S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/13/2017 - 00:58

షార్జా, నవంబర్ 12: మహిళల టి-20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ విజయభేరి మోగించింది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అప్పటికే ఆధిక్యాన్ని సంపాదించిన న్యూజిలాండ్ మహిళల జట్టు మూడో టి-20లోనూ అదే దూకుడును కొనసాగించింది. సూజీ బేట్స్ 57 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 126 పరుగులు చేసింది.

11/13/2017 - 00:57

న్యూఢిల్లీ, నవంబర్ 12: ఒలింపిక్స్‌లో రెండు పర్యాయాలు పతకాలు సాధించిన సూపర్ రెజ్లర్ సుశీల్ కుమార్ మళ్లీ బరిలోకి దిగనున్నాడు. వివిధ కారణాల వల్ల మూడేళ్లపాటు పోటీలకు దూరమైన అతను జార్జియాలోని బిలిసిలో శిక్షణ పొందుతున్నాడు. ఈనెల 15 నుంచి మొదలయ్యే జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అతను ఇక్కడికి చేరుకున్నాడు.

11/13/2017 - 00:56

న్యూఢిల్లీ, నవంబర్ 12: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి త్వరలోనే ఒక మహిళా డైరెక్టర్ స్వతంత్ర హోదాలో రానుంది. ఈ పదవికి సమర్థురాలిని ఎంపిక చేసే ప్రక్రియను ఐసీసీ మొదలుపెట్టింది. ఈ పదవికి మహిళను ఏర్పాటు చేయాలని ఈ ఏడాది జూన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో తీర్మానించగా, అర్హతలపై పాలక మండలి ఇప్పుడు స్పష్టతనిచ్చింది.

11/13/2017 - 00:54

మిలాన్ (ఇటలీ)లో జరిగిన మొదటి నెక్ట్స్‌జెన్ ఏటీపీ ఫైనల్స్ టోర్నమెంట్ ట్రోఫీతో దక్షిణ కొరియా ఆటగాడు చుంగ్ హియాన్. తుది పోరులో అతను రష్యాకు చెందిన యువ ఆటగాడు ఆండ్రె రుబ్లెవ్‌ను 3-4, 4-3, 4-2, 4-2 తేడాతో ఓడించాడు

11/13/2017 - 00:49

అడెలైడ్, నవంబర్ 12: ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన పేసర్ జాక్ బాల్ స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ త్వరలోనే ఇంగ్లాండ్ జట్టులో చేరనున్నాడు. ససెక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జార్జి గార్టన్‌కు అవకాశం దక్కవచ్చని సమాచారం. ప్రాక్టీస్ మ్యాచ్‌లకు బాల్ అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈనెల 23 నుంచి బ్రిస్బేన్‌లో మొదలయ్యే మొదటి టెస్టుకు అతను అందుబాటులో ఉంటాడా? లేదా?

11/13/2017 - 00:48

ముంబయి, నవంబర్ 12: చాలాకాలంగా మోకాలి నొప్పి బాధిస్తున్నదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. ఒకటిరెండు వారాల విశ్రాంతి తీసుకున్న తర్వాత పరిస్థితిని సమీక్షించుకొని, శస్త్ర చికిత్స అవసరమా? కాదా? అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటానని ఇక్కడ జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ కార్యక్రమంలో పాల్గొన్న సానియా విలేఖరులతో మాట్లాడుతూ చెప్పింది.

11/13/2017 - 00:47

సావొ ఫౌలో (బ్రెజిల్), నవంబర్ 12: మెర్సిడిజ్ ఫార్ములా వన్ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. గుర్తుతెలియని వ్యక్తులు వారి తలకు గురిపెట్టి, దోపిడీకి తెగబడ్డారని ఆ జట్టు స్టార్ డ్రైవర్, ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ట్వీట్ చేశాడు. బ్రెజిల్ సర్క్యూట్ నుంచి హోటల్‌కు తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న మినీ బస్సును కొంత మంది వ్యక్తులు అడ్డగించారని హామిల్టన్ తెలిపాడు.

11/13/2017 - 00:45

బ్రసెల్స్, నవంబర్ 12: రష్యాలో వచ్చే ఏడాది జరిగే ఫిఫా ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు మొనాకో అర్హత సంపాదించడంతో, అభిమానులు జరుపుకున్న సంబరాలు హింసాత్మకంగా మారాయి. కీలక మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌ను 2-0 తేడాతో ఓడించిన మొనాకో 1998 తర్వాత మొదటిసారి వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయింది. బ్రసెల్స్‌లో మొనాకో జాతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నారు. వారంతా వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు.

11/12/2017 - 01:10

న్యూఢిల్లీ, నవంబర్ 11: వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్న కారణంగా చైనా ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి వైదొలగిన తాను హాంకాంగ్ ఓపెన్‌లో ఆడతానని భారత బాడ్మింటన్ స్టార్, ‘ఆంధ్రావాలా’ కిడాంబి శ్రీకాంత్ ప్రకటించాడు. శనివారం అతను పిటిఐతో మాట్లాడుతూ, కండరాలు బెణకడంతో విశ్రాంతి అత్యవసరమని వైద్యులు సూచించారని అన్నాడు. అందుకే, ఈనెల 14 నంచి 19 వరకు జరిగే చైనా ఓపెన్ సూపర్‌లో ఆడడం లేదని తెలిపాడు.

11/12/2017 - 01:08

లండన్, నవంబర్ 11: టెన్నిస్ పురుషుల విభాగంలో ఈ ఏటి మేటి క్రీడాకారుడు ఎవరన్నది ఆదివారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న ఏటీపీ వరల్డ్ టూర్ పైనల్స్ టోర్నమెంట్‌తో తేలిపోతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న ఆటగాళ్లు పోటీపడుతున్నప్పటికీ, అందరి దృష్టి ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్, రెండో ర్యాంక్‌లో ఉన్న రోజర్ ఫెదరర్‌పైనే కేంద్రీకృతమైంది.

Pages