S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/13/2018 - 04:04

మాస్కో, జూన్ 12: రష్యాలో ఈనెల 14వ తేదీ నుంచి వచ్చేనెల 15వ తేదీవరకు అత్యంత ప్రతిష్ఠాత్మంగా నిర్వహించనున్న ఫిఫా వరల్డ్ కప్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో టెర్రిరిస్టు తరహా దాడులు, దౌర్జన్యాలు వంటి హింసాత్మక చర్యలను అడ్డుకునేందుకు ప్రభుత్వం గట్టి చర్యలను తీసుకుంటోంది.

06/13/2018 - 04:03

సోచి, జూన్ 12: బ్రెజిల్ స్టార్, ప్రపంచ నెంబర్ వన్ ఫుట్‌బాల్ ఆటగాడు నేమార్‌ను తిలకించేందుకు వేలాదిమంది అభిమానులు గుమికూడారు. రష్యాలో ఈనెల 14 నుంచి జరుగనున్న వరల్డ్ సాకర్ కప్‌లో పాల్గొనేందుకు వచ్చిన బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు ఇక్కడి బ్లాక్ సీ రిసార్టులో సేదతీరుతోంది.

06/13/2018 - 04:02

మాడ్రిడ్, జూన్ 12: వచ్చే ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు రియల్ మాడ్రిడ్ కోచ్‌గా జులెన్ లోపెట్‌గ్యుయ్ నియామకం ఖరారైంది. ఇంతవరకు ఈ టీమ్‌కు కోచ్‌గా ఉన్న జినేదిన్ జిదానే తప్పుకోనున్నాడు. తమ జట్టు కోచ్‌గా లోపెట్‌గ్యుయ్ నియామకాన్ని స్పానిష్ ధృవీకరించింది. వచ్చే మూడు సీజన్‌లకుగాను తాను కోచ్‌గా తప్పుకుంటున్నానని, తన స్థానంలో జులెన్ కోచ్‌గా వ్యవహరిస్తాడని జిదానే గత నెల 31న ప్రకటించాడు.

06/13/2018 - 04:01

కోల్‌కతా, జూన్ 12: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ గొప్ప ఆటగాడని, అతనికే తాను తొలి ప్రాధాన్యత ఇస్తానని భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ అన్నాడు. అయితే, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్ ఈ నాలుగు జట్లు రష్యా వరల్డ్ కప్‌లో ఫేవరెట్లుగా నిలుస్తాయని పేర్కొన్న ఛెత్రీ అర్జెంటీనా మాత్రం ఆ కోవలోకి రాదని వ్యాఖ్యానించాడు. తన దృష్టిలో ఈ నాలుగు జట్లు గొప్పవని అన్నాడు.

06/13/2018 - 03:59

బెంగళూరులో మంగళవారం జరిగిన బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టీమిండియా జట్టు ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్, అతని భార్య దీపికా పల్లికల్, విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ, కే.ఎల్.రాహుల్ , *ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ జాన్ రిచర్డ్సన్ నుంచి బీసీసీఐ అవార్డు అందుకుంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

06/13/2018 - 03:55

న్యూఢిల్లీ, జూన్ 12: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవిలో జి.వివేక్ కొనసాగవద్దని హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు స్వాగతించారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ హెచ్‌సీఏలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సక్రమంగా నడుస్తుంటే హెచ్‌సీఏ మాత్రం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు.

06/13/2018 - 03:54

కోల్‌కతాలోని ఒక మిఠాయ దుకాణంలో స్వీట్లతో
ఫిఫా వరల్డ్ కప్‌ను పోలిన కప్‌ను తయారు చేస్తున్న దృశ్యం

06/13/2018 - 03:52

రియోడిజనెరియో, జూన్ 12: ఫుట్‌బాల్ అంటే ఎంతో అభిమానించే బ్రెజిల్‌వాసుల్లో ఆసక్తి సన్నగిల్లుతోందట. రష్యాలో ఈనెల 14 నుంచి వచ్చేనెల 15వ తేదీవరకు జరిగే క్రీడాసంబరంపై బ్రెజిల్‌లోని సగానికి పైగా జనాలకు ఇష్టం లేదని జరిగిన ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. ఫుట్‌బాల్ చరిత్రలో బ్రెజిల్‌కు ప్రపంచంలోనే ఘనమైన చరిత్ర ఉంది.

06/13/2018 - 03:52

న్యూఢిల్లీ, జూన్ 12: దేశంలోని అన్ని ప్రాంతీయ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేంద్రాల పనితీరుపై సమీక్షలతో పాటు క్రీడాకారులకు ఇస్తున్న ఆహార, వసతి వంటి ఇతర విషయాలకు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

06/13/2018 - 03:51

దాక, జూన్ 12: ఆసియాకప్ మహిళల టీ-20 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన బంగ్లాదేశ్ జట్టుకు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ నజరానా ప్రకటించింది. ఆరుసార్లు వరుస విజేతగా నిలిచిన భారత జట్టుతో కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు మూడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ చివరి బంతి వరకు గెలుపెవరిదో అన్నట్టు కొనసాగింది.

Pages