S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/08/2017 - 23:19

అడెలైడ్, నవంబర్ 8: ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో ఈనెల 23 నుంచి మొదలయ్యే యాషెస్ సిరీస్‌లో అతను కీలక భూమిక పోషిస్తాడని అభిమానులు ఆశించారు. అయితే, ప్రాక్టీస్ సమయంలో మోకాలికి తగిలిన గాయం కారణంగా అతను ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లేదని ఇంగ్లాండ్ జట్టు మేనేజ్‌మెంట్ తొలుత ప్రకటించింది.

11/08/2017 - 23:18

దుబాయ్, నవంబర్ 8: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా విడుదల చేసిన టి-20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతను మొత్తం 824 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆరోన్ ఫించ్, ఎవిన్ లూయిస్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తమతమ స్థానాలను మెరుగుపరచుకున్నారు.

11/08/2017 - 02:54

తిరువనంతపురం, నవంబర్ 7: న్యూజిలాండ్‌పై స్వదేశంలో వనే్డ సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు అదే ఊపుతో ట్వంటీ-20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా జరిగిన నిర్ణాయక చివరి టి-20 మ్యాచ్‌లో భారత జట్టు 6 పరుగుల తేడాతో కివీస్‌ను మట్టికరిపించింది.

11/08/2017 - 02:53

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) శాంట్నర్ (బి) టిమ్ సౌథీ 8, శిఖర్ ధావన్ (సి) శాంట్నర్ (బి) టిమ్ సౌథీ 6, విరాట్ కోహ్లీ (సి) బౌల్ట్ (బి) ఇష్ సోధీ 13, శ్రేయాస్ అయ్యర్ (సి) మార్టిన్ గుప్టిల్ (బి) ఇష్ సోధీ 6, మనీష్ పాండే (సి) కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ (బి) ట్రెంట్ బౌల్ట్ 17, హార్దిక్ పాండ్య నాటౌట్ 14, మహేంద్ర సింగ్ ధోనీ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు: (లెగ్‌బైస్ 2, వైడ్ 1) 3, మొత్తం: 8 ఓవర్లలో 67/5.

11/08/2017 - 02:52

హోచిమిన్ సిటీ (వియత్నాం), నవంబర్ 7: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ బాక్సర్, రాజ్యసభ సభ్యురాలు మేరీ కోమ్‌తో పాటు సోనియా లాథర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

11/08/2017 - 02:51

న్యూఢిల్లీ, నవంబర్ 7: కళంకిత భారత ఒలింపిక్ సంఘ (ఐఓఏ) మాజీ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఐఓఏ కార్యవర్గ మండలి సమావేశంలో ప్రత్యక్షమయ్యాడు. ఎటువంటి ఆహ్వానం లేకుండానే ఆయన ఈ సమావేశానికి విచ్చేశాడు. అయితే చౌతాలా రాక పట్ల కొంత మంది ఐఓఏ సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో వెంటనే ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయాడు.

11/08/2017 - 02:49

నాగ్‌పూర్, నవంబర్ 7: సీనియర్ నేషనల్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్ బెర్తు కోసం ‘ఆంధ్రావాలా’ కిదాంబి శ్రీకాంత్, ‘జెయింట్ కిల్లర్’ హెచ్‌ఎస్.ప్రణయ్, మహిళల సింగిల్స్ ఫైనల్ బెర్తు కోసం ‘తెలుగు తేజం’ పివి.సింధు, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బుధవారం అమీతుమీ తేల్చుకోనున్నారు.

11/08/2017 - 02:49

న్యూఢిల్లీ, నవంబర్ 7: సవితా పునియా.. ఇప్పుడు భారత హాకీలో మార్మోగుతున్న పేరు ఇదే. జపాన్‌లోని కకమిగహరాలో ముగిసిన ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు టైటిల్ సాధించడంలో ఎంతో కీలక పాత్ర పోషించిన గోల్‌కీపర్ సవితా పునియాను ఇప్పుడు దేశంలోని కోట్లాది మంది హాకీ అభిమానులకు ఆరాధ్య దైవంలా పూజిస్తున్నారు.

11/07/2017 - 02:38

తిరువనంతపురం, నవంబర్ 6: న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ జరుగనున్న నిర్ణాయక మూడో మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత్, న్యూజిలాండ్ జట్లు చెరో విజయం సాధించి సమవుజ్జీలుగా నిలిచిన విషయం తెలిసిందే.

11/07/2017 - 00:40

న్యూఢిల్లీ, నవంబర్ 6: క్రికెట్ మ్యాచ్‌లలో టీమిండియా భారీ లక్ష్యాలను ఛేదించాల్సి వచ్చినప్పుడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి బంతి నుంచే బ్యాట్ ఝళిపించాలని లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెవాగ్ సలహా ఇచ్చాడు.

Pages