S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/13/2017 - 00:56

జైపూర్, అక్టోబర్ 12: ప్రో కబడ్డీ లీగ్‌లో గురువారం యుపి యోద్ధను ఢీకొన్న జైపూర్ పింక్ పాంథర్స్ 21 పాయింట్ల తేడాతో చిత్తయింది. రిషాంక్ దేవాడిగ 28 పాయింట్లు సాధించి, యుపి యోద్ధ జట్టును విజయపథంలో నడిపాడు. జైపూర్ ఆటగాళ్లలో తుషార్ పాటిల్, నితిన్ రావల్ చెరి ఎనిమిది పాయింట్లు చేశారు.

చిత్రం..యుపి యోద్ధ, జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్‌లో ఓ దృశ్యం

10/11/2017 - 23:58

గువాహటి, అక్టోబర్ 11: ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని ఆగంతకుడు రాయితో దాడి చేశాడు. ఈ సంఘటనలో బస్సు అద్దం ఒకటి ధ్వంసమైంది. అయితే, సమీపంలోని సీటు ఖాళీగా ఉండడంతో ఎవరూ గాయపడలేదు. మంగళవారం భారత్‌తో జరిగిన రెండో టి-20 ఇంటర్నేషనల్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించిన ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1గా సమం చేసింది.

10/11/2017 - 23:57

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడని సమాచారం. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారి పిటిఐతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. అతను తెలిపిన వివరాల ప్రకారం, రిటైర్మెంట్‌పై నెహ్రా ఇప్పటికే జట్టు కోచ్ రవి శాస్ర్తీకి, కెప్టెన్ విరాట్ కోహ్లీకి తెలిపాడు.

10/11/2017 - 23:55

గువాహటి, అక్టోబర్ 11: టెస్టు క్రికెట్‌లో ఆడడమే తన లక్ష్యమని ఆస్ట్రేలియా సంచలన పేసర్ జాసన్ బెరెన్‌డార్ఫ్ స్పష్టం చేశాడు. మంగళవారం భారత్‌తో జరిగిన రెండో టి-20లో కేవలం 21 పరుగులిచ్చి, రోహిత్ శర్మ, మనీష్ పాండే, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ వికెట్లు పడగొట్టిన అతను ఆసీస్ విజయానికి బాటలు వేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

10/11/2017 - 23:54

క్విటో (ఈక్వెడార్), అక్టోబర్ 11: సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్‌తో రాణించి, 2018 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అర్జెంటీనా అర్హత పొందడంలో కీలక పాత్ర పోషించాడు. మెస్సీ మ్యాజిక్ పని చేయడంతో, ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌ని అర్జెంటీనా 3-1 తేడాతో గెల్చుకుంది. సొంత గడ్డపై, వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈక్వెడార్ మ్యాచ్ ఆరంభమైన మొదటి నిమిషంలోనే గోల్ సాధించింది. రొమారియో ఎల్బరా ఈ గోల్‌ను చేశాడు.

10/11/2017 - 23:52

గువహటి, అక్టోబర్ 11: ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు అండర్-17 సాకర్ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాయి. అమిన్ గుయిరీ రెండు గోల్స్ చేసి, జపాన్‌పై ఫ్రాన్స్‌కు 2-1 తేడాతో విజయాన్ని అందించాడు. 13వ నిమిషంలో తొలి గోల్ చేసిన అతను 71వ నిమిషంలో మరో గోల్ సాధించాడు. జపాన్ తరఫున తైసెయి మియాషిరో ఒక గోల్ చేశాడు.

10/11/2017 - 23:51

‘బాలికల సాధికారికలో క్రీడల పాత్ర’పై బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తదితరులతో సెల్ఫీ దిగుతున్న భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్. అంతకు ముందు అతను ముంబయలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ 75వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు.

10/11/2017 - 23:49

ఆమ్‌స్టర్‌డామ్, అక్టోబర్ 11: నెదర్లాండ్స్ కెప్టెన్ అర్జెన్ రాబెన్ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. అతను రెండు గోల్స్ సాధించడంతో, వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ చివరి మ్యాచ్‌లో స్వీడన్‌ను 2-0 తేడాతో ఓడించినప్పటికీ, 2018 వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ క్వాలిఫై కాలేదు.

10/11/2017 - 01:05

గౌహతి, అక్టోబర్ 10: భారత పర్యటనలో వరుస పరాజయాలతో డీలా పడిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు జూలు విదిల్చింది. మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి బర్సపరా స్టేడియంలో జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో కోహ్లీ సేనను మట్టికరిపించి చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడంతో పాటు 1-1తో సిరీస్‌ను సమం చేసింది.

10/11/2017 - 00:59

ఢాకా, అక్టోబర్ 10: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టు ఆదిలోనే కఠినమైన పరీక్ష ఎదును ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఆసియా ఖండంలో నెంబర్ వన్ హోదాను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్న భారత జట్టు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బుధవారం జపాన్‌తో జరిగే పూల్-ఏ ఆరంభ మ్యాచ్ ద్వారా తన పోరాటాన్ని ప్రారంభించనుంది.

Pages