S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/07/2017 - 00:39

గోల్డ్ కోస్ట్, నవంబర్ 6: కామనె్వల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు మరో పసడి పతకం, రజత పతకం లభించాయి. సోమవారం ఇక్కడ జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో సత్యేంద్ర సింగ్, సంజీవ్ రాజ్‌పుట్ భారత్‌కు ఈ పతకాలను అందించారు. దీంతో భారత్ ఈ చాంపియన్‌షిప్స్‌లో మొత్తం 20 పతకాలను కైవసం చేసుకుని తన పోరాటాన్ని ఘనంగా ముగించింది.

11/07/2017 - 00:37

న్యూఢిల్లీ, నవంబర్ 6: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత్ రెండోసారి టైటిల్ కైవసం చేసుకుని 13 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవడంతో జట్టు ప్రధాన కోచ్ హరేంద్ర సింగ్ ఇప్పుడు మరింత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు.

11/07/2017 - 00:35

నాగ్‌పూర్, నవంబర్ 6: నేషనల్ సీనియర్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ మెడలిస్టులు పివి.సింధు, సైనా నెహ్వాల్‌తో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానానికి చేరుకున్న ‘ఆంధ్రావాలా’ కిదాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

11/07/2017 - 00:35

న్యూఢిల్లీ, నవంబర్ 6: హైదరాబాద్ బ్యూటీ క్వీన్ సానియా మీర్జా ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్ టాప్-10లో చోటు కోల్పోయింది. మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 2016 సీజన్ అంతటా అగ్రస్థానంలో నిలిచిన సానియా మీర్జా గత ఏడాది మార్చి 17వ తేదీ వరకూ అదే స్థానంలో కొనసాగిన విషయం తెలిసిందే.

11/07/2017 - 00:33

లాసానే్న, నవంబర్ 6: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో టైటిల్‌ను కైవసం చేసుకుని మరోసారి చాంపియన్‌గా ఆవిర్భవించిన భారత జట్టు మంగళవారం ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకెళ్లింది. ఆదివారం జపాన్‌లోని కకమిగహరాలో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో చైనాను ఓడించిన భారత జట్టు తాజా ర్యాకింగ్స్‌లో రెండు స్థానాలను మెరుగుపర్చుకుని పదో ర్యాంకుకు ఎగబాకింది.

11/06/2017 - 01:56

పదమూడేళ్ల సుదీర్ఘ స్వప్నం సాకారమైన క్షణమిది..్భరత మహిళా హాకీ బృందం అమోఘ ప్రతిభకు తార్కాణంగా ఆసియాకప్ కైవసమైంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ నారీ భేరీ మోగింది. ఫైనల్ షూటౌట్‌లో చైనాను చిత్తు చేసి భారత్ ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకుంది. గోల్ కీపర్ సవిత భారత జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు. హాకీ భేరీతో భారత్‌కు ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో పాల్గొనే అర్హత దక్కింది.

11/06/2017 - 01:09

కకమిగహరా (జపాన్), నవంబర్ 5: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం ఇక్కడ హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 5-4 గోల్స్ తేడాతో చైనాను ‘షూటౌట్’ చేసి ప్రతిష్టాత్మకమైన ఈ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించింది.

11/06/2017 - 01:03

జుహాయ్ (చైనా), నవంబర్ 5: చైనాలోని జుహాయ్‌లో జరిగిన డబ్ల్యుటిఎ ఎలైట్ టోర్నమెంట్‌లో జర్మన్ క్రీడాకారిణి జూలియా గోర్జెస్ సంచలనం సృష్టించింది. ఈ టోర్నీలో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె సింగిల్స్ ఫైనల్ పోరులో రెండో సీడ్ క్రీడాకారిణి కోకో వాండ్వెఘే (అమెరికా)ని మట్టికరిపించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

11/06/2017 - 01:02

కకమిగహరా (జపాన్), నవంబర్ 5: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు మరోసారి టైటిల్ సాధించడం పట్ల కెప్టెన్ రాణీ రాంపాల్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచ కప్ హాకీ టోర్నీలోకి ప్రతిభ ఆధారంగా ప్రవేశించడం తమకు ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొంది.

11/06/2017 - 01:00

కొలంబో, నవంబర్ 5: త్వరలో భారత పర్యటనకు రాబోతున్న శ్రీలంక క్రికెట్ జట్టులో బ్యాట్స్‌మన్ కుశల్ మెండిస్‌కు చోటు లభించలేదు. ఈ పర్యటన కోసం 15 మంది సభ్యులతో ఆదివారం శ్రీలంక జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు మెండిస్‌కు ఉద్వాసన పలికారు. 22 రెండేళ్ల కుశల్ మెండిస్ రెండేళ్ల క్రితం అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఇప్పటివరకూ వరుసగా 22 టెస్టుల్లో ఆడాడు.

Pages