S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/11/2017 - 00:57

దుబాయ్, అక్టోబర్ 10: దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌ను శ్రీలంక కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఇంతకుముందు అబుదాబిలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన శ్రీలంక జట్టు మంగళవారం దుబాయ్‌లో ముగిసిన రెండో టెస్టులో 68 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను మట్టికరిపించి 2-0 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది.

10/11/2017 - 00:56

విశాఖపట్నం, అక్టోబర్ 10: నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలను ఈ నెల 24 నుంచి 30 వరకు విశాఖలోని స్వర్ణ్భారతి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్టు డివిజనల్ రైల్వే మేనేజర్ ముకుల్ సరన్ మాథూర్ తెలిపారు.

10/11/2017 - 00:54

తాష్కెంట్, అక్టోబర్ 10: తాష్కెంట్ ఓపెన్ ఎటిపి టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాడు యూకీ బాంబ్రీ సత్తా చాటుతున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో శుభారంభాన్ని సాధించిన బాంబ్రీ.. అటు డబుల్స్‌లో కూడా దివిజ్ శరణ్‌తో కలసి టాప్ సీడ్ క్రీడాకారులపై విజయం సాధించడం ద్వారా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.

10/11/2017 - 00:54

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ట్రాక్ ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత సైక్లిస్టులు పతకాల పంట పండించారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియం కాంప్లెక్స్ వెలోడ్రోమ్‌లో మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో భారత సైక్లిస్టులు తొలి రోజే 9 పతకాలను కైవసం చేసుకున్నారు. వీటిలో ఐదు పసిడి పతకాలు ఉన్నాయి.

10/10/2017 - 00:36

గౌహతి, అక్టోబర్ 9: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత జట్టు మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో భాగంగా మంగళవారం గౌహతిలోని ఎసిఎ-బర్సపరా స్టేడియంలో జరుగనున్న రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. మరో సిరీస్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా భారత జట్టు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు బర్సపరా స్టేడియం ఆతిథ్యమివ్వనుండం ఇదే తొలిసారి.

10/10/2017 - 00:34

హైదరాబాద్, అక్టోబర్ 9: ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్) మూడో సీజన్ వేలంలో స్పెయిన్ సూపర్‌స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ కరోలినా మారిన్‌ను హైదరాబాద్ హంటర్స్ జట్టు మరోసారి నిలబెట్టుకుంది. ఈ వేలంలో హైదరాబాద్ హంటర్స్ రూ.50 లక్షలు వెచ్చించి మారిన్‌ను దక్కించుకుంది. అలాగే భారత టాప్ షట్లర్లు పివి.సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌ను కూడా వారి పాత జట్లే దక్కించుకున్నాయి.

10/10/2017 - 00:32

ఫిలడెల్ఫియా, అక్టోబర్ 9: నేషనల్ స్క్వాష్ చాంపియన్ జోత్స్న చిన్నప్ప యుఎస్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభాన్ని సాధించింది. ఇక్కడ జరిగిన తొలి రౌండ్‌లో ఆమె తన డబుల్స్ భాగస్వామి దీపికా పల్లికల్‌ను ఓడించింది.

10/10/2017 - 00:32

రొసారియో (అర్జెంటీనా), అక్టోబర్ 9: అర్జెంటీనాలోని రొసారియోలో జరుగుతున్న వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన జెమ్సన్ నింగ్‌తౌజమ్, అంకితా భక్త్ పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ రికర్వ్ ఈవెంట్‌లో వీరు ఈ పతకాన్ని గెలుచుకున్నారు.

10/10/2017 - 00:31

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు వరుసగా రెండవ పరాజయం ఎదురైంది. మూడు రోజుల క్రితం అమెరికాతో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో 3-0 గోల్స్ తేడాతో ఓటమిపాలైన భారత జట్టు సోమవారం ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 1-2 గోల్స్ తేడాతో కొలంబియా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. ఆరంభం నుంచే హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ ప్రథమార్థంలో ఇరు జట్లు ఒక్క గోల్‌ను కూడా సాధించలేదు.

10/09/2017 - 00:55

గౌహతి, అక్టోబర్ 8: అండర్-17 సాకర్ వరల్డ్ కప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. జపాన్ ఆటగాడు కెయిటో నాకమూర వరుసగా మూడు గోల్స్ సాధించడంతో, హోండురాస్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జపాన్ 6-1 తేడాతో విజయం సాధించింది. 22వ నిమిషంలో తొలి గోల్ చేసిన నాకమూర అదేఊపును కొనసాగిస్తూ, 30, 43 నిమిషాల్లో గోల్స్ సాధించాడు. తకేఫుసా కుబో 45, తైసెయ్ మియాషిరో 51 నిమిషాల్లో గోల్స్ చేశారు.

Pages