S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/02/2017 - 00:28

విజయవాడ, నవంబర్ 1: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ సాధించి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని, భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి మనస్ఫూర్తిగా అభినందించింది. 40వ ర్యాంకర్ కెంటా నిషిమోటోపై శ్రీకాంత్ విజయం సాధించి తన కెరియర్‌లో ఐదో సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకోవడం దేశానికే గర్వకారణమని పేర్కొంది.

11/02/2017 - 00:27

బ్రిస్బేన్, నవంబర్ 1: ఇక్కడ జరుగుతున్న కామనె్వల్త్ షూటింగ్ పురుషులు, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్స్‌లో భారత్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో షాజార్ రిజ్వీ స్వర్ణం సాధించగా, ఓంకార్ సింగ్, జితూ రాయ్ వరుసగా రజత, కాంస్య పతకాలు గెల్చుకోవడం విశేషం. మొదటి మూడు స్థానాలను ఆక్రమించిన భారత్ మహిళల విభాగంలోనూ మొదటి రెండు స్థానాలను సొంతం చేసుకొని ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.

11/02/2017 - 00:25

నాగపూర్, నవంబర్ 1: జాతీయ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పోటీ పడేందుకు స్టార్లంతా సంసిద్ధమయ్యారు. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌ను సాధించిన కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ చాంపియన్‌షిప్స్, ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెల్చుకున్న తెలుగు తేజం పివి సింధు, మాజీ ప్రపంచ నంబర్ వన్ సైనా నెహ్వాల్ తదితరులు గురువారం నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో ఆడనున్నారు.

11/02/2017 - 00:24

ధన్‌బాద్, నవంబర్ 1: ఒక వనే్డ మ్యాచ్‌లో ఏకంగా 136 వైడ్స్ నమోదయ్యాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. బిసిసిఐ ప్రవేశపెట్టిన ఎన్‌ఇ బీహార్ అండర్-19 మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా మణిపూర్, నాగాలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వైడ్ల వరద పారింది. మణిపూర్ బౌలర్లు మొత్తం 94 వైడ్ బంతులు వేస్తే, నాగాలాండ్ కొంచం మెరుగ్గా 42 వైడ్స్‌ను ఇచ్చింది. చాలా బంతులు పిచ్‌కి దూరంగా ఎక్కడో పడ్డాయి.

11/01/2017 - 01:01

హైదరాబాద్, అక్టోబర్ 31: అంతర్జాతీయ బాడ్మింటన్ టోర్నమెంట్లలో ఇప్పటివరకూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చిన లిన్ దాన్, లీ చోంగ్ వెయి లాంటి మేటి ఆటగాళ్ల శకం ముగిసినట్లేనని, ఇప్పుడు ఈ టోర్నీల్లో ఎవరైనా రాణించేందుకు విస్తృతమైన అవకాశాలు లభిస్తున్నాయని భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.

11/01/2017 - 00:58

బ్రిస్బేన్, అక్టోబర్ 31: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతున్న కామనె్వల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో హీనా సిద్ధు మరోసారి సత్తా చాటుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో మంగళవారం ఆమె పసిడి పతకాన్ని కైవసం చేసుకుని భారత్‌కు అద్భుతమైన శుభారంభాన్ని ఇచ్చింది. ఈ ఈవెంట్‌లో సిద్ధు మొత్తం 626.2 (386+240.8) పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

11/01/2017 - 00:57

కకమిగహరా, అక్టోబర్ 31: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. చైనాతో జరిగిన గత మ్యాచ్‌లో 1-4 గోల్స్ తేడాతో విజయం సాధించిన భారత జట్టు మంగళవారం ఇక్కడ జరిగిన చివరి పూల్ గేమ్‌లో 2-0 గోల్స్ తేడాతో మలేషియా జట్టును మట్టికరిపించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది.

11/01/2017 - 00:57

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల వనే్డ క్రికెట్ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు అదే జట్టుతో మరో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో బుధవారం జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

11/01/2017 - 00:55

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: టీమిండియా పేసర్ల ద్వయం భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రాపై న్యూజిలాండ్ డాషింగ్ బ్యాట్స్‌మన్ కొలిన్ మున్రో ప్రశంసల వర్షం కురిపించాడు. భారత ఉపఖండంలోని పిచ్‌లపై కొత్త బంతితో మెరుపులు మెరిపించడంలో ఉత్తమ బౌలర్లు వారేనని అతను కొనియాడాడు. టీమిండియాతో కాన్పూర్‌లో జరిగిన నిర్ణాయక చివరి వనే్డలో మున్రో దూకుడుగా ఆడి అర్థ శతకంతో రాణించిన విషయం విదితమే.

10/31/2017 - 02:46

హైదరాబాద్, అక్టోబర్ 30: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మాజీ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎంవి శ్రీ్ధర్ గుండెపోటుతో మృతి చెందాడు. సుమారు నాలుగు సంవత్సరాలు బిసిసిఐ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్)గా సేవలు అందించిన శ్రీ్ధర్ గత నెల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం భోజనానికి వెళుతుండగా, గుండెపోటు ఉద్ధృతంగా రావడంతో అక్కడే కుప్పకూలి మృతి చెందాడు.

Pages