S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/05/2017 - 00:44

డీ హాన్ (బెల్జియం), నవంబర్ 4: ప్రతిష్టాత్మక బెల్జియం ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాలెంజ్ టోర్నమెంట్‌లో భారత జోడీ ఆచంట శరత్ కమల్, జి.సత్యన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీ ఫైనల్స్‌లో వీరు జర్మనీకి చెందిన రెండో సీడ్ ప్యాట్రిక్ ఫ్రాంజిస్కా, రికార్డో వాల్థర్ చేతిలో 2-3 గేముల తేడాతో ఓటమిపాలవడంతో కాంస్య పతకాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.

11/05/2017 - 00:42

కకమిగహరా (జపాన్), నవంబర్ 4: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో టైటిల్ కోసం భారత జట్టు ఆదివారం ఇక్కడ మాజీ చాంపియన్ చైనాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థులను ఓడించి ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు బెర్తును ఖరారు చేసుకోవడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది.

11/04/2017 - 02:14

కకమిగహరా, నవంబర్ 3: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 4-2 గోల్స్ తేడాతో ఆతిథ్య డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌ను మట్టికరిపించిన భారత జట్టు ఫైనల్‌లో మరోసారి చైనాతో తలపడేందుకు సిద్ధమైంది.

11/04/2017 - 01:18

రాజ్‌కోట్, నవంబర్ 3: న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో భాగంగా శనివారం ఇక్కడి ఎస్‌సిఎ (సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో) జరుగనున్న రెండో మ్యాచ్‌కి టీమిండియా పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ సిరీస్‌లో ఇంతకుముందు న్యూఢిల్లీలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 53 పరుగుల తేడాతో కివీస్‌ను మట్టికరిపించిన విషయం విదితమే.

11/04/2017 - 01:15

హోచిమిన్ సిటీ (వియత్నాం), నవంబర్ 3: వియత్నాంలో జరుగుతున్న ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత సోనియా లాథర్‌తో పాటు భారత యువ బాక్సర్ నీరజ్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

11/04/2017 - 01:14

పారిస్, నవంబర్ 3: పారిస్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వరుసగా నాలుగో ఏడాది టాప్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న నాదల్ ప్రీక్వార్టర్ ఫైనల్ పోరులో ఉరుగ్వేకి చెందిన పాబ్లో కువాస్‌ను ఓడించాడు. అయితే ఈ మ్యాచ్‌లో విజయం కోసం నాదల్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

11/04/2017 - 01:12

గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా), నవంబర్ 3: ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామనె్వల్త్ చాంపియన్‌షిప్స్‌లో భారత షూటర్లు ప్రకాష్ నంజప్ప, అమన్‌ప్రీత్ సింగ్, జీతూ రాయ్ అద్భుతమైన ప్రదర్శనతో మరోసారి సత్తా చాటుకున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్తోల్ ఈవెంట్‌లో వారు అన్ని పతకాలను క్లీన్ స్వీప్ చేశారు.

11/03/2017 - 01:16

న్యూఢిల్లీ, నవంబర్ 2: గుంటూరుకు చెందిన భారత బాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరు స్థానాలను మెరుగు పరచుకొని ఏకంగా రెండో స్థానానికి దూసుకెళ్లాడు. అంతర్జాతీయ బాడ్మింటన్ సమాఖ్య (బిఎఐ) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో అతను మొత్తం 73,403 పాయింట్లతో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించాడు.

11/03/2017 - 01:15

న్యూఢిల్లీ, నవంబర్ 2: మ్యాచ్ జరుగుతున్నప్పుడు వాకీటాకీలో మాట్లాడిన సంఘటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) క్లీన్‌చిట్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో బుధవారం మొదటి టి-20 ఇంటర్నేషనల్ జరుగుతున్నప్పుడు, డగౌట్‌లో కూర్చున్న కోహ్లీ వాకీటాకీలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న వారితో మాట్లాడడం కనిపించింది. ఐసిసి నిబంధనల ప్రకారం సెల్‌ఫోన్లలో మాట్లాడడం నిషిద్ధం.

11/03/2017 - 01:13

గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా), నవంబర్ 2: భారత ఏస్ షూటర్ గగన్ నారంగ్ ఇక్కడ జరుగుతున్న కామనె్వల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో రజత పతకం సాధించాడు. గత ఏడాది జరిగిన రియో ఒలింపిక్స్ తర్వాత మొదటిసారి ఒక మేజర్ టోర్నమెంట్‌లో పోటీపడిన అతను ఫామ్‌ను కొనసాగించడం విశేషం. కాగా, మహిళల 50 మీటర్ల పిస్టల్ విభాగంలో అన్నూ రాజ్ సింగ్‌కు కాంస్య పతకం లభించింది.

Pages