S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/17/2018 - 02:51

ముంబయి, మే 16: ఇక్కడి వాంఖడే స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించి నాకౌట్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఎనిమిది వికెట్లకు 186 పరుగులు చేయగా, లక్ష్య సాధనలో విఫలమైన పంజాబ్ ఐదు వికెట్లకు 183 పరుగులకు పరిమితమైంది. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 15 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు.

05/16/2018 - 04:32

కోల్‌కతా: ప్లే ఆఫ్ బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆతిధ్య జట్టు బౌలర్ కుల్దీప్ యాదవ్ ప్రత్యర్థి రాజస్థాన్ వెన్ను విరిచాడు. నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలుత టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్‌ను ఎంచుకుంది.

05/16/2018 - 03:48

ముంబయి, మే 15: వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్ ఇటు ముంబయి ఇండియన్స్, అటు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లకు ప్రతిష్టాత్మకం కానున్నాయి. మొత్తం ఐపీఎల్ జట్లలో ఆరో స్థానంలో ఉన్న ముంబయి ఇంతవరకు 12 మ్యాచ్‌లు ఆడగా, ఐదింట్లో విజయం సాధించింది. ఏడు మ్యాచ్‌లలో అపజయం పాలై పాయింట్ల పట్టికలో 10 పాయింట్లు సాధించింది.

05/16/2018 - 03:48

న్యూఢిల్లీ, మే 15: టీమిండియా బ్యాట్స్‌మెన్‌లను ఎ దుర్కోగల సత్తా తమ స్పిన్నర్లకు ఉందని అఫ్గనిస్తాన్ క్రికె ట్ కెప్టెన్ అస్గర్ స్టానిక్‌జాయ్ అన్నాడు. బెంగళూరు చి న్నస్వామి స్టేడియంలో జూన్ 14 నుంచి జరుగనున్న టెస్టు మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్‌మెన్‌లకు గట్టి పోటీ ఇ స్తామని, ఇందుకు తమ స్పిన్నర్లపై తనకు ఎంతో నమ్మ కం ఉందని ఆయన పేర్కొన్నాడు.

05/16/2018 - 03:47

దుబాయ్, మే 15: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్వతంత్ర చైర్మన్‌గా బీసీసీఐ మాజీ చైర్మన్ శశాంక్ మనోహర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మరోసారి మనోహర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ట్విట్టర్ ద్వారా ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ కౌన్సిల్ ఆమోదముద్ర వేయడంతో బోర్డు డైరెక్టర్లు అంద రూ ఆయన ఎన్నికను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి రానుందని ఐసీసీ ప్రకటించింది.

05/16/2018 - 03:45

న్యూఢిల్లీ, మే 15: ముంబయి వాంఖడే స్టేడియంలో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు ముందు ఈనెల 22న మహిళల టీ-20 ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. గత ఏడాది ప్రపంచ కప్‌లో సాధించిన అఖండ విజయం తర్వాత భారత మహిళా క్రికెట్‌కు జనాదరణ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీ-20 వంటి చాలెంజ్ మ్యాచ్‌ల నిర్వహణ ద్వారా చక్కని ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని బీసీసీఐ యోచిస్తోంది.

05/16/2018 - 03:44

న్యూఢిల్లీ, మే 15: ప్రపంచ క్రికెట్‌తోపాటు భవిష్యత్‌లో ఆడబోయే టెస్టులపై సుదీర్ఘంగా చర్చించేందుకు వీలుగా ఐసీసీ వర్కింగ్ గ్రూప్ ప్రతినిధులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీ) అధికారులతో గురువారం న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు.

05/16/2018 - 03:43

న్యూఢిల్లీ, మే 15: టోక్యో ఒలింపిక్ గేమ్స్ వరకు భారత అధికారిక క్రీడా దుస్తుల భాగస్వామిగా (స్పోర్ట్స్ అపారెల్ పార్టనర్) ‘లీ నింగ్’ వ్యవహరించనుంది. ఈ విషయాన్ని ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఇక్కడ మంగళవారం వెల్లడించాడు.

05/16/2018 - 03:42

చెన్నై, మే 15: ప్రో కబడ్డీ లీగ్ సీజన్-6 వేలం ఈనెల 30, 31 తేదీల్లో ముంబయి వేదికగా జరుగుతాయి. ఈ వేలంలో 422 మంది కబడ్డీ క్రీడాకారులు ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉంటారు. వీరిలో 58 మంది విదేశీ ఆటగాళ్లతో పాటు ఫ్యూచర్ కబడ్డీ హీరోస్ కార్యక్రమం ద్వారా ఎంపికైన 87 మంది భారత ఆటగాళ్లూ ఉన్నారు. ఇరాన్, బంగ్లాదేశ్, జపాన్, కెన్యా, కొరియా, మలేసియా, శ్రీలంక నుంచి విదేశీ క్రీడాకారులను వేలంలో పరిగణలోకి తీసుకోనున్నారు.

05/15/2018 - 01:09

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అతి తక్కువ స్కోరు నమోదైంది. సోమవారం ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పరుగులు పారించలేక చతికిలబడింది. కేవలం 88 పరుగులకే ఆలౌటై చాపచుట్టేసింది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది రెండో అతి తక్కువ స్కోరు. (ఏప్రిల్ 24 సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన ముంబయి ఇండియన్స్ 18.5 ఓవర్లలో 87 పరుగులు చేసింది.

Pages