలో భారత జట్టు 38 టెస్టుల్లో 38 మార్పులు చేసిందని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుర్తుచేశాడు. 3మరీ ఇన్ని మార్పులా?2 అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

08/24/2018 - 00:13

దుబాయ్, ఆగస్టు 23: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మునుపటి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో అద్భుత ఆటతీరును ప్రదర్శించడంతో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. నాటింగ్‌హామ్‌లో జరిగిన మూడో టెస్టులో కోహ్లీ వరుసగా 97, 103 పరుగులు సాధించడంతో భారత్ 203 ఆధిక్యంతో ఆతిధ్య జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసింది.

08/23/2018 - 01:43

పాలెంబాగ్/ జకార్తా: ఆసియా క్రీడా వేదికలపై భారత షూటర్లు చెలరేగిపోతున్నారు. ఏకాగ్రతతో పసిడి పతకాలకే గురి పెడుతున్నారు. 25మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రహి సర్నోబాట్ సాధించిన పసిడితో షూటింగ్‌లోనే ఇప్పటికి భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య రెండుకు చేరింది. ఆసియా వేదికపై షూటింగ్‌లో స్వర్ణమందుకున్న తొలి భారత మహిళగా కొల్హాపూర్‌కు చెందిన డిప్యూటీ కలెక్టర్ రహి రికార్డుకెక్కింది.

08/23/2018 - 01:33

నాటింగ్‌హామ్, ఆగస్టు 22: మూడో టెస్ట్ ఆరంభం నుంచీ ఊరిస్తోన్న విజయం ఎట్టకేలకు ఐదో రోజు టీమిండియా వశమైంది. ఇంగ్లాండ్‌లో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో విరాట్ సేన భారీ గెలుపు నమోదు చేసింది. ‘మాపై నమ్మకముంచండి’ అంటూ టెస్ట్ ఆరంభంలో చేసిన ప్రతిజ్ఞను కోహ్లీ నిలబెట్టుకున్నాడు. ఇంగ్లీష్ జట్టును 203 పరుగుల ఆధిక్యంతో చిత్తుచేసి 1-2తో సిరీస్‌పై మళ్లీ ఆశలు రేకెత్తించాడు.

Pages