S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/09/2018 - 00:35

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 8: దక్షిణ కొరియాతో తీవ్రమైన విభేదాలు ఉన్నప్పటికీ, వింటర్ ఒలింపిక్స్ కోసం ఉత్తర కొరియా పట్టువీడింది. అథ్లెట్లు మాత్రమేగాక, ఛీర్ లీడర్లను, కళాకారులను కూడా పయాంగ్‌చాంగ్‌కు పంపింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మొండి పట్టుకు, వివాదాస్పద ఏకపక్ష నిర్ణయాలకు పెట్టింది పేరు.

02/09/2018 - 00:35

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 8: వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడి, సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న రష్యా ఏం చేయాలో దిక్కుతోచక ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. డోప్ పరీక్షలో విఫలమై, వింటర్ ఒలింపిక్స్ నుంచి నిషేధానికి గురైన 28 మంది అథ్లెట్లకు క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చినా ఫలితం లేకపోయింది.

02/09/2018 - 00:34

ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు జరిగే పయాంగ్‌చాంగ్ జాతీయ స్టేడియానికి పైకప్పు లేదు. స్థానిక కాలమానం ప్రకారం ప్రారంభోత్సవ ఉత్సవాలు రాత్రి 8 గంటలకు మొదలవుతాయి. ఎముకలు కొరికే చలిలో, విపరీతమైన చలిగాలులను తట్టుకుంటూ వివిధ జట్ల కవాతును, సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించడం ప్రేక్షకులకు ఒక సవాలే.

02/09/2018 - 00:32

స్కీయింగ్ వంటి ఈవెంట్స్‌లో పోటీపడే అథ్లెట్లను కూడా వాతావరణం భయపెడుతున్నది. చలి పెరుగుతున్న కొద్దీ, మంచు గడ్డలు మరింత గట్టిపడతాయి. స్కీయింగ్, జంపింగ్స్ కోసం వాడే పరికరాలు ఎందుకూ పనికిరాకుండా పోతాయి. తమతో తెచ్చుకున్న స్కీలను చెత్తబుట్టలో పడేయడం తప్ప మరో మార్గం లేదని ఆస్ట్రియా అల్‌పైన్ స్కీయర్ మార్సెల్ హిచెర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

02/09/2018 - 00:30

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 8: గతంలో ఎన్నడూ అథ్లెట్లు ఎదుర్కోనంత చలిలో పయాంగ్‌చాంగ్ వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం నుంచి మొదలుపెడితే, వివిధ పోటీలు, ఆతర్వాత ముగింపు ఉత్సవం వరకూ ప్రతి అంశానికీ అడుగడుగునా చలి తీవ్రత సమస్యలను సృష్టించడం ఖాయం. అక్కడ నమోదవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత ప్రస్తుతం -25 డిగ్రీల సెల్సియస్. ఇది మరింత పెరిగి, -35 వరకూ చేరే అవకాశం లేకపోలేదు.

02/09/2018 - 00:28

ముంబయి, ఫిబ్రవరి 8: దక్షిణ కొరియాలోని పయాంగ్‌చాంగ్‌లో శుక్రవారం నుండి ప్రారంభం కానున్న వింటర్ ఒలింపిక్ గేమ్స్ ప్రసార హక్కులను జియో టీవీ దక్కించుకుంది. ఇప్పటికే జనాదరణ పొందిన టీవీ యాప్ జియో టీవీ మన దేశంలో ప్రసార హక్కులను సంపాదించింది. గేమ్స్‌ను ప్రసారం చేసేందుకు జియో టీవీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మిలియన్ల మంది తమ మొబైళ్లలో గేమ్స్‌లను తిలకించనున్నారు.

02/09/2018 - 00:28

గ్యాంగ్‌నియంగ్ (దక్షిణ కొరియా), ఫిబ్రవరి 8: పయాంగ్‌చాంగ్‌లో 18 రోజుల పాటు నిర్వహించే వింటర్ ఒలింపిక్ గేమ్స్‌లో భాగంగా దక్షిణ కొరియా జాంగ్ హై-జీ గురువారం తొలిసారిగా మిక్స్‌డ్ డబుల్స్‌లో కర్లింగ్ స్టోన్ పోటీతో ప్రారంభించింది. వాస్తవానికి అధికారికంగా శుక్రవారం ఈ గేమ్స్ ప్రారంభం కావల్సి ఉంది. కానీ గ్యాంగ్‌నియంగ్ కర్లింగ్ సెంటర్‌లో రౌండ్ రాబిన్ మ్యాచ్‌తో పోటీలను ప్రారంభించారు.

02/09/2018 - 00:27

సెయింట్ మార్టిజ్ (న్యూజిలాండ్), ఫిబ్రవరి 8: అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీలంక క్రికెట్ జట్టు ఫాస్ట్‌బౌలర్ లసిత్ మలింగ గుడ్‌బై చెప్పే దిశగా యోచిస్తున్నాడు. త్వరలో జరుగబోయే ఐపీఎల్ టోర్నీలలో భాగంగా ముంబయి ఇండియన్స్ జట్టు బౌలింగ్ కోచ్‌గా అతనిని నియమించారు. ఇంతవరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లలో మలింగ ముంబయి ఇండియన్స్ జట్టుతో ఆడాడు.

02/09/2018 - 00:27

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లు జరిగే సమయాలను మారుస్తూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తీసుకున్న నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతున్నది. టైమింగ్స్ మారిస్తే ఐపీఎల్‌నే బహిష్కరిస్తామని ఫ్రాంచైజీలు బీసీసీఐకి అల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం.

02/09/2018 - 00:26

అలొర్ సెటార్ (మలేసియా), ఫిబ్రవరి 8: ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్స్‌లో శుక్రవారం జపాన్‌ను ఢీకొన్న భారత్ 1-4 తేడాతో చిత్తయింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు తన ప్రత్యర్థి అకానే యమాగూచీని ఓడించినప్పటికీ ఫలితం లేకపోయింది. మిగతా మ్యాచ్‌లను కోల్పోయిన భారత్‌కు పరాభవం తప్పలేదు.

Pages