S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/10/2017 - 00:48

గుర్‌గావ్, నవంబర్ 9: ఫిట్నెస్‌తోనే అంతర్జాతీయ వేదికలపై విజయాలు సాధించగలుగుతున్నానని భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ తెలిపింది. హో చి మిన్ (వియత్నాం)లో జరిగిన ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ 48 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించి, గురువారం ఇక్కడికి చేరుకున్న కోమ్‌కు అభిమానులు, అధికారులు ఘనంగా ఆహ్వానం పలికారు.

11/10/2017 - 00:47

కరాచీ, నవంబర్ 9: పాకిస్తాన్‌లో పర్యటించే విషయంలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు వెనుకంజ వేసినట్టు సమాచారం. వచ్చే ఏడాది మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్ ఆడేందుకు రావాల్సిందిగా విండీస్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆహ్వానించింది. అందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) తొలుత సానుకూలంగానే స్పందించింది.

11/10/2017 - 00:47

అడెలైడ్, నవంబర్ 9: క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఎలెవెన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో మీడియం పేసర్ జేక్ బాల్ గాయపడడం ఇంగ్లాండ్ జట్టుకు షాకిచ్చింది. సిఎ ఎలెవెన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాలుగో ఓవర్‌లో నాలుగు బంతులు వేసిన తర్వాత జేక్ బాల్ కిందపడడంతో అతని కాలి మడమకు గాయమైంది. దీనితో అతను ఓవర్‌ను పూర్తి చేయకుండానే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు.

11/10/2017 - 00:45

హైదరాబాద్, నవంబర్ 8: దేశంలో సిక్స్-ఎ-సైడ్ టోర్నీలకు మంచి భవిష్యత్తు ఉందని భారత స్టార్ ఫుట్‌బాలర్, హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్ (హెచ్‌ఎఫ్‌ఎల్) మెంటర్ బైచుంగ్ భుటియా అన్నాడు. ఈ టోర్నమెంట్ మూడో సీజన్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతుందని, గతంలో మాదిరిగానే దీనికి సానుకూల స్పందన లభిస్తుందన్న నమ్మకం తనకు ఉందని గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు.

11/10/2017 - 00:45

అడెలైడ్, నవంబర్ 9: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, హార్డ్ హిట్టర్ డేవిడ్ వార్నర్‌తోనే తమకు ఎక్కువ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. గురువారం అతను విలేఖరులతో మాట్లాడుతూ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వార్నర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాడు.

11/08/2017 - 23:34

హో చి మిన్ సిటీ (వియత్నాం), నవంబర్ 8: భారత సీనియర్ బాక్సర్ మేరీ కోమ్ ఇక్కడ జరుగుతున్న ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ 48 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించి, సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ టోర్నీలో ఎక్కువ పర్యాయాలు విజేతగా నిలిచిన బాక్సర్‌కా ఆమె పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది.

11/08/2017 - 23:28

నాగపూర్, నవంబర్ 8: జాతీయ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ టైటిళ్లు సాధించారు. ‘జెయింట్ కిల్లర్’గా పేరు తెచ్చుకున్న ప్రణయ్ టైటిల్ పోరులో ఆంధ్రా వీరుడు కిడాంబి శ్రీకాంత్‌ను 21-15, 16-21, 21-7 తేడాతో ఓడించాడు. మొదటి రెండు సెట్లు హోరాహోరీగా జరిగి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

11/08/2017 - 23:23

న్యూఢిల్లీ: ధోనీపై విమర్శలు గుప్పిస్తున్న వారు తనను ఎందుకు విమర్శించడం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలదీశాడు. ధోనీని అతనిని లక్ష్యంగా చేసుకొని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన చివరి, మూడో టి-20ని టీమిండియా ఎనిమిది పరుగుల తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

11/08/2017 - 23:22

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రపంచ మేటి వికెట్‌కీపర్-బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై మళ్లీ డిమాండ్ మొదలైంది. వనే్డల్లో కొనసాగింపుపై కొంతలో కొంత అర్థం ఉందని, అయితే, టి-20 ఫార్మాట్‌కు అతను ఎంతమాత్రం పనికిరాడని పలువురు మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

11/08/2017 - 23:21

కోల్‌కతా, నవంబర్ 8: భారత్‌తో టెస్టు, పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో సిరీస్‌లు ఆడనున్న దినేష్ చండీమల్ నాయకత్వంలోని శ్రీలంక క్రికెట్ జట్టు బుధవారం ఇక్కడికి చేరుకుంది. జట్టులోని 15 మంది సభ్యులు గురువారం నుంచి నెట్స్‌కు హాజరవుతారు. భారత్‌తో ఈ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తోపాటు మూడు వనే్డలు, మరో మూడు టి-20 మ్యాచ్‌ల సిరీస్‌లను కూడా ఆడుతుంది.

Pages