S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/14/2017 - 00:31

కొచ్చి, అక్టోబర్ 13: అండర్-17 సాకర్ వరల్డ్ కప్‌లో గ్రూప్ ‘సి’ నుంచి జర్మనీ, ఇరాన్ జట్లు ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాయి. ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 3-1 తేడాతో గునియాను సులభంగా ఓడించింది. ఈ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు కోసం కొలంబియాను ఢీ కొంటుంది.

10/14/2017 - 00:31

ఢాకా, అక్టోబర్ 13: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7-0 తేడాతో ఘన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు (28, 47 నిమిషాలు) గోల్స్ చేయగా, గుర్జాంత్ సింగ్ (7వ నిమిషం), ఆకాశ్‌దీప్ సింగ్ (10వ నిమిషం), లలిత్ ఉపాధ్యాయ (13వ నిమిషం), అమిత్ రోహిదాస్ (20వ నిమిషం), రమణ్‌దీప్ సింగ్ (46వ నిమిషం) తలా ఒక గోల్‌ను నమోదు చేశారు.

10/14/2017 - 00:30

విశాఖపట్నం, అక్టోబర్ 13: న్యూజిలాండ్ ‘ఎ’పై భారత్ ‘ఎ’ మరో విజయాన్ని నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి వనే్డ వర్షం కారణంగా రద్దుకాగా, రెండో మ్యాచ్‌ని భారత్ ‘ఎ’ గెల్చుకుంది. శుక్రవారం నాటి మూడో మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో విజయభేరి మోగించి, సిరీస్‌పై 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. న్యూజిలాండ్ ‘ఎ’ బ్యాట్స్‌మన్ జార్జి వర్కర్ సెంచరీ సాధించినప్పటికీ ఫలితం లేకపోయింది.

10/14/2017 - 00:30

పునే, అక్టోబర్ 13: ప్రో కబడ్డీలో శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో పునేరీ పల్టన్‌పై గుజరాత్ ఫార్ట్యూన్‌జెయింట్స్ 24 పాయింట్ల తేడాతో గెలిచింది. అద్వితీయ ప్రతిభతో విజృంభించిన సుకేశ్ హేగ్డె 15 పాయింట్లు సాధించడంతో, గుజరాత్ 44 పాయింట్లను అందుకోగలిగింది. సునీల్ కుమార్ ఏడు పాయింట్లు చేశాడు. పునేరీ పల్టన్ ఆటగాళ్లలో సురేష్ కుమార్ అత్యధికంగా ఆరు పాయింట్లు చేశాడు.

10/13/2017 - 01:05

హైదరాబాద్, అక్టోబర్ 12: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టి-20 ఇంటర్నేషనల్ సిరీస్ శుక్రవారంతో ముగుస్తుండగా, విజేత ఎవరనే సస్పెన్స్‌కు కూడా తెరపడనుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా చెరొక విజయంతో సమవుజ్జీగా నిలిచిన విషయం తెలిసిందే.

10/13/2017 - 01:04

హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం నాటి అత్యంత కీలకమైన చివరి, మూడో టి-20 ఇంటర్నేషనల్‌ను వర్షం భయం వెంటాడుతున్నది. గురువారం జల్లులు పడడంతో, ముందు జాగ్రత్త చర్యగా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. కాగా, గురువారం నగరంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.

10/13/2017 - 01:02

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: వేలాది మంది అభిమానుల సమక్షంలో గురువారం ఘనాతో గ్రూప్ ‘ఎ’లో తలపడిన భారత్ 0-4 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని, టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. కీలక విజయాన్ని నమోదు చేసిన ఘనా ప్రీ క్వార్టర్స్ చేరింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడడంతో, నాకౌట్ దశకు చేరుకునే అవకాశం భారత్‌కు దక్కలేదు. నిజానికి ఘనాతో జరిగిన మ్యాచ్ ఆరంభంలో భారత జట్టు గట్టిపోటీనిచ్చింది.

10/13/2017 - 01:00

హైదరాబాద్, అక్టోబర్ 12: వచ్చేనెల ఒకటో తేదీన న్యూఢిల్లీలో న్యూజిలాండ్‌తో జరిగే తొలి టి-20 ముగిసిన వెంటనే, కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు భారత వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రకటించాడు. అతను రిటైర్మెంట్ చెప్తాడని బిసిసిఐ అధికారి ఒకరు పిటిఐతో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. అదే వార్తను నెహ్రా గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ధ్రువీకరించాడు.

10/13/2017 - 00:57

సిడ్నీ, అక్టోబర్ 12: బెన్ స్టోక్స్ ఉంటేనే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్ గెల్చుకుంటుందా? అతను లేకపోతే, రాబోయే ఆ సిరీస్‌లో చేతులెత్తేస్తుందా? ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా అభిప్రాయం ప్రకారం ఆల్‌రౌండర్ స్టోక్స్ లేకపోతే ఇంగ్లాండ్ జట్టు బాగా బలహీన పడుతుంది. యాషెస్ సిరీస్ కోసం ఈనెల 28న ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ జట్టు బయలుదేరుతుంది.

10/13/2017 - 00:57

డబ్లిన్, అక్టోబర్ 12: ఇటీవలే టెస్టు హోదాను సంపాదించిన ఐర్లాండ్ జట్టు తన తొలి మ్యాచ్‌ని పాకిస్తాన్‌తో ఆడనుంద. ఐర్లాండ్ క్రికెట్ సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారెన్ డ్యూట్రామ్ ఈ విషయాన్ని ప్రకటించాడు. వచ్చే ఏడాది తొలి టెస్టు ఆడేందుకు అన్ని విధాలా సిద్ధమవుతామని చెప్పాడు. మొట్టమొదటి టెస్టును పాకిస్తాన్ వంటి బలమైన జట్టుపై ఆడడాన్ని అదృష్టంగా భావిస్తున్నామని తెలిపాడు.

Pages